నాగబాబుని ప్రేమగా 'బావ' అని పిలిచే నటి ఎవరో తెలుసా..కాఫీకి పిలిచి కవర్లో డబ్బు పెట్టారు, మొత్తం బయటపెట్టింది
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నిర్మాతగా కూడా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. బుల్లితెరపై మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. నాగబాబు తన స్థాయిలో కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ ఉంటారు.
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నిర్మాతగా కూడా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. బుల్లితెరపై మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. నాగబాబు తన స్థాయిలో కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ ఉంటారు. జబర్దస్త్ కమెడియన్లు, ఇతరులు పలు సందర్భాల్లో నాగబాబు మంచి మనసు గురించి చెప్పడం వింటూనే ఉన్నాం.
ఇటీవల ఒక సీనియర్ నటి నాగబాబు మంచి మనసు గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు వ్యాంప్ తరహా పాత్రల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత నాగబాబు గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకి చాలా మంది అండగా నిలిచినవాళ్లు ఉన్నారు కానీ ఆర్థికంగా సహాయం చేసింది మాత్రం నాగబాబు అని జయలలిత తెలిపారు.
2017 నుంచి నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో నాగబాబు చాలా సహాయం చేశారు. కష్టాల నుంచి నన్ను గట్టెక్కించారు. పరుచూరి గోపాల కృష్ణ లాంటి వారి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ నేను ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదు.నాగబాబు దగ్గర మాత్రమే డబ్బు తీసుకున్నా. మిగిలినవాళ్లు దగ్గర నాకు డబ్బు తీసుకోవాలని అనిపించదు.
నాగబాబు మాత్రమే నాకు ఆత్మీయుడిలా అనిపిస్తారు. ఆయన డబ్బు ఇస్తే మొహమాటం లేకుండా తీసుకుంటాను. ఆయన్ని నేను ప్రేమగా బావా అని పిలుస్తాను అంటూ జయలలిత క్రేజీ కామెంట్స్ చేసింది.
ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు జయ రా కాఫీ తాగి వేళ్ళు అని పిలుస్తారు. వెళ్లే ముందు కవర్ లో డబ్బు పెట్టి ఇస్తారు అంటూ జయలలిత నాగబాబు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంది. నాగబాబు డబ్బు ఇస్తే నా మనిషి నాకు ఇచ్చాడు అనే ఫీలింగ్ ఉంటుంది అంటూ జయలలిత తెలిపారు. జయలలిత చివరగా తెలుగులో మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలో స్పీకర్ పాత్రలో నటించారు.