MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: జెస్సీని, జానకిని విడగొట్టాలనుకున్న మల్లిక ప్లాన్! వర్కౌట్ అవుతుందా?

Janaki kalaganaledu: జెస్సీని, జానకిని విడగొట్టాలనుకున్న మల్లిక ప్లాన్! వర్కౌట్ అవుతుందా?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Sep 30 2022, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జానకి, కాలు నొప్పిపెడుతుంది అని అంటుంది. అప్పుడు రామా జానకిని ఎత్తుకొని తీసుకువెళ్లి పక్కన కూర్చోబెట్టి కాళ్ళు నొక్కుతాడు. అప్పుడు జానకి నవ్వుతూ,ఇందాక మీరు నన్ను పరిగెత్తించారు కదా అందుకే నేను నొప్పి అని మీకు అబద్ధం చెప్పాను అని చెప్పి నవ్వుతుంది. ఇంతలో ఆ ఫోన్ పోగొట్టుకున్న అతను పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు జానకి నవ్వుతూ, నేను వదిలిపెట్టిన ఆయన మిమ్మల్ని వదిలిపెట్టరు అని అంటుంది.మీరే ఏదో ఒకటి చేయండి జానకి గారు అని ఫోన్ జానకికి ఇచ్చి అక్కడ నుంచి పారిపోతాడు రామ.ఆ తర్వాత సీన్లో జానకి వంట చేస్తూ ఉండగా రామ వచ్చి, రేపు పరీక్ష కదా జానకి గారు వెళ్లి చదువుకోండి అని అంటాడు. 

28

జానకి, ఇంట్లో పనులు ఉన్నాయి కదా రామా గారు. ఇక్కడ చేయడానికి ఎవరూ లేరు కదా చేసి వచ్చి చదువుకుంటాను అని అంటుంది.అంతలో జెస్సి అక్కడికి వస్తుంది. అప్పుడు జ్ఞానాంబ కూడా అక్కడికి వచ్చి జానకితో, ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేయాలి జానకి పరీక్ష ఉంది కదా దాన్ని మానుకొని ఇంట్లో పనులు చేయాల్సిన అవసరం లేదు.ఇంట్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా చేయడానికి అని అనగా, మల్లికా చేయకూడదు కదా అత్తయ్య గారు, చికితకి ఒంట్లో బాలేదు అని అనగా, వాళ్లు కాకుండా కొత్తగా వచ్చినోళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా ఇంట్లో పనులు పాలుపంచుకోమని చెప్పండి అని జ్ఞానాంబ అంటుంది.అప్పుడు జానకి, జెస్సికి ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా అత్తయ్య గారు అని అనగా, చెప్తేనే ఎవరైనా నేర్చుకుంటారు నువ్వు ఇలాగ వెనకేసుకొని వస్తే వెనకబడిపోతారు అని అంటుంది జ్ఞానాంబ.
 

38

 అప్పుడు జెస్సి మనసులో, అక్క నాకోసం చాలా చేస్తుంది నేను ఇలాంటి సమయంలోనే అక్కకు తోడుగా ఉండాలి అని అనుకుంటుంది.ఇదంతా చూస్తున్నా మల్లిక, నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే నా చేతి పని చేయించేస్తారు తప్పించుకోవడం మంచిది అని వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్లో అఖిల్ ,ఇంట్లో ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు ఏవైనా ప్లాన్ వేసి వారిని మళ్లీ నా మాయలోకి తీసుకురావాలి అని అనుకుంటాడు. ఇంతలో రామ బండి తీస్తున్నప్పుడు, నా ప్లాన్ అమలు పరచడానికి మా అమాయకపు అన్నయ్య బెస్ట్ అని చెప్పి కావాలని రామా ముందు ఏడుస్తున్నట్లు నటిస్తాడు.ఏమైంది రా అఖిల్ అని రామా అనగా, ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అన్నయ్య. మీరు ఇంత లాగ నన్ను చూస్తారు అని తెలిస్తే నేను ప్రేమ,పెళ్లి అనేది చేసుకునే వాడిని కాదు కదా అని అనగా ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. అలా కాదు అఖిల్ ఇప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపో, జరిగిందంతా జరిగిపోయింది. 

