MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • వ్యాపారం కోసం వలస వచ్చిన జమున ఫ్యామిలీ.. జాతీయ నాయకుల ముందే ధైర్యంగా..

వ్యాపారం కోసం వలస వచ్చిన జమున ఫ్యామిలీ.. జాతీయ నాయకుల ముందే ధైర్యంగా..

అలనాటి నటి జమున మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురవుతోంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యం కారణంగా జమున హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం మరణించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 27 2023, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అలనాటి నటి జమున మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురవుతోంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యం కారణంగా జమున హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం మరణించారు. దీనితో సినీ రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

జమున కుటుంబం, బాల్యం గురించిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. జమున 1936లో విజయనగర సామ్రాజ్యంలో ముఖ్య పట్టణం అయిన హంపీలో జన్మించారు. శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జమున జన్మించింది. ఆమె కుటుంబానికిచారిత్రాత్మక నేపథ్యం ఉంది. జమున తల్లి కౌసల్యాదేవి తండ్రి వెంకటప్పయ్య విజయనగర సంస్థానంలో విద్వాంసులుగా ఉండేవారట. 

38

జమున తాతగారు(శ్రీనివాసరావు తండ్రి) నరసింగరావు న్యాయవాద వృత్తిలో ఉండేవారు. ఇక శ్రీనివాసరావు బాగా చదువుకుని వ్యాపారంలో స్థిరపడ్డారు. జమున తల్లికి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. దీనితో జమునకి చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి ఉండేది. 

48

జమున తండ్రి శ్రీనివాసరావు పసుపు, పత్తి లాంటి ఉత్పత్తులని విదేశాలకు ఎగుమతి చేసేవారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల పసుపు పంటకి బాగా ప్రాచుర్యం ఉంది. దీనితో వ్యాపార సౌలభ్యం కోసం శ్రీనివాసరావు తన ఫ్యామిలీతో దుగ్గిరాలకి వలస వచ్చారు. చిన్నతనంలోనే జమున గుంటూరుకి రావడంతో ఆమె తెలుగు అమ్మాయిగానే పెరిగింది. 

58

స్కూల్ లో పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉండేది. సినిమాలపట్ల కూడా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఒకేసారి దుగ్గిరాలకి నీలం సంజీవరెడ్డి, జయప్రకాష్ నారాయణ లాంటి జాతీయ నాయకులు దుగ్గిరాలకి వచ్చారు. ఆ కార్యక్రమంలో వారి ముందు ఎలాంటి బెదురూ లేకుండా జమున ప్రార్థనాగీతం ఆలపించింది. జమున పాటలు పాడే విధానం శ్రీమన్నారాయణమూర్తి అనే వ్యక్తికి బాగా నచ్చింది. జమున సినీరంగంలోకి వెళితే రాణిస్తుందని ఆయన చెప్పడంతో ఆమెలో ఆశలు మొదలయ్యాయి. 

68

ఆ తర్వాత నాటకాలు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. తన కుటుంబ సభ్యులకు ఉన్న పరిచయాలతో కొంతమంది సినీప్రముఖులు దృష్టిలో పడింది. జై వీర బేతాళ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని జమున మొదట అందుకుంది. కొంతభాగం షూటింగ్ జరిగిన తర్వాత నిర్మాత రామానందం మృతి చెందారు. దీనితో ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత 1952లో పుట్టిల్లు అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ విజయం సాధించలేదు. 

78

ఆ తర్వాత అక్కినేని  నాగేశ్వర రావు దొంగరాముడు చిత్రంలో ఆయనకి చెల్లిగా నటించే అవకాశం అందుకుంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో జమున వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ఆ తర్వాత భూకైలాస్‌’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు, ‘అప్పుచేసి పప్పుకూడు’, చిరంజీవులు’, ‘ఇల్లరికం’, ‘ఈడూజోడూ’, ‘రాముడు భీముడు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘గులేబకావళికథ’, ‘లేతమనసులు’, గుండమ్మకథ, మూగమనసులు శ్రీకృష్ణ తులాభారం చిత్రాలతో జమున పాపులారిటీ తారాస్థాయికి చేరింది. 

88
Jamuna

Jamuna

ఇక జమున 1965లో జూలూరి రమణారావుని వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు వంశీకృష్ణ అమెరికాలో స్థిరపడ్డారు. కుమార్తె స్రవంతి హైదరాబాద్ లోనే స్థిరపడింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image3
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved