- Home
- Entertainment
- `జటాధర` మూవీ నాలుగు రోజుల బాక్సాఫీసు కలెక్షన్లు.. సుధీర్ బాబు సినిమాకి ఊహించని వసూళ్లు
`జటాధర` మూవీ నాలుగు రోజుల బాక్సాఫీసు కలెక్షన్లు.. సుధీర్ బాబు సినిమాకి ఊహించని వసూళ్లు
సుధీర్ బాబు హీరోగా నటించిన `జటాధర` మూవీ బాక్సాఫీసు స్ట్రగుల్ అవుతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు రోజుల బాక్సాఫీసు కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది.

థియేటర్లలో `జటాధర` మూవీ సందడి
సుధీర్ బాబు తన సినిమాల సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. కానీ సక్సెస్ ఆయన దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. నటుడిగా ఆయన తన బెస్ట్ ఇస్తున్నారు. కానీ తనని నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లే సినిమా పడటం లేదు. దీంతో ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల సక్సెస్ ఫార్ములా అయిన ఫాంటసీ, హర్రర్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో `జటాధర` అనే చిత్రంలో నటించారు. దివ్య ఖోస్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షి సిన్మా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా శింగ్‌హల్, నిఖిల్‌నందా సంయుక్తంగా నిర్మించారు.
`జటాధర` బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్
హర్రర్ థ్రిల్లర్ ప్రధానంగా సాగే ఈ మూవీ శుక్రవారం(నవంబర్ 7)న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. హిందీతోపాటు తెలుగులోనూ విడుదలైంది. అయితే సినిమాకి మొదట ఆడియెన్స్ నుంచి నెగటివ్ రియాక్షన్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ పెదవి విరిచారు. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. హర్రర్ ఎలిమెంట్లు, మైథాలజీ అంశాల టచ్ ఇవ్వడంతో కొంత వరకు మెప్పిస్తుందని చెప్పొచ్చు. దీంతో ఇది సినిమా నెమ్మదిగా పికప్ అందుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. మొదటి రోజుతో పోల్చితే వీకెండ్‌లో వసూళ్లు బాగా పెరిగినట్టు వెల్లడించారు.
`జటధార` నాలుగు రోజుల కలెక్షన్లు
తాజాగా `జటాధర` మూవీ కలెక్షన్లని ప్రకటించింది టీమ్. ఈ చిత్రం నాలుగు రోజులకు ఐదు కోట్లు దాటినట్టుగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.5.16కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. మొదటి రోజుతో పోల్చితే నాల్గో రోజుకి వసూళ్లు పెరిగినట్టు వెల్లడించింది. ఇండియాలో ఈ మూవీ రూ.4.45కోట్లు వసూలు చేయడం విశేషం. తెలుగులోనే మూడు కోట్లకుపైగా వచ్చాయి. హిందీలో కోటి, మిగిలిన స్టేట్స్, ఓవర్సీస్‌లో మరో కోటి వరకు వచ్చినట్టు సమాచారం. ఇలా ఈ చిత్రం వీకెండ్‌లో పుంజుకుంది. మరి వీక్ డేస్‌లో సినిమాకి దక్కే ఆదరణను బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది.
`జటాధర` మూవీ బిజినెస్
`జటాధర` చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ.15కోట్ల వ్యాపారం జరిగినట్టు సమాచారం. అయితే తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.8కోట్ల షేర్ రావాలి. అంటే రూ.15కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ స్థాయికి చేరుకోవడం కష్టమనే చెప్పాలి. మరి అందరి అంచనాలను దాటి ఈ సినిమా పుంజుకుంటుందా? సుధీర్ బాబుకి హిట్ ఇస్తుందా? అనేది చూడాలి.
`జటాధర` మూవీ కథ
`జటాధర` మూవీ కథేంటనేది చూస్తే. సుధీర్ బాబు ఘోస్ట్ హంటర్(ఆత్మలను కనిపెట్టడం). దెయ్యాలపై థీసిస్ రాయడం కోసం హంట్ చేస్తుంటాడు. పడాబడ్డ బంగ్లాలోకి వెళ్లి ఆత్మలను కనిపెడుతుంటాడు. ఆత్మలు, దెయ్యాలు లేవని చెబుతుంటాడు. అయితే ఈ ఘోస్ట్ హంటింగ్ ని పేరెంట్స్(రాజీవ్ కనకాల, ఝాన్సీ) అతన్ని ఆపుతుంటారు. అయితే వాళ్లకి చెప్పకుండా ఓ సారి రుద్రాయ నగరం అనే గ్రామానికి వెళ్తాడు సుధీర్. అక్కడ లంకె బిందలు ఉన్నాయని కొందరు క్షద్ర పూజలు చేస్తుంటారు. ఇంతలో తన ఇంట్లో ప్రమాదం జరుగుతుంది. అమ్మ ఝాన్సీకి గాయమవుతుంది. శివ రుద్రాయ నగరం వెళ్లారని తెలిసి పేరెంట్స్ బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఓ ఫోటో కనిపిస్తుంది. అందులో ఉన్నది ఎవరు అని అడగ్గా అసలు కథ చెబుతారు రాజీవ్ కనకాల. సుధీర్ బాబు గతం ఏంటి? ఆయన ఎవరు? లంకెబిందలకు, తనకు ఉన్న సంబంధమేంటి? మృత్యుగండం సుధరీ్‌ని ఎందుకు వెంటాడుతుంది? దాన్నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ.