- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకిపై సీరియస్ అయిన రామచంద్ర.. జెస్సిని రెచ్చగొడుతున్న మల్లిక?
Janaki Kalaganaledu: జానకిపై సీరియస్ అయిన రామచంద్ర.. జెస్సిని రెచ్చగొడుతున్న మల్లిక?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 15 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో లాయర్ మాట్లాడుతూ మీ తమ్ముడు కేసులో ప్రధాన సాక్షి మీ భార్య జానకి తనుని ఎలా అయిన ఒప్పించి కేసు విత్ డ్రా చేయించండి అని అంటాడు లాయర్. అలా చేస్తే వెంటనే మీ తమ్ముడికి బేయిల్ దొరికే అవకాశం ఉంటుంది అని అంటాడు లాయర్. అప్పుడు ఎలా అయినా మీరు మా తమ్ముని కాపాడాలి సార్ అని రామచంద్ర అనడంతో ఫస్ట్ మీరు మీ భార్యని ఒప్పించండి తర్వాత అంతా నేను చూసుకుంటాను అని అంటాడు లాయర్. మరొకవైపు జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఉన్న జెస్సి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు అందరూ అఖిల్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ లాయర్ ఏమంటారో అఖిల్ కి బెయిల్ వస్తుందో లేదో అని టెన్షన్ గా ఉంది అండి అని అంటుంది. మరొకవైపు మల్లిక జెస్సి తల్లిదండ్రుల కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి జెస్సీ తల్లిదండ్రులు వస్తారు. అప్పుడు జెస్సీ వాళ్ళ తల్లిదండ్రులను చూసి ఎమోషనల్ అవుతూ వెళ్లి నాన్న అని గట్టిగా హద్దుకుంటుంది. ఇప్పుడు జెస్సి తల్లిదండ్రులు జెస్సి ఇ ఏమి కాదు జెస్సి ఏడవకు అని ఓదారుస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి రామచంద్ర, విష్ణు వస్తారు.
అప్పుడు జ్ఞానాంబ లాయర్ ని కలిసావా రామా బెయిల్ వస్తుందన్నారా అని అనడంతో అది మన చేతుల్లోనే ఉంది అని చెప్పారమ్మా అని అంటాడు రామచంద్ర. జానకి గారు కేసు వెనక్కి తీసుకుంటే తప్ప బెయిల్ వచ్చే అవకాశం లేదు అని చెప్పారు అనటంతో జ్ఞానాంబ దంపతులు జానకి వైపు చూస్తారు. అప్పుడు జెస్సి తల్లిదండ్రులు జానకి దగ్గరికి వెళ్లి జానకిని కేసు విత్ దగ్గర డ్రా చేసుకోమని బ్రతిమలాడుతూ ఉంటారు. కానీ జానకి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
ఆ తర్వాత జెస్సి తల్లిదండ్రులు జెస్సీని తీసుకెళ్తాము అని అనడంతో స్వారీ అమ్మ నేను రాలేదు నా స్వార్థం నేను చూసుకోలేను అని అంటుంది. రామచంద్ర జానకి దగ్గరికి వెళ్లి మీన్యాయం అందర్నీ బాధ పెడుతుంది జానకి గారు మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని అంటాడు. నేను ఇంతకంటే మీకు ఇంకా ఎక్కువగా చెప్పలేను జానకి గారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రామచంద్ర. ఆ తర్వాత జానకి ఎందుకు అందరూ తప్పు చేసిన అఖిల్ ని దోషిలా చూడకుండా నన్ను దోషిలా చూస్తున్నారు అని ఏడుస్తూ ఉంటుంది.
ఆ తర్వాత మల్లిక తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా జ్ఞానాంబ తో జానకిని తిట్టించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మల్లిక. మరొకవైపు గోవిందరాజు దంపతులు అఖిల్ అన్నమాటలు తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ నా పెద్ద కోడలు ఇంటి పరువు పోయే తప్పు ఎప్పుడు చేయదు అన్న భావన ఒక పక్కన నా పెంపకం ఎప్పుడు అంత పెద్ద తప్పు చేయదు అన్న భావన ఒక పక్కన నన్ను వేధిస్తోంది అంది అంటూ జ్ఞానాంబ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు అఖిల్ కోసం ఏడుస్తూ జెస్సి బాధపడుతూ ఉండగా ఉండలో మల్లిక అక్కడికి వస్తుంది.
అప్పుడు మల్లిక జెస్సి దగ్గరికి వెళ్లి జానకి గురించి మల్లిక లేనిపోనివన్నీ చెప్పి జెస్సి ని రెచ్చగొడుతూ ఉంటుంది. నీ విషయంలో ఆయన జానకి ఎందుకు ఇంత కక్ష కట్టిందో అర్థం కావడం లేదు చేస్తే అంటూ జానకిని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మల్లిక. అప్పుడు మల్లికా మాట్లాడుతున్న మాటలు అన్నీ విన్న రామచంద్ర షాక్ అవుతాడు. అప్పుడు మల్లిగా అగుపుల్ల గీశాను ఇది ఇంకా ఫైర్ అవుతుంది అని మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది.