- Home
- Entertainment
- పారితోషికంలో పూజా, రష్మిక, కీర్తి, కృతిలకు షాకిస్తున్న జాన్వీ, మృణాల్, శ్రీలీలా.. ఎంత డిమాండ్ చేస్తున్నారంటే
పారితోషికంలో పూజా, రష్మిక, కీర్తి, కృతిలకు షాకిస్తున్న జాన్వీ, మృణాల్, శ్రీలీలా.. ఎంత డిమాండ్ చేస్తున్నారంటే
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతుంది. కొత్త నీరు వస్తే, పాత నీరు వెనక్కి తగ్గినట్టు, కొత్త హీరోయిన్ల దెబ్బకి పాత హీరోయిన్లు సైలెంట్ అయిపోవాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్‌లో అదే జరుగుతుంది.

రష్మిక మందన్న, పూజా హెగ్డే, కృతి శెట్టి, కీర్తిసురేష్ జోరు గతేడాది వరకు సాగింది. కానీ ఇప్పుడు ఈ భామల క్రేజ్ పడిపోయింది. సక్సెస్‌లు లేకపోవడం, సరైన సినిమాలు లేకపోవడంతో వీరంతా డీలా పడిపోతున్నారు. ఇదే సమయంలో శ్రీలీలా, మృణాల్ ఠాగూర్ వంటి కథానాయికలు దూసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు పారితోషికం విషయంలో కూడా ఆ తేడా, ఆ వెనకబాటు తనం కనిపిస్తుంది. కొత్త హీరోయిన్లు పారితోషికం విషయంలో దుమ్మురేపుతుంటే, పాత హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. సీనియర్ స్టార్ హీరోయిన్లని మించిన పారితోషికంతో దూసుకుపోతున్నారు కొత్త భామలు.
Rashmika Mandanna
రష్మిక మందన్నా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న కథానాయిక. ఆమె తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తుంది. పాన్ హీరోయిన్ గా రాణిస్తుంది. కానీ హిందీలో నటించిన ఆమె సినిమాలు రెండూ పరాజయం చెందాయి. దీంతో ఆమె క్రేజ్‌కి బ్రేకులు పడ్డాయి. ఊపులో ఉన్నప్పుడు మూడు నాలుగు కోట్ల వరకు పారితోషికం అందుకునే రేంజ్‌కి వెళ్లింది. కానీ ఒక్కసారిగా పడిపోయింది. ఇటీవల నితిన్‌తో వెంకీ కుడుముల సినిమాకి కోటిన్నర నుంచి రెండు కోట్ల పారితోషికానికే ఒప్పుకుందట.
మరోవైపు గతేడాది వరకు పూజా హెగ్డే గోల్డెన్ లెగ్‌గా, లక్కీ ఛార్మ్ గా ఉండేది. కానీ వరుసగా నాలుగు సినిమాలు పోయాయి. దీంతో ఒక్కసారిగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఈ బ్యూటీకి పారితోషికం కూడా తగ్గిపోయింది. అంతకు ముందు మూడు కోట్లకుపైగానే పారితోషికం అందుకునే ఈ భామ ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్, పవన్ సినిమాలకు రెండు కోట్ల వరకే అందుకుంటుందని టాక్.
మరోవైపు `ఉప్పెన`తో దూసుకొచ్చింది కృతి శెట్టి. బేబమ్మగా బాగా పాపులర్ అయ్యింది. తెలుగులో వరసగా ఆఫర్లు అందుకుంది. దీంతో ఆమె పారితోషికం కోటీ, రెండు కోట్ల వరకు వెళ్లింది. కానీ గతేడాది సినిమాలన్నీ బోల్తా పడటంతో ఈ బ్యూటీ క్రేజ్, ఇమేజ్ ఒక్కదెబ్బకి పడిపోయింది. ఈ బ్యూటీని ఒకటి అర ఆఫర్లతోనే నెట్టుకొస్తుంది. అయితే ఇప్పుడు పారితోషికం తగ్గించుకునేందుకు సిద్దంగా ఉందట. వచ్చిన క్రేజ్‌ని సరిగా ఉపయోగించుకోపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ అమ్మడికి ప్రారంభంలోనే తెలిసి రావడం గమనార్హం.
`మహానటి`తో ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యింది కీర్తిసురేష్. ఈ సినిమాతో ఆమె క్రేజ్, ఇమేజ్, పారితోషికం పెరిగాయి. కానీ ఆ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ గ్రాఫ్ డ్రాప్ అవుతూ వస్తోంది. ఇప్పుడు స్ట్రగులింగ్ హీరోయిన్‌గా మారింది. మూడు నాలుగు కోట్ల పారితోషికం అందుకోవాల్సిన ఈ బ్యూటీ ఒకటిన్నర నుంచి రెండు కోట్ల లోపుకే పరిమితం కావడం గమనార్హం.
ఇక సైలెంట్‌గా దూసుకొచ్చిన కథానాయికల్లో ఇప్పుడు టాప్ లో ఉంది శ్రీలీలా. `పెళ్లిసందడి` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీలీలా, ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ బ్యూటీకి మంచి పేరొచ్చింది. ఇప్పుడు `ధమాఖా` చిత్రంతో బంపర్ హిట్‌ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఓ పది సినిమా ఆఫర్లని అందుకుంది. అదే సమయంలో పారితోషికం పెంచుకుంది. యాభై లక్షల నుంచి ఇప్పుడు రెండు కోట్లకుపైగా పారితోషికం డిమాండ్ చేస్తుండటం విశేషం.
మరోవైపు `సీతారామం` చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకుని అందరి హృదయాలను దోచుకుంది. ఈ సినిమాతో ఈ భామకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు నాని 30లో హీరోయిన్‌గా నటిస్తుంది మృణాల్. ఈ సినిమాకి ఆమెకి రెండు నుంచి మూడు కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటుందట. ఇదే కాదు ఆమెకి వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయని సమాచారం.
ఎన్టీఆర్30 చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది జాన్వీకపూర్. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషనల్‌గా నిలిచిన ఈ భామ ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాకి భారీ పారితోషికం అందుకుంటుందట. పైన చెప్పిన హీరోయిన్లకి మించి ఆమె ఏకంగా మూడు నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. తొలి చిత్రంతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్లని మించిన పారితోషికం అందుకుంటుండటం విశేషంగా చెప్పొచ్చు. ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.