- Home
- Entertainment
- Janaki Kalaganaledu: ఇంటిని ఆక్రమించిన భాస్కర్ రావు.. ఎమోషనల్ అవుతున్న గోవిందరాజులు దంపతులు?
Janaki Kalaganaledu: ఇంటిని ఆక్రమించిన భాస్కర్ రావు.. ఎమోషనల్ అవుతున్న గోవిందరాజులు దంపతులు?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 10వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు జ్ఞానం ఈరోజు రాత్రి ఎలా గడుస్తుందో అని ఆందోళన పడుతున్నావా అని అడగగా రేపు ఏమవుతుందో అని భయపడుతున్నాను అని అంటుంది జ్ఞానాంబ. మన పరువు మన గౌరవం, పిల్లల భవిష్యత్తు అన్ని ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి. ఇల్లు అంటే కేవలం నీడ మాత్రమే కాదు ఒక ధైర్యం అని అంటుంది. జానకి ఎలా అయితే రామచంద్ర కోసం నమ్మకంగా ఎదురు చూస్తుందో నేను కూడా మన కుటుంబం వీధిన పడకుండా ఉంటుందని ఆ అమ్మవారి పై నమ్మకం పెట్టికున్నాను అని అంటుంది జ్ఞానాంబ. కష్టాలు మనకి కొత్తవి కావు కదా అనగా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళని పిలుచుకొని ఎక్కడికి వెళ్దాం ఎక్కడ తలదాచుకుంటాము. జెస్సీ ప్రెగ్నెంట్ గా ఉంది తన పరిస్థితి ఏంటి అని అంటుంది.
ఇంట్లో పెళ్లి కాని కూతురు కూడా ఉంది తన భవిష్యత్తు ఏంటి అని అనడంతో గోవిందరాజులు ఆలోచనలో పడతాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే బాధతో గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయంగా ఉంది అనడంతో అలా మాట్లాడకు జ్ఞానం అని అంటాడు గోవిందరాజులు. రామచంద్ర వెళ్లాడు తీసుకుని వస్తాడు ధైర్యంగా ఉండు అని అంటాడు గోవిందరాజులు. మరొకవైపు జానకి రామచంద్ర కోసం రాత్రంతా అలాగే ఎదురుచూస్తూ బయటనే పడుకుని ఉంటుంది. ఇంతలో చికిత వచ్చి జానకి నిద్ర లేపడంతో జానకి తన గదిలోకి వెళ్లి రామచంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. రామచంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో జానకి అక్కడికి రావడంతో రామచంద్ర ఇంకా రాలేదా అని అడగగా రాలేదు మామయ్య అని అంటుంది.
అప్పుడు మల్లిక ముఖం చూపించలేక ఎక్కడికైనా పారిపోయాడేమో అని అంటూ అంత పెద్ద తప్పు చేయలేదు మంచితనంతో స్నేహం చేతిలో మోసపోయాడు అని అంటాడు గోవిందరాజులు. అన్నయ్య నిన్న వెళ్ళాడు ఇంకా రాలేదు డబ్బులు అడ్జస్ట్ అయ్యాయో లేదో భాస్కర్ రావు గారు వస్తే ఇప్పుడు ఏం సమాధానం చెబుతాము అని అంటాడు విష్ణు. ఇంతలోనే భాస్కర్ రావు జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. ముందు డబ్బులు ఉన్నాయా లేదా ఆ విషయం చెప్పండి అని అంటాడు. ఇంతలోనే రామచంద్ర వట్టి చేతులతో దిగాలుగా ఇంటికి వస్తాడు. అప్పుడు రామచంద్రవైపు అందరూ టెన్షన్ గా చూస్తూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు రామచంద్ర వెళ్లిన పని అయిందా డబ్బులు అడ్జస్ట్ అయ్యాయా అని అడగగా లేదు నాన్న అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
అప్పుడు మల్లిక ఎవరు ఇస్తారు ఎలా ఇస్తారు. స్వలాభం కోసం అప్పు చేసి ఇప్పుడు బయట తిరిగినట్టు యాక్టింగ్ చేసి ఇప్పుడు ఇంటికి వస్తే ఎవరు నమ్ముతారు బావగారు అని అంటుంది. అప్పుడు జానకి సీరియస్ అవుతూ ఉమ్మడి కుటుంబాన్ని ఆస్తి వెనకేసుకొనే అంత చౌక దారు మనుషులం కాదు. అయినా ఇటువంటి సమయంలో అందరూ కలిసి ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి కానీ ఇలా మాట్లాడకూడదు అని అంటుంది. మరి అంత రోషమున్నవాళ్ళు అలాంటి పని చేయకూడదు అని అంటుంది మల్లిక. అప్పుడు భాస్కర్ రావు మాట రాకూడదని ముందే చెప్పాను. అప్పు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ముందే చెప్పాను కదా అని అంటాడు. ఐదు లక్షలు సిద్ధంగా ఉన్నాయి అని జ్ఞానాంబ అనడంతో వెంటనే రామచంద్ర ఇవ్వాల్సింది చాలా పెద్ద మొత్తం ఇంకొద్దీ రోజులు గడువు ఇవ్వండి అనడంతో అని అంటాడు భాస్కర్ రావు.
మాటంటే మాటే రామచంద్ర నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టావు అంటే నేను నిన్ను అస్సలు నమ్మను అని అంటాడు. వ్యాపారం చేసుకునే వాడిని నా భయం నాకు ఉంటుంది కదా ఇల్లు అప్పగించి తీరాల్సిందే అని అంటాడు భాస్కర్ రావు. అప్పుడు జ్ఞానాంబ ని భాస్కర్ రావు నిలదీయడంతో నా గొంతులో ప్రాణం ఉండగా ఎప్పుడు అలాంటి పని చేయను అని అంటుంది. మీరు అన్నట్టుగా ఇల్లు ఇప్పుడే మీకు అప్పగిస్తున్నాం అనడంతో అందరూ షాక్ అవుతారు. ఐదు లక్షల తీసుకొచ్చి ఇవ్వడంతో మీ విష్ణుకి ఇచ్చిన అప్పు సరిపోయింది చాలా వడ్డీ ఇవ్వాలి దానికి గాను మీ కారు ఉంచుకుంటున్నాను అని అంటాడు. అంతేకాకుండా 20 లక్షలకు వడ్డీకి గాను షాప్ ని కూడా ఉంచుకుంటున్నాను మీరు ఇంట్లో ఒక సామాన్లు కూడా తీసుకొని వెళ్లడానికి వీల్లేదు అనడంతో సరే అని అంటుంది జ్ఞానాంబ.
అప్పుడు అందరూ కలిసి కాగితాల పై సంతకం చేస్తారు. అప్పుడు అందరూ కలిసి రామచంద్రని నిందిస్తూ ఉండగా రామచంద్ర ఏడుస్తూ నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అమ్మ. ఆ డబ్బులు నా సొంత ఖర్చులకోసం నేను ఉపయోగించలేదు అని అంటాడు. తర్వాత ఎవరి రూములోకి వాళ్ళు వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు జ్ఞానాంబ ఆ ఇంటిలో ఉన్న జ్ఞాపకాలు తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. మీరే కాదండి నేను బిడ్డల్ని కానీ ఏంటిది దేవాలయంగా భావించాను ఇంటిలో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి ఇప్పుడు వెళ్లాలి అంటే నా ప్రాణం పోయినట్టుగా ఉంది అని అంటుంది జ్ఞానాంబ. మరొకవైపు తన గదిలోకి వెళ్ళిన రామచంద్ర, జానకి బాధపడుతూ ఉంటారు.x\\\