వహ్వా..అనిపించేలా జాన్వీ కపూర్ సోయగం..మనసులో మాట బయట పెట్టిన జూనియర్ శ్రీదేవి
ఈసారి కాస్త రొటీన్ కు బిన్నంగా ఆలోచించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతూ వచ్చిన ఈ చిన్నది. ఈసారి క్లాసిక్ లుక్ లో కనిపించిషాక్ ఇచ్చింది.
నిజంగా మన జాన్వీ కపూరేనా.. బికినీ లుక్ లు,బ్రా అందాలతో.. బీచ్ లలో రెచ్చిపోయి స్కిన్ షో చేసే జాన్వీ.. సడెన్ గా క్లాసిక్ గెటప్ లో మెరిసిపోయింది. ముంతాజ్ లా మారిపోయింది. సోయగాలకు ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది జూనియర్ శ్రీదేవి.
పనిలో పనిగా ఈ ఫోటోస్ శేర్ చేస్తూ.. తన మనసులో మాటను ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది జాన్వీ కపూర్. ఈ లుక్ పై తనకు ఉన్న ప్రేమను చాటుతూ..త్వరలో ఇలాంటి పీరియాడికల్ మూవీని చేయాలని అనుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది బ్యూటీ.
కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ లో.. ముంతాజ్ బేగంలా మెరిసిపోతోంది జాన్వీ. జాన్వీ కపూర్ ను ఇలా చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. వహ్వా జాన్వీ.. నీ లుక్ అదుర్స్ అంటున్నారు. త్వరలో నీ కోరిక నెరవేరాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక జాన్వీ కపూర్ అందరిలా కమర్షియల్ ఆలోచించకుండా..ఎక్స్ పెర్మెంటల్ మూవీ చేసుకుంటూ వెళ్తుంది. . ఆమె లేటెస్ట్ మూవీ మిల్లీ సైతం ప్రయోగాత్మకంగా తెలిసింది. మిల్లీ నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ కాగా రిలీజ్ అయ్యి.. పర్వాలేదు అనిపించింది.
ఇక ఎప్పటి నుంచో జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తే చూడాలని ఉంది అంటున్నారు. చాలా మంది మేకర్స్ ఈ ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు.
జాన్వీకి సౌత్ హీరోలలో చాలా మందిఅంటే ఇష్టం ఉంది. ముఖ్యంగా తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడ్డారు కూడా.
అంతే కాదు మిల్లీ ప్రమోషన్స్ టైమ్ లో కూడా హైదరాబాద్ వచ్చిన జాన్వీ.. తనకు ఇక్కడి సినిమాల్లో నటించాలని ఉంది అని చెప్పింది. ఎన్టీఆర్ తో జోడీగా చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి అని అడగ్గా.. తారక్ తో చాన్స్ వస్తే వదులుకోను అని చెప్పింది జాన్వీ.
కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుందిజాన్వీ కపూర్. ఆమో ఎంచుకునే కథలు కూడా.. భారీ కమర్షియల్ మూవీస్ కాకపోవడంతో.. జాన్వీకి ఇంత వరకూ... బ్రేక్ రాలేదు. భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. ఆమె నటించాల్సిన స్టార్స్ చాలా ఉంది. ఇంక స్టార్ హీరోల సినిమాలు స్టార్ట్ చేయలేదు జూనియర్ అతిలోక సుందరి.