MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jailer 2 Team Remunerations: రజనీకాంత్‌ పారితోషికం హాట్‌ టాపిక్‌.. మోహన్‌లాల్, శివన్న, రమ్యకృష్ణలకు ఎంతంటే?

Jailer 2 Team Remunerations: రజనీకాంత్‌ పారితోషికం హాట్‌ టాపిక్‌.. మోహన్‌లాల్, శివన్న, రమ్యకృష్ణలకు ఎంతంటే?

రజనీకాంత్‌ హీరోగా రూపొందిన `జైలర్‌ 2` భారీ కాస్టింగ్‌తో వస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల పారితోషికాల వివరాలు లీక్‌ అయ్యాయి. ఎవరికి ఎంత అందుతుందో చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 14 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ కాస్టింగ్‌తో వస్తోన్న జైలర్‌ 2 మూవీ
Image Credit : X

భారీ కాస్టింగ్‌తో వస్తోన్న జైలర్‌ 2 మూవీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ `జైలర్‌ 2`తో సందడి చేయడానికి వస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ కాస్టింగ్‌ నటిస్తోంది. ఆయనకు జోడీగా రమ్యకృష్ణ చేస్తోంది. అలాగే మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌ క్యామియో రోల్స్ చేస్తున్నారు. వీరితోపాటు హృతిక్‌ రోషన్‌, విజయ్‌ సేతుపతిలు కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. అలాగే ఎస్‌ జే సూర్య, మిథున్‌ చక్రవర్తి, మీర్నా, జాకీ షారఫ్‌, విద్యా బాలన్‌, యోగిబాబు వంటి వారు నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం గురువారం(అక్టోబర్‌ 15)న విడుదల కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రజనీకాంత్‌ పారితోషికం హాట్‌ టాపిక్‌
Image Credit : Asianet News

రజనీకాంత్‌ పారితోషికం హాట్‌ టాపిక్‌

ఈ క్రమంలో `జైలర్‌ 2`లో కాస్టింగ్‌, టెక్నీషియన్లు ఎంత పారితోషికం తీసుకుంటున్నారు అనే వివరాలు లీక్‌ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జైలర్‌ మూవీకిగానూ దాదాపు రెండు వందల కోట్ల పారితోషికం అందుకున్నారు రజనీకాంత్‌. మొదట వంద కోట్లు అయితే, సినిమా పెద్ద హిట్‌ కావడంతో మరో వంద కోట్లు పారితోషికంగా ఇచ్చినట్టు సమాచారం. మరి `జైలర్‌ 2`కి ఆయన ఎంత తీసుకుంటున్నారనేది చూస్తే. దాదాపు రూ.125కోట్ల పారితోషికం ఇస్తున్నారట. అంతేకాదు లాభాల్లో వాటా కూడా ఉంటుందని సమాచారం. వచ్చే కలెక్షన్లని బట్టి ఆయనకు ఇంకా బాగానే రాబోతుందని చెప్పొచ్చు.

34
జైలర్‌ 2 కాస్టింగ్‌ పారితోషికాలు
Image Credit : YouTube

జైలర్‌ 2 కాస్టింగ్‌ పారితోషికాలు

మోహన్‌లాల్‌కి రూ.12కోట్లు, శివరాజ్‌ కుమార్‌కి ఐదు కోట్లు ఇస్తున్నారట. విజయ్‌ సేతుపతికి దాదాపు 9 కోట్ల వరకు ఇస్తున్నట్టు సమాచారం. వీరితోపాటు జాకీ షరాఫ్‌కి నాలుగు కోట్లు, మిథున్‌ చక్రవర్తికి మూడు కోట్లు, యోగిబాబుకి మూడు కోట్లు, విద్యా బాలన్‌కి 6 కోట్లు, రమ్యకృష్ణకి రెండు కోట్లు, సూరజ్‌కి కోటి, ఎస్‌ జే సూర్యకి మూడు కోట్లు, మిగిలిన మెయిన్‌ ఆర్టిస్ట్ లకు లక్షల్లో ఇస్తున్నారట. ఇక దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కి సుమారు రూ.50-60కోట్ల వరకు అందుతుందట. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్‌కి రూ.18కోట్లు ఇస్తున్నట్టు టాక్‌. ఇలా దాదాపు రూ.250కోట్ల వరకు పారితోషికాలే అవుతున్నాయి. సినిమా బడ్జెట్‌ రూ.300కోట్లకుపైగానే ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారం మాత్రమే.

44
మరోసారి ముత్తువేల్‌ విశ్వరూపం
Image Credit : X

మరోసారి ముత్తువేల్‌ విశ్వరూపం

ఇందులో రజనీకాంత్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా నటించారు. ఆయన మొదటిభాగంలో తన కొడుకుని కాపాడుకోవడం కోసం, ఫ్యామిలీ కోసం పోరాటం చేస్తాడు. చివరికి కొడుకే దొంగ అని తెలుస్తుంది. దీంతో కొడుకుని చంపేస్తాడు. చివర్లో మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌ల ఎంట్రీ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇప్పుడు రెండో భాగంలో ఎస్‌ జే సూర్య, మిథున్‌ చక్రవర్తి విలన్లుగా, స్మగ్లర్‌గా ఉంటారట. విద్యా బాలన్‌ కూడా నెగటివ్‌ రోల్‌లోనే కనిపిస్తుందని సమాచారం. వీరితో ముత్తువేల్‌ పాండియన్‌ చేసే పోరాటమే కథగా ఉంటుందని సమాచారం. సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ `జైలర్‌ 2` అనే ట్యాగ్‌ తో హైప్‌ క్రియేట్‌ అవుతుంది. దాన్ని ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2: జైలర్ 2 చూసే ముందు ఫస్ట్ పార్ట్‌లోని ఈ 5 ట్విస్టులు ఓసారి గుర్తు చేసుకోండి
Recommended image2
Rajamouli: రాజమౌళి సినిమాల్లో వరస్ట్ మూవీ అదే, తేల్చేసిన కార్తికేయ.. బెస్ట్ మూవీస్ ఆర్ఆర్ఆర్, బాహుబలి కాదు
Recommended image3
Rashmika Saree: బాబోయ్! సీఎం విజయ్‌ను కలిసినప్పుడు రష్మిక కట్టుకున్న చీర అంత ఖరీదా?
Related Stories
Recommended image1
Chiranjeevi: నాకు కులపిచ్చి ఉంటే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యేవాడు కాదు.. సీనియర్‌ హీరో సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Nita Ambani: నీతా అంబానీ సొంత ఆస్తులు ఏంతో తెలుసా? ఊహకు కూడా అందదు, ప్రపంచంలోనే రిచ్‌ లేడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved