MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: చావు బతుకుల మధ్య మాధురి.. అఖిల్ పై కోపంతో రగిలిపోతున్న జానకి?

Janaki Kalaganaledu: చావు బతుకుల మధ్య మాధురి.. అఖిల్ పై కోపంతో రగిలిపోతున్న జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 4 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Nov 04 2022, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో మాధురికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా అది చూసి జానకి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత జానకి మాధురి బ్యాగులో ఫోన్ తీసుకొని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తొందరగా హాస్పిటల్ దగ్గరికి రండి అని చెబుతుంది. అప్పుడు జానకి అఖిల్ చేసిన పనిని గుర్తుతెచ్చుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అఖిల్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే మాధురి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు.
 

26

  అప్పుడు జానకి ఒక అతను మీ అమ్మాయి తల పై ఒకతను కట్టితో కొట్టడంతో దెబ్బ తగిలింది అని అనడంతో మాధురి వాళ్ళ అమ్మ ఆ మాట విని కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు వాళ్ళ కూతురు పరిస్థితి తలుచుకొని వాళ్ళు ఎమోషనల్ అవుతూ ఉండగా అది చూసి జానకి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ గారు వచ్చి తల మీద బలంగా దెబ్బ తగిలింది. సర్వైవ్ ఇవ్వడం చాలా కష్టం ఉండడంతో ఆ మాటలు విన్న జానకి షాక్ అవుతుంది. అప్పుడు మాధురి వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్ చేతులు కట్టుకొని ఎలా అయిన బతికించండి అని బ్రతిమలాడుతూ ఉంటారు.
 

36

అప్పుడు మాధురి వాళ్ళ అమ్మ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు జానకి కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. జానకి రాకపోయేసరికి ఇంట్లో అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ మల్లిక మాత్రం దానికి ఇంకా రాలేదు అంటే నాకు కడుపు లేదు అన్న విషయం చెప్పడానికి సాక్ష్యదారాలతో సహా వస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రామచంద్ర గోవిందరాజులు జానకి రాక కోసం ఎదురుచూస్తూ భయపడుతూ ఉంటారు. ఇంతలోనే జానకి అక్కడికి వస్తుంది.
 

46

ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసిన జానకి మాత్రం మౌనంగా ఉంటుంది. అఖిల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది జానకి. అప్పుడు జానకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ఏం జరిగిందో చెప్పు జానకి ఎందుకు అలా ఉన్నావు అని జ్ఞానాంబ నిలదీస్తుందీ. అప్పుడు జానకి అపద్దాలు చెప్పి మిమ్మల్ని అందరిని టెన్షన్ పెట్టినందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు జానకి ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్లిపోవడంతో అందరూ ఏమయిందా అని అనుకుంటూ ఉంటారు.
 

56

ఇంతలో రామచంద్ర అక్కడికి వచ్చి ఏమయింది అని అనగా జానకి అబద్ధం చెప్పడంతో మీకు అబద్ధాలు చెప్పడం రాదు జానకి గారు అని అంటాడు రామచంద్ర. మరొకవైపు అఖిల్ బుక్స్ తీసుకొని బయటకు వచ్చి మాధురి మర్డర్ విషయం బయటపడిన అందరూ నన్ను నమ్మాలి అంటే ఇప్పుడు చదువుతున్నట్లు నటించాలి అందరిని నమ్మించాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జెస్సి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అఖిల్ అన్నడంతో చదువుకోవడానికి అని అనగా జెస్సి సంతోషపడుతూ ఉంటుంది.
 

66

అప్పుడు అఖిల్ మాటలు జానకి దూరం నుంచి వింటూ ఉంటుంది. ఇంతలో జానకి అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అఖిల్ అనడంతో చదువుకోవడానికి వదిన అంటూ నాటకాలు ఆడుతూ ఉంటాడు అఖిల్. అప్పుడు జానకి జెస్సిని టీ పెట్టుకుని రమ్మని చెప్పి పంపించి అఖిల్ నీకోసం ఎవరో బయట ఎదురు చూస్తున్నారు అంటూ అఖిల్ ణి బయటకు పంపిస్తుంది. అప్పుడు అఖిల్ అక్కడికి వెళ్లి ఎదురు చూస్తూ ఉండగా ఎవరూ రాలేదు అఖిల్ అని అంటుంది  జానకి. దాంతో అఖిల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image2
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Recommended image3
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved