- Home
- Entertainment
- janaki kalaganaledhu: జ్ఞానాంబకు దైర్యం చెప్పిన జానకి.. రామచంద్ర గెలుపు చూసి కుళ్ళుకుంటున్న మల్లిక!
janaki kalaganaledhu: జ్ఞానాంబకు దైర్యం చెప్పిన జానకి.. రామచంద్ర గెలుపు చూసి కుళ్ళుకుంటున్న మల్లిక!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర(ramachandra ) జానకి, సునందకు డబ్బులు కట్టడంతో అప్పుడు కన్నబాబు వారి దగ్గర ఉన్న సాక్షి పత్రం జానకి ఇవ్వగా వెంటనే జానకి (janaki)ఆ పేపర్ ను చింపి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తన భర్త ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని ఆయనకు అండగా తాను ఉన్నాను అంటూ జానకి వారికి వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత రామచంద్ర కూడా కన్నబాబు (kanna babu)గట్టిగా వార్నింగ్ ఇవ్వగా వారి మాటలు వింటున్న సునంద మాత్రం ఏమి అనలేకుండా లోలోపల కుమిలిపోతుంది. అప్పుడు జానకి, రామచంద్ర అక్కడినుంచి పిలుచుకొని వెళ్ళుతుంది. ఆ తర్వాత జానకి(janaki) గదిని శుభ్రం చేస్తూ ఉండగా రామచంద్ర అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు జానకి ఏమయింది అలా చూస్తున్నావు అని అటుంది.
వెంటనే రామచంద్ర(rama chandra)నువ్వు ఒక మాట చెబితే దానికి ఒప్పుకోవు అని అనడంతో ఏంటి అని అడుగుతుంది జానకి. అప్పుడు రామచంద్ర థాంక్స్ అని మీకు తిరుగు చెప్పాలి ఉంది అని జానకి రామచంద్ర నుదిటి పై ముద్దు పెడుతుంది. రామచంద్ర కూడా జానకి (janaki)ముద్దు పెడతాడు. ఆ తరువాత లీలావతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలో రామచంద్ర ను ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు రామచంద్ర ఇంటి అడ్రస్ అడగడంతో అడ్రస్ చెబుతుంది.
మీడియా వాళ్లు రావడంతో అందరు ఆనంద పడుతూ ఉండగా మల్లిక(mallika)మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. జ్ఞానాంబ ఇంటర్వ్యూ అవసరంలేదు వాళ్ళు అడిగే ప్రశ్నలకు రామచంద్ర ఇబ్బంది పడతాడు అని అనగా గోవిందరాజులు జానకి మాత్రం ఏం జరగదు అని అంటారు. అప్పుడు జానకి(janaki) బ్రతిమిలాడడం తో జ్ఞానాంబ సరే అని అంటుంది.
అప్పుడు మల్లికార్జున నీలావతి(lilavathi) ని ఎందుకు వాళ్ళు మా ఇంటికి తీసుకు వచ్చాను అని నీలావతి పై కోప్పడుతుంది. అప్పుడు నువ్వు టీవీలో కన పడతావు అని అనగానే వెంటనే మేకప్ వేసుకోవడానికి ఇంట్లోకి పరిగెత్తుతుంది. జానకి (janaki)కూడా రామచంద్రను రెడీ చేస్తూ ఉంటుంది.
మరోవైపు జ్ఞానాంబ (jnanamba))ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా జానకి(janaki) వచ్చి అలా ఏమీ జరగదు అని మిమ్మల్ని చూసి వాళ్లే ప్రశ్నలు అడగటానికి భయపడతారు అని ధైర్యం ఇస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.