MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: రుక్మిణి భర్త ఆదిత్య అని తెలుసుకున్న జానకమ్మ.. రాధని ఇంటి నుంచి పంపించేసిన జానకమ్మ?

Devatha: రుక్మిణి భర్త ఆదిత్య అని తెలుసుకున్న జానకమ్మ.. రాధని ఇంటి నుంచి పంపించేసిన జానకమ్మ?

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Sep 22 2022, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...ఆదిత్య రుక్మిణిని కలవడానికి అని బయలుదేరుతాడు. ఇంతలో సత్య ఆదిత్య అని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు ఆదిత్య అని అనగా, చిన్న పని ఉన్నది సత్య అని అంటాడు ఆదిత్య. అప్పుడు సత్య బయట పనులు అంత ఎక్కువ అయిపోయాయా ఇంట్లో మేమున్నాం కదా తర్వాత వెళ్ళు అని అంటుంది.లేదు సత్య అర్జెంటు తిరిగి వచ్చేస్తాను అని అంటాడు ఆదిత్య.ఆఫీస్ కి వెళ్తున్నావా అని సత్య అనగా లేదు బయట పని ఉన్నది అని ఆదిత్య అంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

 అప్పుడు దేవుడమ్మ అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగలేక నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేని నువ్వు ఇద్దరూ బాగున్నారు రా అని అంటుంది. అలా కాదమ్మా నాకు చిన్న పని ఉన్నది ఇప్పుడే వస్తాను అని అంటాడు ఆదిత్య. అలాగే సత్య నీ తీసుకెళ్ళరా అలా మీరు బయటకు వెళ్ళండి పని అయిపోయిన తర్వాత అని అనగా, లేదమ్మా సత్య నీ తర్వాత తీసుకెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య.అప్పుడు సత్య బాధపడుతూ చూసారా ఆంటీ అసలు పట్టించుకోలేదు అని అనగా ఎందుకు చెప్పట్లేదని నువ్వు ఆలోచిస్తున్నావు.

38

 కానీ నిజం చెప్తే మనం బాధపడతామని ఆలోచించడం లేదమ్మా. ఆదిత్య మనసులో ఏమున్నాడో తెలియదు కదా భర్త వెళ్లిన ప్రతిసారి అలా అనుమానించకూడదు అని అంటుంది.ఆ తర్వాత సీన్ లో  దేవి,చిన్మయి బట్టల కోసం కొట్టుకుంటూ, నేను ఇదేసుకుంటాను,నువ్వు అదేసుకొని హడావిడి చేస్తూ ఉంటారు. రుక్మిణి మంచం మీద కూర్చొని దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జానకమ్మ, తన భర్తతో కలిసి వాళ్ళ గది లో కి వెళ్ళి, ఎందుకమ్మా ఇంత హడావిడి అని నాన్న మమ్మల్ని శ్రీశైలం తీసుకెళ్తా అన్నాడు అందుకే తయారవుతున్నాము అని అంటారు వాళ్ళు.

48

అప్పుడు జానకమ్మ వాళ్ళ భర్త, నేను మీ  నాయనతో మాట్లాడుతాను అప్పటివరకు మీరు ఏమి కంగారు పడొద్దు అని అంటాడు. మాట్లాడడం ఎందుకు వెళ్తున్నాం కదా ఇప్పుడు మీరు వెళ్లి తీసుకెళ్లొద్దు అని చెప్తారా ఏంటి అని దేవి అంటుంది. అలా కాదమ్మా నేను చెప్తున్నాను కదా అని పిల్లల్ని బయటకు తీసుకెళ్తారు జానకమ్మ దంపతులు.ఆ తర్వాత సీన్లో ఆదిత్య,రుక్మిణి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది. ఏం రుక్మిణి నా ఫోన్ ఎత్తడం లేదు, ఎప్పుడు ఇలా జరగలేదు మళ్లీ మాధవ్ నిన్ను భయపడుతున్నాడని అనగా, ఆయన భయపడితే భయపడే రోజులు పోయాయి పెనిమిటి.

