Guppedantha Manasu: తన మనసులో మాటను వసుకు చెప్పేసిన రిషీ.. సంతోషంలో జగతి, మహేంద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వసు రిషి (Rishi) తీసుకున్న ఆలోచనకు రిషి ను పదే పదే పొగుడుతూ ఉంటుంది. దాంతో రిషి ఇకపై ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇక వసు అలవాటైపోయిందని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జగతి (Jagathi) అందరికీ లంచ్ బాక్స్ సర్దుతూ ఉంటుంది.
దాంతో దేవయాని (Devayani) జీర్ణించుకోలేక ఇంటి పనుల విషయంలో ను కలుగ చేసుకోవద్దు అని అంటుంది. ఇక జగతి (Jagathi) మీరు ఈ పనుల విషయంలో రిటైర్ అయిపోవండి అక్కయ్య అని అంటుంది. అంతే కాకుండా మీరు ఈ ఇంటి విషయంలో పెత్తనాలు మాత్రమే చేయగలరు అక్కయ్య అని జగతి అంటుంది.
దాంతో దేవయానికి మరింత కోపం వ్యక్తం చేస్తుంది. ఇక జగతి (Jagathi) నేను తీసుకెళుతున్న లంచ్ రిషి ఎక్కడ తింటాడు అని మీ భయం కదూ అని అంటుంది. అంతే కాకుండా నేను తీసుకువెళ్లిన లంచ్ రిషి (Rishi) ఇవాళ కాకుంటే రేపు తింటాడు అని అంటుంది.
ఇక కాలేజ్ లో ఫ్యామిలీ జగతి (Jagathi) తెచ్చిన లంచ్ చేయడానికి సిద్ధంగా ఉండగా రిషి నేను కొంచెం లేటుగా తింటా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత దేవాయని (Devayani) రిషి కి ఫోన్ చేసి అందరు కలిసి భోజనం తిన్నారా అని ఇన్ డైరెక్ట్ గా తెలుసుకుంటుంది. ఇక రిషి నేను తినలేదు పెద్దమ్మ అని చెబుతాడు.
ఇక రిషి వసు దగ్గరకు వెళ్లి లంచ్ చేద్దాం పదా అని అంటాడు. ఇక రిషి (Rishi) లంచ్ త్వరగా తిననందుకు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడేమో అని భయపడుతూ ఉంటాడు. ఇక తరువాయి భాగం లో రిషి, వసులు (Vasu) కలిసి లంచ్ చేస్తూ ఉండగా ఈ క్రమంలో వసు రిషిను నేను అంటే మీకు ఎందుకు ఇంత శ్రద్ద సార్ అని అడుగుతుంది.
దాంతో రిషి (Rishi) నువ్వు అందరి లాంటి అమ్మాయి కాదు. అందుకే నిన్ను అందరు ఇష్టపడతారు. అందుకే నువ్వంటే అని తన మనసులోని మాట చెప్పేస్తాడు రిషి. దాంతో చాటుగా వింటున్న జగతి (Jagathi) దంపతులు ఎంతో ఆనంద పడతారు.