- Home
- Entertainment
- రామ్‌చరణ్‌ని భయపెడుతున్న `జెర్సీ` రిజల్ట్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్.. చివరకు ఇలా అవుతుందేంటి?
రామ్‌చరణ్‌ని భయపెడుతున్న `జెర్సీ` రిజల్ట్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్.. చివరకు ఇలా అవుతుందేంటి?
రామ్‌చరణ్ ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్`తో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ హిందీలో వచ్చిన `జెర్సీ` సినిమా ఫలితం మాత్రం ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ని టెన్షన్ పెడుతుంది.

పాన్ ఇండియా స్టార్స్ లో ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో రామ్‌చరణ్. రాజమౌళితో చేసిన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. హిందీ, ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దుమ్మురేపింది. ఏకంగా 1100కోట్లు కలెక్ట్ చేసి `బాహుబలి` తర్వాతి స్థానంలో ఉంది. ఈ చిత్రంతో ఇందులో నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కి సైతం మంచి క్రేజ్ వచ్చింది.
అయితే `ఆర్‌ఆర్‌ఆర్` తో వచ్చిన క్రేజ్‌ని మరింతగా పెంచుకుంటున్నారు రామ్‌చరణ్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన దేశంలోని పలు ప్రదేశాలను తిరిగారు. `ఆర్‌ఆర్‌ఆర్` థియేటర్లని విజిట్ చేశారు. ఆర్మీజవాన్లని, అభిమానులను కలుసుకున్నారు. ముంబయిలో మీడియాతోనూ ఇంటరాక్ట్ అయ్యారు. మొత్తంగా ఎన్టీఆర్ కంటే ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటూ `ఆర్‌ఆర్‌ఆర్` క్రెడిట్‌ని రాజమౌళి తర్వాత తనూ బాగా పొందారు. ఈ క్రేజ్‌ని తన నెక్ట్స్ సినిమాలకు వాడుకోబోతున్నారు చరణ్.
ప్రస్తుతం రామ్‌చరణ్ మరో పాన్ ఇండియా సినిమా శంకర్‌తో చేస్తున్నారు. `ఆర్‌సీ 15` వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తుంది. ఇందులో చరణ్ సీఎంగా, ఐఏస్ అధికారిగానూ కనిపించబోతున్నట్టు టాక్. శంకర్‌కి పాన్ ఇండియా ఇమేజ్ ఉండటం, ఇప్పుడు చరణ్‌కి కూడా ఆ ఇమేజ్ రావడంతో ఈ చిత్రంపై బజ్ బాగానే ఉంది.
కానీ బాలీవుడ్‌లో ఈ శుక్రవారం విడుదలైన `జెర్సీ` చిత్రం ఇప్పుడు రామ్‌చరణ్‌ని టెన్షన్‌కి గురి చేస్తుంది. ఇది తెలుగులో వచ్చిన `జెర్సీ`కి రీమేక్. తెలుగులో మంచి విజయం సాధించింది. మొదట డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది. ఏకంగా జాతీయ అవార్డుని కూడా అందుకుంది. తెలుగులో రూపొందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే హిందీ చిత్రాన్ని రూపొందించారు. అయితే శుక్రవారం విడుదలైన `జెర్సీ` చిత్రానికి డివైడ్ టాక్ వస్తుంది. కేఆర్‌కే వంటి చాలా మంది దీన్ని డిజాస్టర్‌గా వర్ణిస్తూ రివ్యూలిచ్చారు. సినిమా స్లోగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. తెలుగు అంతటి ఫీల్ రీమేక్‌లో లేదనే విమర్శలు వస్తున్నాయి. కొంత మంది క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ చిత్రం తొలి రోజు కేవలం నాలుగు కోట్ల నెట్‌ని కలెక్ట్ చేసింది. చాలా వీక్ ఓపెనింగ్స్ రావడం కూడా సినిమా పరాజయం చెందిందనే దానికి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు నెటిజన్లు. శనివారం, ఆదివారం మరికొన్ని థియేటర్లు తగ్గాయట. ఈ సినిమా థియేటర్లలో `కేజీఎఫ్ 2`వేస్తున్నారని సమాచారం. దీంతో ఇక `జెర్సీ` పని ఔట్. ఇదే జరిగితే రామ్‌చరణ్ సినిమాపై తీవ్ర ప్రభావం పడబోతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గౌతమ్ తిన్ననూరితో చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్‌సీ16`గా ఈ చిత్రం రూపొందనుంది. పాన్ ఇండియాని మించి ఈ సినిమా ఉండబోతుందని గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఓ సరికొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. అయితే చరణ్ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో `జెర్సీ` ఫలితం వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా మార్కెట్‌పై తీవ్ర ప్రభావాని చూపిస్తుందని టెన్షన్ పడుతున్నారట చరణ్.
ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా ఇమేజ్‌ని తెచ్చుకున్న ఆయన ఓ ఫ్లాప్ సినిమా డైరెక్టర్‌తో సినిమా అంటే దానికి బజ్ ఉండదు, మార్కెట్ పరంగానూ క్రేజ్ ఉండదు, ఇది చరణ్ పాన్ ఇమేజ్‌ని ప్రభావితం చేస్తుంది. అందుకే చరణ్‌లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది. మరి దీన్ని చరణ్ ఎలా మ్యానేజ్ చేస్తారనేది చూడాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం వర్రీ అవుతున్నారని టాక్.
ఇదిలా ఉంటే చరణ్ ఈ శుక్రవారం `ఆచార్య` చిత్రంతో రాబోతున్నారు. ఈ సినిమాకి కూడా పెద్దగా బజ్ లేదు. కాకపోతే ఇది జస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా సక్సెస్ కూడా ఇప్పుడు చరణ్‌కి ముఖ్యమే కాబోతుంది. మరి ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.