- Home
- Entertainment
- పారిస్ ను చుట్టుముడుతున్న జాన్వీ కపూర్.. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్లను పడగొడుతున్న గ్లామర్ బ్యూటీ..
పారిస్ ను చుట్టుముడుతున్న జాన్వీ కపూర్.. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్లను పడగొడుతున్న గ్లామర్ బ్యూటీ..
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) విదేశాల్లో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తను పారిస్ లో పర్యటిస్తున్న కొన్ని పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. జాన్వీ క్యూట్ లుక్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం వేకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఇండియాలోనే పలు ఈవెంట్స్, బర్త్ డే ఫంక్షన్స్ కు హాజరైన ఈ బ్యూటీ కాస్తా రిలాక్స్ అవడానికి విదేశాలకు వెళ్లింది.
తాజాగా జాన్వీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ప్రత్యక్షమైంది. ఇఫిల్ టవల్, పలు పర్యాటక లోకేషన్లలో ఈ ముద్దుగుమ్మ తెగ ఎంజాయ్ చేస్తోంది. పారిస్ తోపాటు ఫ్రాన్స్ లోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను జాన్వీ సందర్శించింది. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది.
ఈ మేరకు ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు జాన్వీ దగ్గరగానే ఉంటుంది. తన లైఫ్ లోని ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూనే వస్తోంది. తాజాగా తన వేకేషన్ కు సంబంధించిన పిక్స్ ను కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుందీ బ్యూటీ.
ఈ పిక్స్ లో జాన్వీ చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షోతో పిచ్చెక్కించే యంగ్ బ్యూటీ.. పారిస్ అందాలను చూశాక క్యూట్ గా మారిపోయింది. మినీ డ్రెస్ పై ఫుల్ లెంన్త్ బ్లేజర్ ధరించింది. క్లోజప్ లో ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది.
చిరునవ్వుతో కుర్రాళ్లను పడగొట్టేస్తోందీ బ్యూటీ. అలాగే పారిస్ లోని ఫేమస్ చర్చీ, చారిత్రక కట్టడాల వద్ద జాన్వీ ధ్యానం చేస్తూ కనిపించింది. మనస్సు తేలిక చేసుకునేందుకు టెంపుల్ వాతావరణంలో గడుపుతోంది. ఏదేమైనా తను పోస్ట్ చేసిన పిక్స్ ను నెటిజన్లు, అభిమానులు లైక్ లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
కేరీర్ విషయానికస్తే.. ఆల్రెడీ బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ సరైన సమయం రావడం లేదు. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించేందుకు రంగం సిద్ధమైనట్టు ఇటీవల వార్తలు వచ్చినా నిలవలేకపోయాయి.
పూరీ, విజయ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం ‘జన గణ మన’. అయితే ఈ చిత్రంలోనే జాన్వీ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ ఆ ఛాన్స్ గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే కొట్టేసింది. మరోవైపు జాన్వీ పేరును జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎన్టీఆర్ 31’ కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’ మరియు ‘బవాల్’ చిత్రాల్లో నటిస్తోంది.