MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, ఇమ్రాన్ హష్మీ.. 2024లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్స్ వీరే.!

దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, ఇమ్రాన్ హష్మీ.. 2024లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్స్ వీరే.!

టాలీవుడ్ లో ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 2024లో ఎంత మంది ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకుందాం. 

2 Min read
Shreekanth Nuthi
Published : Mar 05 2024, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అతిలోక సుందరి, దివంతగ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ‘దేవర’ (Devara) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) సరసన నటిస్తుండటం విశేషం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. 

28

కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘దేవర’ (Devara Part 1)తో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 

38

బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi)  కూడా ఈ ఏడాదే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - సుజీత్ (Sujeeth) కాంబోలో వస్తున్న ‘ఓజీ’ (OG The Movie) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కానుంది. 
 

48

‘కేజీఎఫ్’తో అధిరాగా భయపెట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) - రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)తో అలరించబోతున్నారు. ఈ మూవీ జూన్ 14న రాబోతోంది. 
 

58

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)  కూడా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రం మే 10న విడుదల కాబోతోంది. 
 

68

నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’తోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)   టాలీవుడ్ కు ఎంట్రీ  ఇస్తున్నారు. గతంలో అమితాబ్ ఓ చిత్రంలో క్యామియో అపియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఫుల్ లెన్త్ రోల్ తో అలరించబోతున్నారు. 
 

78

హౌజ్ ఫుల్ 4, భూత్ పోలీస్ చిత్రాల ఫేమ్, బాలీవుడ్ నటి జామీ లెవెర్ (Jamie Lever) కూడా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. 
 

88

‘యానిమల్’తో ఇండియా మొత్తం షేక్ చేసిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కూడా తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ తో కాదు. తమిళంలో సూర్య నటిస్తున్న ‘కంగువా’తో అలరించబోతున్నారు. ఈ మూవీ తెలుగులోనూ ఓకేసారి విడుదల కాబోతోంది.  

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
జాన్వీ కపూర్
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved