- Home
- Entertainment
- `జటాధర` మూవీ 6 రోజుల బాక్సాఫీసు కలెక్షన్లు.. సుధీర్ బాబుకి హిట్ పడాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలి?
`జటాధర` మూవీ 6 రోజుల బాక్సాఫీసు కలెక్షన్లు.. సుధీర్ బాబుకి హిట్ పడాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలి?
సుధీర్ బాబు హీరోగా నటించిన `జటాధర` థియేటర్లలో అలరిస్తోంది. అయితే ఈ మూవీకి కలెక్షన్లు నిలకడగా ఉండటం విశేషం. ఆరు రోజుల్లో ఈ మూవీకి ఎంత వసూళ్లు వచ్చాయనేది చూద్దాం.

హర్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన సుధీర్ బాబు `జటాధర`
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. మహేష్ బాబు తర్వాత హీరోగా సర్వైవ్ అవుతున్నది సుధీర్ బాబు ఒక్కరే. కాకపోతే ఆయనకు ఇటీవల సరైన హిట్లు పడటం లేదు. చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని, ఇటీవల సక్సెస్ కొట్టాలని థ్రిల్లర్ సబ్జెక్ట్ తో `జటాధర` చిత్రం చేశాడు. హర్రర్ ఎలిమెంట్లు, మైథాలజీ టచ్ తో ఈ మూవీని రూపొందించారు. దీనికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దివ్య ఖోస్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు రాజీవ్ కనకాల, ఝాన్సీ వంటి వారు ఇతర పాత్రల్లో కనిపించారు.
బాలీవుడ్‌లో సత్తా చాటని `జటాధర`
`జటాధర` మూవీ గత శుక్రవారం(నవంబర్ 7)న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా నటించిన `ది గర్ల్ ఫ్రెండ్` మూవీకి పోటీగా విడుదలైంది. ఆ వారం దాదాపు ఆరేడు మూవీస్ విడుదల కావడం విశేషం. `జటాధర` మూవీ తెలుగుతోపాటు, హిందీలో విడుదలైంది. కాకపోతే నార్త్ లో సినిమాకి పెద్దగా రెస్పాన్స్ లేదు. తెలుగులోనే ఉన్నంతలో బెటర్‌గా రాణిస్తోంది. ఈ చిత్రం ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది.
`జటాధర` ఆరు రోజుల కలెక్షన్లు
ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.6.8కోట్ల కలెక్షన్లని సాధించిందని తెలుస్తోంది. ఇండియాలో ఈ చిత్రానికి దాదాపు రూ.5.4కోట్ల వసూళ్లు రాగా, ఓవర్సీస్‌లో కోటికిపైగా రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా దాదాపు ఏడు కోట్లకు చేరువలో ఉండటం విశేషం. ఈ సినిమాలో హిందీ నుంచి సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ నటించారు. సెకండాఫ్‌లో వారి పాత్రలు కీలకంగా ఉంటాయి. కానీ బాలీవుడ్ ఈ మూవీ ఏమాత్రం సత్తా చాటలేకపోవడం గమనార్హం.
`జటాధర` బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎనిమిది కోట్లు
`జటాధర` చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ.15కోట్ల వ్యాపారం జరిగినట్టు సమాచారం. అయితే తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.8కోట్ల షేర్ రావాలి. అంటే రూ.15కోట్ల వరకు గ్రాస్ రావాలి. మరి లాంగ్ రన్‌లో చేరుకుంటుందా అనేది సందేహంగా మారింది. కలెక్షన్లు నిలకడగా ఉన్నా, లాంగ్ రన్ కష్టమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.
`జటాధర` స్టోరీ ఇదే
`జటాధర` కథ గురించి తెలుసుకుంటే, ఇందులో సుధీర్ బాబు ఘోస్ట్ హంటర్(ఆత్మలను కనిపెట్టడం)గా కనిపించాడు. ఆయన దెయ్యాలపై థీసిస్ రాయడం కోసం హంట్ చేస్తుంటాడు. పడాబడ్డ బంగ్లాలోకి వెళ్లి ఆత్మలను కనిపెడుతుంటాడు. ఆత్మలు, దెయ్యాలు లేవని ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాడు. అయితే ఈ ఘోస్ట్ హంటింగ్ ని పేరెంట్స్(రాజీవ్ కనకాల, ఝాన్సీ) అతన్ని ఆపుతుంటారు. అయితే వాళ్లకి చెప్పకుండా ఓ సారి రుద్రాయ నగరం అనే గ్రామానికి వెళ్తాడు సుధీర్. అక్కడ లంకె బిందలు ఉన్నాయని కొందరు క్షద్ర పూజలు చేస్తుంటారు. ఇంతలో తన ఇంట్లో ప్రమాదం జరుగుతుంది. అమ్మ ఝాన్సీకి గాయమవుతుంది. సుధీర్ రుద్రాయ నగరం వెళ్లారని తెలిసి పేరెంట్స్ బాధపడుతుంటారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లకూడదని చెబుతూ, గతం చెబుతాడు. సుధీర్ బాబు గతం ఏంటి? ఆయన ఎవరు? లంకెబిందలకు, తనకు ఉన్న సంబంధమేంటి? మృత్యుగండం సుధరీ్‌ని ఎందుకు వెంటాడుతుంది? దాన్నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ.