- Home
- Entertainment
- ప్యాంట్ విప్పి రోడ్డుపై పరిగెత్తిన జేడీ చక్రవర్తి, డైరెక్టర్ ఏదో చెబితే మరేదో చేసిన హీరో
ప్యాంట్ విప్పి రోడ్డుపై పరిగెత్తిన జేడీ చక్రవర్తి, డైరెక్టర్ ఏదో చెబితే మరేదో చేసిన హీరో
టాలెంట్ ఉంటే చాలు, అవకాశాలు సాధించడానికి ఎంత కష్టం అయినా పడటానికి ఆర్టిస్ట్ లు రెడీగా ఉంటారు అని నిరూపించాడు నటుడు జేడీ చక్రవర్తి. దర్శకుడు ఏదో చెప్పాడని ప్యాంట్ విప్పి రోడ్డుమీద పరుగులు పెట్టాడు జెడీ. కారణం ఏంటంటే?

జేడీ చక్రవర్తి కెరీర్
మనీ, గులాబీ, బొంబాయి ప్రియుడు.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించాడు JD చక్రవర్తి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు, సిరీస్ లు చేస్తున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోగా బిజీగా ఉన్న జేడీ.. ఆతరువాత పెద్దగా కనిపించలేదు. అయితే అప్పుడప్పుడు మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ హడావిడి చేస్తున్నారు. కెరీర్ లో ఏమాత్రం రాజీ లేని జీవితాన్ని గడిపిన జేడీ.. కాంట్రవర్సీల విషయంలో కూడా ముందుంటాడు. ఈమధ్య పలు ఇంటర్వ్యూలలో తన కెరీర్ గురించి, ఆర్జీవీ, కృష్ణవంశీలతో తన అనుబంధం ఎన్నో విషయాలు పంచుకున్నాడు చక్రవర్తి.
KNOW
ప్యాంట్ విప్పి పరిగెత్తిన జేడీ చక్రవర్తి.
ఓ ఇంటర్వ్యూలో జెడి మాట్లాడుతూ.. "కెమెరా ముందు నేను ఏం చేయడానికి అయినా రెడీ. నాకు కృష్ణవంశీ లైఫ్ ఇచ్చాడని తెలుసు. కానీ గులాబీ సినిమా కంటే ముందు నుంచే కృష్ణవంశీ నాకు తెలుసు. ఆర్జీవీ దగ్గర్నుంచి మేము ఇద్దరం క్లోజ్." అని అన్నారు. "గులాబీ సినిమా ముందు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ బయట నేను, కృష్ణవంశీ మాట్లాడుకుంటున్నాము. కృష్ణవంశీ యాక్టర్ అంటే ఎలా ఉండాలో చెపుతున్నాడు. అతను ఏదో మాట్లాడుతూ.. యాక్టర్ అంటే అతనిలో ఎంత ఇంటెన్స్ ఉండాలంటే ప్యాంట్ తీసి అండర్ గార్మెంట్స్ మీద పరిగెత్తాలని చెప్పారు. రోడ్ మీదకు చూసేసరికి ఎవరో అండర్ గార్మెంట్స్ మీద పరిగెత్తుతున్నాడు అంటూ పక్కన వాళ్లకు చెప్పారు. చూస్తే అది నేనే. కృష్ణవంశీ మాట కూడా పూర్తి చేయకుండానే నేను ప్యాంట్ తీసేసి పరిగెత్తాను. నాలో అంత కసి ఉంది." అని అన్నాడు జేడి.
జేడీ చక్రవర్తి కెరీర్ ను నిలబెట్టిన గులాబీ
JD చక్రవర్తి , డైరెక్టర్ కృష్ణవంశీ ఇద్దరూ ఆర్జీవీ (Ram Gopal Varma) దగ్గర కెరీర్ ప్రారంభించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో JD చక్రవర్తి హీరోగా పరిచయం అయిన సినిమా ‘గులాబీ’ (1995). ఈసినిమా JDకి కెరీర్‌ను నిలబెట్టింది. భారీ విజయాన్ని అందించింది. ‘గులాబీ’ ఒక క్రైమ్‑రొమాంటిక్ చిత్రం. ఈసినిమా కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు సైతం తెచ్చిపెట్టింది
శివ సినిమాతో కెరీర్ స్టార్ చేసిన చక్రవర్తి.
రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా శివతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు జేడీ చక్రవర్తి. ఈసినిమాలో విలన్ పాత్రలో జేడీ మెప్పించాడు. ఆతరువాత కొన్ని సహాయా పాత్రలు చేసిన ఆయన.. వన్ బై టూ, మనీ మనీ, గులాభి, లాంటి సినిమాలో హీరోగా మారాడు. అంతే కాదు ఎగిరే పావురమా, బొంబాయి ప్రియుడు లాంటి కమర్షియల్ హిట్స్ కూడా జేడీ కెరీర్ లోఉన్నాయి. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన చక్రవర్తి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు.