- Home
- Entertainment
- Guppedantha Manasu: తల్లి ప్రవర్తన బాలేదంటూ షాకిచ్చిన రిషి.. భయంతో వణికిపోతున్న జగతి!
Guppedantha Manasu: తల్లి ప్రవర్తన బాలేదంటూ షాకిచ్చిన రిషి.. భయంతో వణికిపోతున్న జగతి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కొడుకు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని అతడిని ఎలాగైనా రక్షించుకోవాలని తపన పడుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను చెప్పినట్లు విను ఇప్పుడు నిశ్చితార్థం ఆపేస్తే రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని భయంగా ఉంది. ఇప్పటికే చూసావు కదా ఎలా మాట్లాడుతున్నాడో. వెళ్ళు, వెళ్లి నిశ్చితార్థం చేసుకోవటానికి ఇష్టంగానే ఉన్నానని చెప్పు అని వసుని రిషి దగ్గరికి పంపిస్తుంది జగతి. వసు వెళ్తూనే బాధతో రిషి ని హగ్ చేసుకుంటుంది.
ఎందుకు ఈ నిశ్చితార్థం వద్దంటున్నావు.. ఎందుకు అసంతృప్తిగా ఉన్నావు అని అడుగుతాడు రిషి. మీకోసమే అంటుంది వసు. ఏడుస్తున్న వసుని చూసి ఏం జరిగింది ఏమైనా సమస్యా.. నిజం చెప్పు అంటాడు రిషి. అలాంటిదేమీ లేదు మీ ఆశయానికి నేను అడ్డు రాకూడదని భావించాను మెడికల్ కాలేజీ అయిపోయిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అంటుంది వసు.
వద్దు వసు.. ఇప్పటికే మనం చాలా ఎడబాటు భరించాము నాకు కాలేజీ ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్ అంటాడు రిషి. మరోవైపు నిశ్చితార్థం గ్రాండ్ గా చేయాలని హడావుడి పడుతూ ఉంటుంది దేవయాని. నువ్వు నిశ్చితార్దానికే ఇంత హడావుడి చేస్తున్నావు పెళ్లి ఇంకెంత గ్రాండ్ గా చేస్తావో అంటాడు ఫణీంద్ర. మీరే చూస్తారు కదా అంటుంది దేవయాని.
ఆ తర్వాత ధరణి దగ్గరికి వెళ్లి నువ్వు మీ చిన్న అత్తయ్య పూలదండలు గుచ్చండి అని ఆర్డర్ వేస్తుంది. మరోవైపు నిశ్చితార్థం కోసం వసుకి చీర గిఫ్ట్ గా ఇస్తాడు రిషి. తరువాత ధరణి, జగతి పూలు గుచ్చుతూ ఉంటారు. మూడీగా ఉన్న అత్తగారిని చూసి ఏం జరిగింది అని అడుగుతుంది ధరణి. ఏమీ లేదు అంటూ మాట మార్చేస్తుంది జగతి. అంతలోనే వసు వచ్చి రిషి ఇచ్చిన చీర చూపిస్తుంది.
అది చూసిన ధరణి, జగతి ఇద్దరు సంతోషిస్తారు. వసు కూడా పూలు గుచ్చడానికి కూర్చుంటుంది. మీతో పాటు పువ్వులు గుచ్చాలని ఉంది అంటూ రిషికి మెసేజ్ పెడుతుంది. మరోవైపు నువ్వు నా సంతోషం కోసం ఏమైనా చేస్తావు నీలాంటి కొడుకు పుట్టడం నా అదృష్టం మళ్లీ మళ్లీ నువ్వే నా కొడుకుని పుట్టాలి అంటూ కొడుకుని తెగ మెచ్చుకుంటూ ఉంటుంది దేవయాని. ఇంతకీ తర్వాత ప్లాన్ ఏంటి అని అడుగుతుంది.
ఏదో ప్లాన్ చెప్తాడు శైలేంద్ర. ఈ ప్లాన్ ఎవరైనా అడ్డుకుంటే వాళ్లని అడ్డు తప్పించడానికి కూడా సిద్ధమే అంటాడు శైలేంద్ర. మరోవైపు మెసేజ్ చూసిన రిషి పూలు గుచ్చడానికి వస్తాడు. పని ఉంది అంటూ కావాలనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు జగతి ధరణి. రిషి వసు పూలు గుచ్చుతూ ఉండగా దేవయాని అక్కడికి వచ్చి నిన్ను మీ అన్నయ్య పిలుస్తున్నాడు అంటుంది.
అతను శైలేంద్ర దగ్గరికి వెళ్ళగానే ఒంటరిగా ఉన్న వసు తో మహా ఆనందంగా ఉన్నట్టున్నావు.. జాగ్రత్త ఆనందం ఆవిరి అయిపోగలదు అంటూ హెచ్చరిస్తుంది. మరోవైపు నువ్వు చెప్పిన ఆఫీస్ కి వెళ్ళాను వాళ్ళు మీ సైన్ అడుగుతున్నారు అంటూ ఒక ఫైల్ రిషికిస్తాడు శైలేంద్ర. ఏమి చదవకుండానే సైన్ పెట్టడానికి రెడీ అవుతాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి చదువుకుండా సైన్ పెట్టడం మంచిది కాదు అంటుంది.
అన్నయ్య మీద నాకు నమ్మకం ఉంది మీలాగే తను కూడా నా మంచి కోరుకునే వ్యక్తి అంటాడు రిషి. నీకు నా మీద ఉన్న నమ్మకం పిన్నికి ఉండకపోవచ్చు ఒకసారి చదువు అంటాడు శైలేంద్ర. సరే అంటూ ఆ పేపర్స్ ని చదివి సంతకం పెడతాడు రిషి. ఎందుకు మేడం మీరు మన అనుకున్న వాళ్ళని కూడా అనుమానిస్తున్నారు మీ పద్ధతి ఏమి బాగోలేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
అక్కడ ఉన్న జగతితో ఏంటి పిన్ని కంగారు పడ్డావా అయినా దొంగ సంతకాలు చేయించుకునే అంత చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. రేపు నిశ్చితార్థం జరగబోతుంది అక్కడ ఏం జరగబోతుందో ఏంటో వెళ్లి నీ కొడుకుని కాపాడుకో అంటూ హెచ్చరిస్తాడు శైలేంద్ర. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే దిగులుగా కూర్చుంటుంది జగతి. ఏంటి ఈ పరిస్థితి కొడుకు నిశ్చితార్థం రోజు కూడా భయం భయంగా గడపాల్సి వస్తుంది అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.