- Home
- Entertainment
- డ్యూడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. 100 కోట్ల బ్లాక్‌బస్టర్‌ని తెలుగులో ఎక్కడ చూడాలి?
డ్యూడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. 100 కోట్ల బ్లాక్‌బస్టర్‌ని తెలుగులో ఎక్కడ చూడాలి?
Dude OTT Date: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన `డ్యూడ్` మూవీ థియేటర్లలో వంద కోట్లకుపైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది.

దీపావళికి ఆడియెన్స్ ముందుకొచ్చిన డ్యూడ్
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు (Mamitha Baiju) జంటగా నటించిన `డ్యూడ్` మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీపావళి పండక్కి వచ్చిన ఈ మూవీ ఊహించని వసూళ్లని రాబట్టింది. రివ్యూల నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకున్నా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. దాదాపు వంద కోట్లని వసూలు చేసింది. ఇక థియేట్రికల్ రన్ ముగించుకుని ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
తెలుగు ఆడియెన్స్ నీ ఆకట్టుకున్న `డ్యూడ్`
కీర్తిస్వరన్ (Keerthiswaran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఆధునిక సంబంధాలు (modern relationships), కుటుంబ బంధాల (family dynamics) ఇతివృత్తాలను హాస్యంతో మేళవించిన తీరు యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. దీంతో తమిళంతోపాటు తెలుగు ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.
డ్యూడ్ ఓటీటీ రిలీజ్ డేట్
డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. సడెన్‌గా సర్‌ప్రైజ్ చేయబోతుంది. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్, ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయ్యింది.ప్రదీప్ రంగనాథన్ నటించిన సూపర్ హిట్ సినిమా `డ్యూడ్` డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. `డ్యూడ్' సినిమా 2025 నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ అంటే ఈఅర్థరాత్రి నుంచి ఓటీటీ ఆడియెన్స్ ని అలరించబోతుంది. అక్టోబర్ 17, 2025న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, విడుదలైన దాదాపు నెల రోజులకే ఓటీటీలోకి వస్తోంది.
డ్యూడ్ తెలుగుతోపాటు ఏ భాషల్లో చూడొచ్చు అంటే
ఇందులో మన తెలుగు ప్రేక్షకులకు శుభవార్త ఏమిటంటే, ఈ చిత్రం కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్ కూడా తమ సోషల్ మీడియాలో ఈ రిలీజ్ గురించి ప్రకటిస్తూ,`One DUDE, one thousand problems, no solutions` అనే హాస్యభరితమైన ట్యాగ్‌లైన్‌ను పంచుకుంది. ఇది వైరల్ అవుతుంది.
`డ్యూడ్` బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే
'డ్యూడ్' సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన విజయాన్ని నమోదు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, కేవలం 10 రోజుల్లోనే ₹100 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇది హీరో ప్రదీప్ రంగనాథన్‌కు వరుసగా మూడవ ₹100 కోట్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతకు ముందు `లవ్ టుడే`, `డ్రాగన్`తో వంద కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇక `డ్యూడ్` మన ఇండియాలో ₹72.2 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹113.25 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.
జెంజీ లవ్ స్టోరీతో `డ్యూడ్`
దర్శకుడు కీర్తిశ్వరన్ జెంజీ తరం మోడ్రన్ ఆలోచనలతో ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. ఇందులో ప్రదీప్ ని మొదట మమితా లవ్ చేస్తుంది, కానీ ఆయన రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన ఆమెని లవ్ చేస్తాడు. కానీ అప్పటికే మమితా మరో కుర్రాడితో ప్రేమలో పడుతుంది. కానీ ప్రదీప్‌ని పెళ్లి చేసుకుంటుంది. ప్రేమించిన వాడితో పిల్లాడిని కంటుంది. మరి ఈ విచిత్రమైన లవ్ స్టోరీ ఎలాంటి ముగింపు తీసుకుందనేది కథ. స్టోరీ పరంగా క్రేజీగా ఉన్న ఈ చిత్రంలో శరత్ కుమార్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. ఆయన పాత్ర ద్వారా కుల వివక్షతని చర్చించడం విశేషం. ఇందులో సాయి అభ్యంకర్ మ్యూజిక్ మరో హైలైట్‌గా చెప్పాలి. మొత్తం మీద, థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన `డ్యూడ్` సినిమాను, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులు నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్ లో ఇంట్లో నుంచే చూసి ఆనందించవచ్చు.