58

కానీ సత్య గురించి నాకు బెంగగా ఉన్నది.సత్య అంత కోపంగా ఎప్పుడూ లేదు  అని అంటుంది.అప్పుడు ఆదిత్య, సత్య గురించి చూసుకోవడానికి నేనున్నాను అలాగని నన్ను, నా కూతుర్ని నువ్వే చూసుకోవాలి కదా! ఇంకెప్పుడు అలా చేయొద్దు అని అంటాడు. అప్పుడు రుక్మిణి,మాధవసారు ఎందుకో శ్రీశైలం తీసుకెళ్తున్నాను అంటున్నాడు అని జరిగిన విషమంతా చెప్తుంది.అప్పుడెప్పుడో దోషముంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నాడు అని అంటాడు ఆదిత్య.
 

68

ఇంతలో జానకమ్మ అదే దారిలో వెళ్తుండగా వాళ్ళిద్దర్నీ చూసి,రాద మాధవ్ గురించి ఆఫీసర్ గారికి చెప్తున్నట్టు ఉన్నది.ఆఫీసర్ మాధవ్ నీ ఏమైనా చేయొచ్చు, నేను వెళ్లి బతిమిలాడి మచ్చ చెప్తాను అని అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి రుక్మిణి ఆదిత్యని పెనిమిటి అని పిలుస్తుంది. జానకమ్మ ఆశ్చర్యపోయి పెనిమిటి అంటుంది ఏంటి అని తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య ఇంట్లో కూర్చొని మాధవ్ శ్రీశైలం ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో జానకమ్మ ఆలోచిస్తూ, అంటే రాధ భర్త ఆఫీసర్ సారే అన్నమాట అని గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటుంది. అంత గొప్ప ఇంట్లో ఉండాల్సిన పిల్ల ఇక్కడికి వచ్చి ఇలా బతకలిసి వస్తుంది.ఈ విషయం తెలిసిన మాధవైనా ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు. సీతమ్మ వాల్మీకి ఆశ్రమానికి చేరినట్టు రాధ ఇక్కడికి వచ్చి చేరింది. 

78

జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటుంది జానకమ్మ. ఇంతలో జానకమ్మ భర్త అక్కడికి వచ్చి, నేను ఎంత చెప్పినా వాడు ఒప్పుకోకుండా. శ్రీశైలం వెళ్తాను అని అంటున్నాడు.నేను నాలుగు రోజులు పోయాక వెళ్ళరా చిన్న పనుంది అని చెప్పిన సరే వినలేదు అని అంటాడు.అప్పుడు జానకమ్మ ఈయనకి విషయం చెబుదామా అని అనుకుంటుంది. ఇంతలో మాధవ్, పూలదండలు పట్టుకొని పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు జానకమ్మ వాళ్ళ భర్త, వెళ్లి నువ్వైనా వాడితో మాట్లాడు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జానకమ్మ వీడు పైకి ఎందుకు వెళ్తున్నాడు అని అక్కడికి వెళ్లి చూసేసరికి మాధవ్  పూల మాలను పక్కనపెట్టి గిటార్ వాయిస్తూ,రాద ఫోటోని చూస్తూ, ఇన్ని రోజులు నా దగ్గర నుంచి తప్పించుకున్నావు రాధ. కానీ రేపటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు.

88

 జీవితాంతం ఇక్కడే ఉండాల్సింది అని అంటాడు. అప్పుడు జానకమ్మ,వీడు ఏం చేస్తున్నాడు జీవితాంతం ఇక్కడ ఉండడమేంటి? ఇంక  రాధ కి ఇంట్లో సురక్షితం కాదు అని కిందకి వెళ్లి రాదని తన గదిలోకి తీసుకొని వెళ్లి తన బంగారం అంతా మూట కట్టి ఇక్కడ వెళ్ళిపో రాధ నాకు జరిగిన విషయం అంతా తెలుసు నువ్వెందుకు బాధపడుతున్నావో కూడా తెలుసు. మాధవ్ ప్రవర్తనలో మార్పు వస్తుంది, ఆఫీసర్ సరే నీ భర్తని నాకు తెలుసు. అయినా నేను ఎందుకు ఏంటి అని అడగను ఇక్కడి నుంచి దేవమ్మని తీసుకొని వెళ్ళిపో అని అంటుంది. దానికి రుక్మిణి ఆశ్చర్యపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image3
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved