100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న జయసుధ..? అక్కడే పొరపాటు జరిగిందా..?
జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు చేయనివారు అంటూ ఉండరు. కాని ఆ చిన్న పొరపాటే జీవితాంతం బాధపడే లా చేసిందంటే.. సరిగ్గా ఆలానే తన జీవితంలో కూడా జరిగిందన్నారు సీనియర్ తార జయసుధ.

Jayasudha
దాదాపు నాలుగు దశాబ్ధాలకుపైగా నటిస్తూ.. తన జోరును కొనసాగిస్తూనే ఉన్నారు సీనియరన్ నటి జయసుధ. హీరోయిన్ గా . ఎన్టీఆర్ ... ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు, కృష్ణ, మోహన్ బాబులాంటి స్టార్స్ తో ఆడి పాడింది జయసుధ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసిన జయసుధ ప్రస్తుతం అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు.
హీరోయిన్ గా దశాబ్ధాల పాటు కొనసాగిన సీనియర్ తార.. ఆతరువాత అక్క, వదిన, తల్లి పాత్రలు చేశారు. ఈమధ్యకాలంలో ఆమె బామ్మ పాత్రలు కూడా చేస్తున్నారు. ఇక వందల సినిమాల్లో నటించిన జయసుధ.. కోట్ల ఆస్తులను కూడా కూడబెట్టారు. అంతే కాదు కోట్లలో ఆస్తులనుపోగొట్టుకున్నారు కూడా. తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
జయసుధ మాట్లాడుతూ.... ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలనేది నా అభిప్రాయం. సొంత సినిమాల కారణంగా నష్టపోయానన్నారు జయసుధ. చెన్నైలో ఓ ప్రాపర్టీ విషయంలో 100 కోట్లు నష్టపోయాను అన్నారు జయసుధ. చెన్నైలో ఒక ప్రాంతంలో స్థలం తీసుకుని పెద్ద బిల్డింగ్ కట్టాను. ఆ విషయం తెలిసి 'చాలా మంచి పనిచేశావ్' అని శోభన్ బాబుగారు కూడా అభినందించారు. కానీ ఆ తరువాత వచ్చిన స్లంప్ కారణంగా ఆ బిల్డింగ్ రెంట్ కి కూడా పోలేదు.
దాంతో ఆ బిల్డింగ్ ను అమ్మాల్సి వచ్చింది. అప్పుడు అమ్మకుండా ఉంటే ఇప్పుడు వందల కోట్లు పలికేది. ఇప్పుడు అది ఇంకా బిజీ సెంటర్ అయింది. అలాగే ఇంకొక చోట 9 ఎకరాలు కొన్నాను. కానీ అక్కడి నేలలో బోర్ పడలేదని అమ్మేశాను. ఇప్పుడు దాని విలువ 100 కోట్లకి పైనే ఉంటుంది. ఆ స్థలానికి ఆనుకునే రజనీకాంత్ గారి ఫామ్ హౌస్ కూడా ఉంది అని అన్నారు జయసుధ.
ఇలా తాను కోల్పోయిన వందల కోట్ల ఆస్తుల గురించి వివరించారు జయసుధ. ఇక ఆమె పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నారు జయసుధ. ఆమె మాట్లాడుతూ.. నా అసలు పేరు సుజాత .. అది స్క్రీన్ కు సరిగ్గా లేదని.. తమిళ దర్శక రచయిత గుహనాథన్ గారు నా పేరును జయసుధగా మార్చారు. 'జ్యోతి' సినిమాతో నా కెరియర్ దూసుకెళ్లింది. అప్పటి నుంచి వరుస ఆపర్లు వచ్చాయన్నారు. జయప్రద - శ్రీదేవి వంటి గ్లామరస్ హీరోయిన్స్ మధ్య నేను నా ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగాను. వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో కూడా నాకు అవార్డులు రావడం నిజంగా విశేషం అన్నారు జయసుధ.