5 కోట్లు బడ్జెట్ పెడితే, 90 కోట్లు సంపాదించిన చిన్న సినిమా ఏదో తెలుసా?
ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించి ఆశ్చర్చపరుస్తున్నాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు 10 రెట్లు లాభాలను అందిస్తున్నాయి. తాజాగా ఓ చిన్న సినిమా భారీ విజయంతో కాలర్ ఎగరేస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా?

ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నిర్మించినా, కంటెంట్ బలంగా ఉండటంతో పెద్ద వసూళ్లు సాధిస్తున్నాయి. తాజాగా, కన్నడంలో విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ (Su From So) అనే సినిమా కూడా అదే కోవలోకి చేరింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది.
KNOW
సు ఫ్రమ్ సో మూవీని లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్ పి. శెట్టి నిర్మించారు. జె.పి. దుమినాద్ అనే కొత్త డైరెక్టర్, ఈసినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రారంభంలో పెద్దగా ప్రచారం లేకపోయినా, విడుదలైన వెంటనే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా ఒక్కసారి పుంజుకుని మంచి వసూళ్లను సాధించింది.
5.5 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా 90 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్ లో రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యకరం.కన్నడలో మాత్రమే కాదు తెలుగు, మలయాళంలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మలయాళంలో ఈసినిమాను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కు సబందించిన వేఫేరర్ సంస్థ మలయాళ హక్కులను సొంతం చేసుకొని ఆగస్ట్ 1న కేరళలో విడుదల చేసింది. అక్కడ కూడా సినిమా మంచి స్పందన సాధించింది.
తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సు ఫ్రమ్ సో సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ యూత్ ను బాగా ఆకట్టుకుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, కథనం, న్యూయేజ్ స్టోరీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడంతో వసూళ్లు ఊపందుకున్నాయి.
ఇప్పటి వరకు ఈసినిమా 90 కోట్ల మార్క్ను దాటింది. ఇక రాబోయే రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చిన్న బడ్జెట్ సినిమాలు కంటెంట్ బలంతో బాక్సాఫీస్ వద్ద ఎలా విజయం సాధించగలవో 'సు ఫ్రమ్ సో' మరోసారి నిరూపించింది.