MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: జగతిని జాగ్రత్తగా చూసుకుంటున్న రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?

Guppedantha Manasu: జగతిని జాగ్రత్తగా చూసుకుంటున్న రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 30 2022, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజు ఎపిసోడ్లో జగతి వాళ్ళు ఇంటికి వెళ్తుండగా జగతి రిషి వసుధార వాళ్ళని చూసి ఇద్దరు ఎంత బాగా కలిసిపోయారు. రిషికి ఏం కావాలో వసు మనసుకు తెలుసు వసు కి ఏం కావాలో రిషి మనసుకు తెలుసు అనుకుని మురిసిపోతూ ఉంటుంది జగతి. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనుకుంటూ ఉంటుంది జగతి. అప్పుడు మహేంద్ర తన మనసులో స్వారీ నాన్న నీకు దూరంగా వెళ్లి నేను చాలా బాధ పెట్టాను అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జగతి నాకు బ్లడ్ ఇచ్చావు నన్ను కారులో అపురూపంగా ఇంటికి తీసుకెళ్తున్నావు నాకు ఇంతకంటే ఏం కావాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జగతి పక్కనే ఉన్న మహేంద్ర కు ఎలా చెప్పాలో తెలియక తన మనసులోని మాటలు మహేంద్రకు మెసేజ్ చేయగా అప్పుడు మహేంద్ర ఫోన్ రిషి చూస్తాడు.
 

26

అప్పుడు జగతి పెట్టిన మెసేజ్ రిషి చదివి డిలీట్ చేసి మొబైల్ పక్కన పెట్టేస్తాడు. అప్పుడు మహేంద్ర నీ ఫోన్ ముందర ఉంది అని జగతి చెప్పగా ఇంతలో రిషి డాడ్ మీ ఫోన్ అని మహేంద్ర కి ఫోన్ ఇస్తాడు. ఇంతలోనే మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు. దేవయాని గుమ్మం కి ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడు జగతి కారు దిగి నడుచుకుంటూ వెళ్తూ కిందపడిపోతుండగా రిషి వచ్చి పట్టుకుంటాడు. అది చూసి దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు జగతీ లోలోపల సంతోషంగా ఫీల్ అవుతూ రిషి ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు జగతిని పట్టుకుని జాగ్రత్త మేడం అని చెబుతూ ఇంట్లోకి తీసుకెళ్తాడు. అది చూసిన దేవయాని కోపంతో తగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఏదో ఒకటి చేయాలి నేను జగతిని ఏం చేయలేనా అనుకుంటూ ఉంటుంది దేవయాని.

36

 ఆ తర్వాత జగతి వాళ్ళు లోపలికి వెళ్తుండగా ధరణి హారతి తీసుకొని వస్తుంది. అప్పుడు దేవయాని ధరణిపై అరుస్తుండగా రిషి ఏం కాదులే పెద్దమ్మ అని అనడంతో దేవయాని మౌనంగా ఉంటుంది. అప్పుడు ధరణి దిష్టి తీస్తూ ఊర్లో వాళ్ళ దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అనడంతో మహేంద్ర జగతిలు నవ్వగా దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే రిషి మహేంద్రను ప్రేమతో హత్తుకొని వెల్కమ్ హోమ్ డాడ్ అని చెప్పి మేడం నేను డాడ్ పైన పడుకుంటాను మీరు నా రూమ్ వాడుకోండి అని అంటాడు. ఆ తర్వాత దేవయాని జరిగిన విషయాలు తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉండగా కావాలని ధరణి వెటకారంగా అత్తయ్య గారు వంట ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు దేవయాని ఫోన్ చేస్తాను లేకుంటే మెసేజ్ చేస్తాను అని అంటుంది.
 

46

ఇప్పుడు ధరణి అన్న మాటలు తలుచుకొని దేవయానికి కోపంతో రగిలిపోతూ అక్కడికి వెళుతుంది. నువ్వు ఏం చేస్తున్నావ్ అర్థం అవుతుందా ధరణి జగతి రాగానే ఇంట్లోకి హారతి ఇచ్చి ఎవరు పిలిచామన్నారు ఏంటి నీ పెత్తనం అని నిలదీస్తుంది దేవయాని. అప్పుడు ఎర్ర నీళ్లు దిష్టి తీసి లోపలికి పిల్చుకొని రమ్మని పెద్ద మావయ్య చెప్పారు అత్తయ్య అనడంతో దేవయాని మౌనంగా ఉంటుంది. పెద్ద మావయ్య చెప్పిన విషయాన్ని కాదని లేము కదా అని అనడంతో ఆ విషయాన్ని నాకు చెప్పాలి కదా అని అంటుంది దేవయాని. అప్పుడు ఇంతలో పనింద్ర అక్కడికి రావడంతో నేను అబద్ధం చెబుతున్నానేమో మామయ్య వస్తున్నారు మావయ్యను అడగండి అంటూ దేవయానిని అడ్డంగా ఫణీంద్ర ముందు ఇరికిస్తుంది ధరణి.
 

56

 ఇంతలో అక్కడికి ఫణింద్ర వస్తాడు. అప్పుడు దేవయాని అబద్ధం చెప్పి ఫణింద్ర ని అక్కడి నుంచి పంపిస్తుంది. మరొకవైపు జగతికి సేవలు చేస్తూ రూమ్ మొత్తం సర్దుతూ ఉంటుంది వసుధార. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. వసుధార నువ్వు వెళ్లి మేడంకి జ్యూస్ తీసుకునిరా అని వసు అక్కడి నుంచి పంపిస్తాడు రిషి. రిషి మీరు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లారు ఎలా వెళ్లారో తెలియదు కానీ రోడ్ యాక్సిడెంట్ లో అదృష్టవశాత్తు చిన్న ప్రమాదంతో బయటపడ్డారు. అప్పుడు ఈ యాక్సిడెంట్లో జరగరానిది ఏదైనా జరిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి మేడం అని అంటాడు. మీకు ఏమైనా అయితే డాడ్ తట్టుకోగలరా అని అంటాడు రిషి.

66

అదృష్టవశాత్తు మీరిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే ఏం జరిగి ఉండేదో మీరు ఊహించగలరా అని అంటాడు రిషి. దాని గురించి ఆలోచించారా ఆయనకు ఏదైనా జరిగితే మీరు నేను తట్టుకోగలమా అని అనడంతో జగతి ఎమోషనల్ అవుతుంది. బంధం గురించి మెసేజ్ పెట్టడం గొప్ప కాదు మేడం. డాడ్ కి మీరు మెసేజ్ పెట్టారు దాన్ని డిలీట్ చేశాను అని అంటాడు. మీరు అందులో పెట్టిన మెసేజ్ చూస్తే డాడ్ చాలా బాధపడతారు అందుకే మెసేజ్ డిలీట్ చేశాను అని అంటాడు రిషి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Recommended image2
Dhurandhar 2 vs Pushpa 2: `పుష్ప 2` రికార్డులకు బీటలు.. 27 రోజులుగా బాక్సాఫీసుపై `ధురంధర్‌ 2` దండయాత్ర
Recommended image3
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved