కోట్ల విలువైన లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన అతిలోక సుందరి తనయ.. వేరే కుంపటినా?

First Published Jan 6, 2021, 10:28 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతని చాటుకునే పనిలో ఉంది. ఇంతలోనే అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కి గురి చేసింది. ఓ భారీ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. 

అతిలోక సుందరి శ్రీదేవి హిందీ పరిశ్రమతోపాటు దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా నటించి మెస్మరైజ్‌ చేసింది. భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ అభిమానాన్ని జాన్వీ కపూర్‌ ఆకర్షించేందుకు రెడీ అవుతుంది.

హిందీ పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తుందీ బ్యూటీ. ఆమె ఇప్పటి వరకు నటించింది రెండు సినిమాలు. రెండింటికి మిశ్రమ స్పందన లభించింది.

ఓ సినిమాలో స్పెషల్‌ అప్పీయరెన్స్ ఇవ్వగా, మరో వెబ్‌ సిరీస్‌ చేసింది. ఇది యావరేజ్‌గానే నిలిచాయి. ఇదిలా ఉంటే ఉన్నట్టు తన అభిమానులకు, సినీ వర్గాలకు పెద్ద షాక్‌ ఇచ్చింది జాన్వీ.

ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం తన తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌, చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి తమ పాత ఇంటిలోనే ఉంటుంది. ముంబయిలోని లోఖండ్‌వాలా ప్రాంతంలో వీరు ఉంటున్నారు.

ఇప్పుడు ప్రత్యేకంగా దాదాపు 39 కోట్లు వెచ్చించి భారీ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిందట జాన్వీ. ముంబయిలోని జుహు విలే పార్లే స్కీమ్‌ ఏరియాలో తాను ఈ కొత్త ఇంటిని కొన్నట్టు హిందీ మీడియా రాసుకొచ్చింది.

స్వాన్కీ అపార్ట్ మెంట్‌లో అరయా బిల్లింగ్‌ అనే బిల్డింగ్‌ని జాన్వీ కొన్నదట. ఇందులో 14, 15, 16 ఫ్లోర్స్ మొత్తాన్ని జాన్వీ తీసుకుందని సమాచారం.

గతేడాది డిసెంబర్‌ 7న డీల్‌ కుదిరిందని, డిసెంబర్‌ పదిన రిజిస్ట్రేషన్‌, స్టాంపుల విభాగంలో దీన్ని నమోదు చేసినట్టు సమాచారం. అందుకుగానూ జాన్వీ 78 లక్షల స్టాంపు డ్యూటీని చెల్లించిందట.

ఇదే నిజమైతే ఇప్పుడు జాన్వీ.. అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగన్‌, అనిల్‌ పూర్, హృతిక్‌ రోషన్‌ ల ఇంటికి దగ్గరలో ఉండబోతుందని చెప్పొచ్చు. వీరంతా నెయిబర్స్ గా ఉంటారని చెప్పొచ్చు.

మరి జాన్వీ సపరేట్‌గా ఇంటిని కొనుగోలు చేయడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది.

ఇటీవల భారతీయ సాంప్రదాయ నృత్యాలు, కుచిపూడి, భారతనాట్యం వంటి వాటిపై ప్రావీణ్యం సంపాదించే పనిలో బిజీగా ఉంది జాన్వీ. ఈ మేరకు డాన్స్ వీడియోలను పంచుకుని శెభాష్‌ అనిపించుకుంది.

ఇక సినీ కెరీర్‌ విషయానికి వస్తే, మరాఠీలో ఘనవిజయం సాధించిన `సైరత్‌` చిత్రానికి రీమేక్‌ అయిన `ధడక్‌` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ తొలి సినిమాతోనే ఆకట్టుకుంది.

ఆ తర్వాత `ఘోస్ట్ స్టోరీస్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. దీంతోపాటు `ఆంగ్రేజ్‌ మీడియం` చిత్రంలో `కుడి ను నచ్నే దే` అనే పాటలో స్టెప్పులేసింది. ఇటీవల ఆమె నటించిన రెండో సినిమా `గుంజన్‌ సక్సేనాః ది కార్గిల్‌ గర్ట్` నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై ప్రశంసలందుకుంది.

ప్రస్తుతం జాన్వీ `రూహి అఫ్జానా`, `దోస్తానా2` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు `తఖ్త్` చిత్రంలో నటించేందుకు రెడీ అవుతుంది.

దీంతోపాటు తెలుగులోనూ జాన్వీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు తండ్రి బోనీ కపూర్‌. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌`కి ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?