Guppedantha Manasu: దేవయానిపై విరుచుకుపడ్డ వసు.. కోపంతో రగిలిపోతున్న రిషి?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర లు భార్య భర్తలు అన్న సంగతి కాలేజ్ స్టాప్ కు తెలిసినందుకు జగతి బాధపడుతూ ఉంటుంది. ఇక మహేంద్ర (Mahendra) ధైర్యం చెబుతాడు.
మరో వైపు కాలేజీ స్టాఫ్ మహేంద్ర (Mahendra) ఫ్యామిలీ భార్య భర్తలు అన్న విషయాన్ని, తల్లి కొడుకుల అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా బలే దాచి పెట్టారు కదా అంటూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇక దాన్ని రిషి విని జగతి (Jagathi) మేడం ను నా కేబిన్ కు రమ్మనండి అని వాళ్ళతో చెబుతాడు.
ఆ తర్వాత వసు (Vasu) ఒకచోట కూర్చొని ఉండగా.. గౌతమ్ ఇదే మంచి సమయం అనుకోని ప్రపోజ్ చేయబోతాడు. గౌతమ్ ఐ లవ్ యు చెబుతున్న క్రమంలో వసు ఏదో ఫోన్ కాల్ వచ్చి పక్కకు వెళుతుంది. ఇక దాంతో ఆ ప్రపోజల్ ని వేరే అమ్మాయి రిసీవ్ చేసుకుంటుంది. ఇక గౌతమ్ (Goutham) ఇది నీకు చెప్పలేదు. ఇది నా నెక్స్ట్ షార్ట్ ఫిలిం అంటూ ఆ అమ్మాయి దగ్గర కవర్ చేసుకుంటాడు.
ఆ తర్వాత దేవయాని (Devayani) ఆఫీస్ లో ఓ వ్యక్తికి కాల్ చేసి మ్యాటర్ ఇంకా ఎందుకు పబ్లిసిటీ కాలేదు అని గట్టిగా అడుగుతుంది. దాంతో ఆ వ్యక్తి నేను ఆ పని చేయలేను. రిషి సార్ అడ్డు పడుతున్నారు అని చెబుతాడు. ఇక ఆ క్రమంలో దేవాయని దగ్గరకు ధరణి (Dharani) వచ్చి స్వీట్స్ చెయ్యమంటారా అని వెటకారంగా అడుగుతుంది.
ఇక క్యాబిన్ కు వచ్చిన జగతి (Jagathi) తో బంధానికి బురద పట్టించారు. గుచ్చి గుచ్చి మన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మా నాన్న కు దూరంగా ఉంటే మంచిది అన్నట్లు రిషి మాట్లాడుతాడు. ఇక ఈ లోపు అక్కడ మహేంద్ర (Mahendra) వస్తాడు. ఇక దాంతో జగతి ఏడుచుకుంటూ వెళుతుంది.
ఆ తర్వాత మహేంద్ర (Mahendra), జగతిని ఏమన్నావ్ అంటూ.. రిషి ను నానా మాటలు అని విరుచుకు పడతాడు. ఇక మరోవైపు జగతి దగ్గరకు దేవాయని వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మాట్లాడుతుంది. ఇక అది విన్న వసు దేవయాని (Devayani) ను ఏమాత్రం లెక్కచేయకుండా విరుచుకు పడుతుంది.