48

ఇప్పుడు నీకంటూ ఒక బాధ్యత ఉన్నది. నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు కావలసిన దారి ఎంచుకోవాలి అని చెప్తుంది. ఇంతలో జ్ఞానాంబ వచ్చి, ఎవరి సలహాలు వాడి కి అవసరం లేదు. ఈ మధ్య సొంత నిర్ణయాలు పెరిగిపోయాయి కదా మీరు వెళ్లి మీ పని చూసుకోండి. రామ కొట్టుకు వెళ్ళు, జానకి పోయి చదువుకో అని చెప్పి పంపించేస్తుంది జ్ఞానాంబ.అప్పుడు అఖిల్ మనసులో, అన్నయ్య వదినలను మార్చినంత తేలిక కాదు అమ్మని బుట్టలో వేయడం ఎలాగైనా జాగ్రత్తగా ఇంకో దారిలో వెళ్లి అమ్మను నా దారిలోకి తీసుకురావాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మల్లికా, తోటి కోడలు ఇద్దరు ఒకటి అయిపోయి పోలేరమ్మ ముందు మంచి పేరు తెచ్చుకుంటారేమో! అలా జరగకూడదు అంటే జెస్సిని జానకితో కలవకుండా చేయాలి. 
 

58

అత్తయ్య గారి ముందు జెస్సిని దోషిగా నిలబెట్టాలి.జెస్సి తో జానకి కోపం తెప్పించే పనులు చేపించాలి అని అనుకోని జెస్సి దగ్గరికి వెళ్లి, జెస్సి నువ్వు అలా బాధగా ఉండొద్దు నేను నిన్ను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. అత్తయ్య గారు నీతో మాట్లాడాలంటే ఒక మార్గం ఉన్నది అత్తయ్య గారు ఏం చెప్పినా నువ్వు అది వినొద్దు, వంటగదిలోకి వెళ్ళొద్దు అంటే వెళ్ళు.వెనకతల రావద్దు అన్నా రా! చిన్న చిన్న పనులు చేయు భోజనం వడ్డించడం లాంటివి చేయు.అలాగే ఇంకొక విషయం, జానకి బయటికి కనిపించే అంత మంచిదేమీ కాదు తన స్వార్థం తనది. 
 

68

అత్తయ్య గారి ముందు మంచి పేరు తెచ్చుకోవాలి అని నిన్ను వాడుకుంటుంది జాగ్రత్త అని జెస్సితో చెప్తుంది. ఇంతలో జానకి అంతా విని మల్లికా, ఇంటి కోడలుగా అత్తయ్య గారిని జెస్సీతో దగ్గర చేయాలనుకుంటే చెయ్యు అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. ఎంత చెప్పినా నువ్వు ఇంక మారవు అని తెలిస్తే ఇంటి పెద్ద కోడలుగా నేను చేయాల్సినవి నేను చేస్తాను జాగ్రత్త అని అంటుంది. దానికి మల్లిక, నేను అత్తయ్య గారితో జెస్సిని కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అంతే జానకి అని అనగా, నేను మొత్తం విన్నాను మల్లిక.
 

78

 ఇంకోసారి ఇలా జరగకూడదు అని చెప్పి జెస్సి తో, జెస్సి నువ్వు చదువుకున్న దానివి మంచేదో చెడదో నీకు తెలుసు. ఒక పని చేసే ముందు ఆలోచించుకుని చేయు అని అనగా, నాకు తెలుసు అక్క అత్తయ్య గారు కఠినంగా ఉంటారు కానీ మనసు వెన్న.నాకు జీవితాన్ని ఇచ్చిన దేవతవు నువ్వు నీ మాట నేను కాదనను అని జెస్సి అంటుంది .అప్పుడు జానకి జెస్సిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మల్లిక,ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందే అని బాధపడుతూ ఉంటుంది.
 

88

 ఆ తర్వాత సీన్లో రామా స్వీట్ కోట్టులో ఉంటూ, జానకి గారు చదువుతున్నారా మళ్ళీ పని కి  వెళ్లిపోయారా అని జానకి కి ఫోన్ చేస్తాడు. అప్పుడు జానకి ఫోనెత్తి, రామ గారు చదువుతున్నాను అయినా మీరు క్యారేజ్ మర్చిపోయారు నేను తెస్తాను అని అంటుంది.అప్పుడు రామా, మీరు తెస్తారా అని అంటాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో  ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గరు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image3
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved