MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సినిమాలతో సంబంధం లేకుండా త్వరలో ఎన్టీఆర్ భారీ ఈవెంట్, ఏదైనా సంచలనం ఉంటుందా ?

సినిమాలతో సంబంధం లేకుండా త్వరలో ఎన్టీఆర్ భారీ ఈవెంట్, ఏదైనా సంచలనం ఉంటుందా ?

సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లో మాత్రమే ఫ్యాన్స్ ని మీట్ అవుతుంటారు. ఇటీవల కొన్నేళ్లుగా ఎన్టీఆర్ తన చిత్రాల ఈవెంట్స్ ద్వారా ఫ్యాన్స్ ని కలుసుకోవడం కుదర్లేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 12 2025, 09:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR

Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా నటించిన చిత్రం ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన ఒక ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటనతో సినీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ కూడా మొదలైంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లో మాత్రమే ఫ్యాన్స్ ని మీట్ అవుతుంటారు. ఇటీవల కొన్నేళ్లుగా ఎన్టీఆర్ తన చిత్రాల ఈవెంట్స్ ద్వారా ఫ్యాన్స్ ని కలుసుకోవడం కుదర్లేదు. దేవర చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.. కానీ ఇండోర్ ఈవెంట్ కావడంతో భారీగా అభిమానుల తాకిడి వల్ల అది రద్దయింది. ఇలా ఇతర హీరోల చిత్రాల ఈవెంట్స్ లో మాత్రమే ఎన్టీఆర్ అభిమానుల ముందుకు వస్తున్నారు. 

35
Jr NTR

Jr NTR

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సమ్మర్ వేదిక తగ్గాక త్వరలో అభిమానుల కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తానని తెలిపాడు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అయితే ఇది సినిమాకి సంబంధించిన ఈవెంట్ అని ఎన్టీఆర్ చెప్పలేదు. కేవలం ఫ్యాన్స్ కోసమే పకడ్బందీగా ప్లానింగ్ చేసి ఈవెంట్ నిర్వహిస్తానని.. తద్వారా ఫ్యాన్స్ ని కలుసుకుంటానని ఎన్టీఆర్ తెలిపారు. తమిళనాడులో రజనీకాంత్, దళపతి విజయ్ ఇదే తరహాలో సినిమాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని మీట్ అయ్యేందుకు మాత్రమే చిన్నపాటి ఈవెంట్స్ నిర్వహిచడం చూస్తున్నాం. 

45
Jr NTR

Jr NTR

ఇప్పుడు అదే స్ట్రాటజీని తారక్ ఫాలో అవుతున్నాడా అనే చర్చ మొదలైంది. సినిమా ఈవెంట్ కాకుండా.. సొంతంగా ఈవెంట్ ప్లాన్ చేసి ఫ్యాన్స్ ని కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ చుట్టూ రాజకీయాల గురించి కూడా తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. 

55

భవిష్యత్తులో ఎన్టీఆర్ నుంచి ఏదైనా సంచలన ప్రకటన ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. తాను నిర్వహించే ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఓపికతో ఎదురు చూడాలని.. నందమూరి ఫ్యాన్స్ అంటేనే సహనానికి మారుపేరు అని ఎన్టీఆర్ అన్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ స్వయంగా ఫ్యాన్స్ కోసం ఈవెంట్ నిర్వహించబోతుండడం టాలీవుడ్ లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర పరిణామం అని భావిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image2
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image3
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved