- Home
- Entertainment
- Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్ షాక్.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్ షాక్.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Vijay Sangeetha Reunion: తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్, ఆయన భార్య సంగీత మళ్లీ కలిసిపోయారనే వార్తలు కోలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. కుటుంబ సభ్యుల చొరవతోనే వీరిద్దరూ ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఇదిప్పుడు సంచలనంగా మారింది.

సంచలనాలకు కేరాఫ్‌గా సీఎం విజయ్
హీరో దళపతి విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించి ఆయన ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ, రెండు బలమైన పార్టీలను మట్టికరిపిస్తూ ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం తమిళనాడుకి సీఎంగా ఉన్నారు. అక్కడ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.
మళ్లీ కలవబోతున్న విజయ్, సంగీత?
ఇదిలా ఉంటూ ఎన్నికలకు ముందూ విజయ్ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఫేస్ చేశాడు. ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్ట్ కి ఎక్కింది. మరో నటితో ఆయన సన్నిహిత్యంగా ఉండటమే దానికి కారణమని ఆమె వెల్లడించింది. దీంతో వీరిద్దరు విడిపోవడం పక్కా అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే విజయ్ సీఎం అయ్యాక అన్నీ మారిపోతున్నాయి. చాలా విషయాలు రివర్స్ అవుతున్నాయి. అలానే ఇప్పుడు తన ఫ్యామిలీ మ్యాటర్ కూడా రివర్స్ గా మారిపోతుంది. ఈ క్రమంలో ఈ జంట మళ్లీ ఒక్కటైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో తమిళగ వెట్రి కళగం (TVK) కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో రూమర్లు
విజయ్ అమ్మ చొరవతో మళ్లీ రీయూనియన్
సంబరాల్లో విజయ్ అభిమానులు
విజయ్, సంగీత కలిసిపోయారన్న వార్త తెలియగానే తమిళగ వెట్రి కళగం కార్యకర్తలు, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'మా తలైవా కుటుంబం ఒక్కటైంది' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది తమ నాయకుడికి రాజకీయంగా కూడా బలమని వారు భావిస్తున్నారు. 'అన్ని సమస్యలు తీరిపోయాయి' అనే ఈ సానుకూల వార్త, తమిళగ వెట్రి కళగం పార్టీ భవిష్యత్ రాజకీయాలకు ఎంతో బలాన్నిస్తుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల చొరవతో విజయ్, సంగీత మళ్లీ ఒక్కటయ్యారన్న వార్త.. టీవీకే కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
త్రిషకి విజయ్ బిగ్ షాక్
విజయ్, సంగీత మళ్లీ కలుస్తున్నారు, విడిపోవడం లేదనే వార్తలు ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. విజయ్, త్రిష ప్రేమించుకుంటున్నారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సంగీతతో విజయ్ విడిపోతే, ఆ తర్వాత త్రిషని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. త్రిష కూడా విజయ్‌పై ప్రేమని పలు రకాలుగా వ్యక్తం చేస్తూ వచ్చింది. విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం రోజు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అదే సమయంలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే విజయ్‌ని కలిసింది త్రిష. అంతేకాదు విజయ్ కోసం ఆమె రాజకీయాల్లోకి కూడా రాబోతుందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్, సంగీత కలిస్తే, త్రిష పరిస్థితేంటి? అనేది ప్రశ్న. త్రిషతో తన రిలేషన్‌ని విజయ్ ఎలా కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.

