- Home
- Entertainment
- చిలుక పచ్చ చీరలో జాన్వీ కపూర్ రచ్చ.. ఆ విరహాలకు చిత్తైపోతున్న కుర్రాళ్లు.. తండ్రి బోనీకపూర్ షాకింగ్ కామెంట్
చిలుక పచ్చ చీరలో జాన్వీ కపూర్ రచ్చ.. ఆ విరహాలకు చిత్తైపోతున్న కుర్రాళ్లు.. తండ్రి బోనీకపూర్ షాకింగ్ కామెంట్
స్టార్ కిడ్ జాన్వీ కపూర్‌కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలకు కోట్లాది మంది అభిమానులు. కానీ ఈ సారి పంచుకున్న ఆమె ఫోటోలకు తండ్రి బోనీ కపూర్ రియాక్ట్ కావడం సంచలనంగా మారింది.

జాన్వీ కపూర్(Janhvi Kapoor) రెగ్యూలర్‌గా తన హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటుంది నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. పొట్టి దుస్తుల్లో తన ఘాటెక్కించే అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. స్కిన్ షోలో తనకు హద్దే లేదని చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆమె హాట్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ జాన్వీ ఈ సారి శారీలో మెరిసింది. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
గతంలో అడపాదడపా చీరలో కనిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి ఆమె శారీలో హోయలు పోయింది. కొంటెగా కవ్విస్తూ కనువిందు చేస్తుంది. చిలుక పచ్చ చీరలో, స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో పరువాలు పోయింది జాన్వీ. చిలిపిగా చూస్తూ టెంప్ల్ చేస్తుందీ అందాల భామ. స్కిన్ షోలో బార్డర్స్ దాటేసిన ఈ బ్యూటీ ఇప్పుడు చీరలో నిండైన దుస్తుల్లో మరింత అందంగా ఉండటం విశేషం. ఇంకా చెప్పాలంటే ఆమె హాట్‌నెస్ మరింత ఎక్కువైంది. Janhvi Kapoor Saree Photos.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్‌పంచుకున్న ఫోటోలకు సెలబ్రిటీలు స్పందించి కామెంట్లు పెడుతున్నారు. మృణాల్ ఠాకూర్ `సుందర్` అని కామెంట్ పెట్టగా, జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ కూడా స్పందించడం విశేషం. ఆయన ఏకంగా `అట్టిసుందర్` అని పోస్ట్ చేశాడు. లవ్ ఎమోజీలను పంచుకున్నారు. జాన్వీ తండ్రి ఇలాంటి ఫోటోలకు స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
అయితే చీరలో జాన్వీ కపూర్ ఎంత అందంగా ఉందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. అతిలోక సుందరి శ్రీదేవి చీరలో ఎంతో అందంగా ఉండేది. ఆమె అందానికి యావత్ ఇండియానే ఫిదా అయ్యింది. అందుకే ఆమెకి అతిలోక సుందరి అనే పేరు నిలిచిపోయింది. అయితే చూడబోతుంటే జాన్వీని కూడా తల్లి శ్రీదేవి మాదిరిగానే భావిస్తున్నారు బాలీవుడ్ జనాలు. బోనీ కపూర్ మాత్రం శ్రీదేవిలాగే సౌత్‌లోనూ జాన్వీ సత్తా చాటేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు సౌత్ ఎంట్రీకి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతున్న`జనగణమన` చిత్రంలో జాన్వీ పేరు వినిపిస్తుంది. దీంతోపాటు అఖిల్‌తోనూ ఓ సినిమా చేయబోతుందనే టాక్ కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు ఏదీ ఫైనల్ కాలేదు. మరి ఆమె ఎంట్రీ ఎప్పుడుంటుందో చూడాలి. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో `గుడ్ లక్ జెర్రీ`, `మిలి`, `బవాల్` చిత్రాల్లో నటిస్తుంది. `బవాల్`లో వరుణ్ ధావన్‌తో జోడీ కడుతుంది జాన్వీ.