- Home
- Entertainment
- Guppedantha Manasu: శైలేంద్ర ప్రవర్తనకి షాకైన వసు.. నిజం చెప్పమంటూ ధరణిని నిలదీసిన జగతి!
Guppedantha Manasu: శైలేంద్ర ప్రవర్తనకి షాకైన వసు.. నిజం చెప్పమంటూ ధరణిని నిలదీసిన జగతి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఆత్మాభిమానం, మొండితనం రెండూ ఎక్కువగా ఉన్న ఇద్దరి ప్రేమికుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కాఫీ తీసుకువచ్చిన ధరణిని నీ అవతారం చూసుకున్నావా? నాకు ఇలా ఉంటే నచ్చదు, నేను ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వనని తెలుసు కదా అని కోప్పడతాడు శైలేంద్ర. ధరణి బాధపడుతుంది కానీ ఏమీ మాట్లాడదు. ఇలా సైలెంట్ గా ఉంటే నాకు నచ్చదు, ఆ కళ్ళ భాష అసలు ఇష్టం ఉండదు అంటాడు శైలేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన దేవయాని నేను కూడా రోజు అదే చెప్తూ ఉంటాను. అసలు నా మాట ఖాతరు చేస్తేనే కదా అంటూ శైలేంద్రని మరికొంచెం రెచ్చగొడుతుంది. ధరణి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఇదీ వరుస, ఏం చెప్పినా వినిపించుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోతుంది అంటుంది దేవయాని. మరోవైపు దిగులుగా మెట్లు దిగుతున్న ధరణిని చూసి ఆనందంగా ఉండవలసిన పిల్ల ఇలా దిగులుగా ఉందేంటి అంటుంది జగతి. వదిన గారు ఉన్నారు కదా, ఇద్దరి మధ్యలో దూరిపోయి ఉంటారు అంటాడు మహేంద్ర. మరోవైపు అప్పుడే వచ్చిన వసుని ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అడుగుతాడు రిషి. హాస్పిటల్ కి వెళ్లి వచ్చేసరికి లేట్ అయింది అంటుంది వసు. హాస్పిటల్ కా అంటూ కంగారుగా వాళ్ళ దగ్గరికి వస్తారు మహేంద్ర దంపతులు. ఈరోజు ఒక పొగరుబోతు మనిషిని చూశాను, ఇప్పటివరకు అలాంటి మనిషిని చూడలేదు ఇకమీదట చూడబోను కూడా అంటుంది వసు.
అంతలోనే దేవయానితో కలిసి వస్తున్న శైలేంద్ర ని చూసి ఆశ్చర్య పోతుంది వసు. శైలేంద్రని పరిచయం చేస్తాడు రిషి. శైలేంద్రకి కూడా వసుని పరిచయం చేస్తాడు రిషి. వసుధార అంటే నువ్వేనా అంటూ తెలిసినట్లుగా మాట్లాడుతాడు శైలేంద్ర. తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు మీకు ఇంతకుముందే పరిచయమా అంటాడు రిషి. ఇంతకుముందే పరిచయం అయింది అంటూ జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. తను చాలా ధైర్యవంతురాలు, ఏది ఒక పట్టాన వదిలిపెట్టదు తనని ఎలా భరిస్తున్నావు అని రిషిని అడుగుతాడు శైలేంద్ర. తను కూడా కావాలని నీతో గొడవ పడి ఉండదు కదా అంటూ వసు ని వెనకేసుకొస్తాడు రిషి.
అవతలి వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకుని యుద్ధం ప్రకటించాలి కదా అంటాడు శైలేంద్ర. బాధతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసు. జగతి కూడా ఆమె వెనకే వెళుతుంది. అసలు ఏం జరిగింది అంటూ నిలదీస్తుంది. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మేడం అంటూ జరిగిందంతా చెప్తుంది వసు. అక్కడ తన మాట తీరు చూస్తే చాలా కోపం వచ్చింది, ఇక్కడ తన మాట తీరు చాలా విచిత్రంగా ఉంది అంటుంది వసు. సరే ఇలాంటివి ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అంటూ వసుకి సర్ది చెప్తుంది జగతి. మరోవైపు తను తెచ్చిన గిఫ్ట్లు అందరికీ ఇస్తాడు శైలేంద్ర. వదినకి ఏం గిఫ్ట్ తెచ్చావు అన్నయ్య అంటాడు రిషి. తనకేం తెచ్చానో నాకు తెలుసు, సపరేట్ గా గదిలో తీసుకెళ్లి ఇస్తాను అంటాడు శైలేంద్ర.
మా అందరి ముందు ఇస్తే మేము కూడా సంతోషిస్తాను కదా అంటాడు మహేంద్ర. తనకోసం తీసుకువచ్చింది మీ అందరికీ తెలియవలసింది కాదు అంటాడు శైలేంద్ర. ఏదో స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చి ఉంటాడు వదినా అని ఆట పట్టిస్తాడు రిషి. మరోవైపు పరధ్యానంలో సోఫా ని గుద్దుకొని పడిపో బోతుంది వసు. రిషి పట్టుకుని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నేను మనుషుల్ని తప్పుగా అంచనా వేస్తున్నానా అంటుంది వసు.
ఒక్కొక్కసారి నువ్వు క్లారిటీ మిస్ అవుతూ ఉంటావు, నీ అభిప్రాయమే నిన్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అంటాడు రిషి. అదేంటి అంత మాట అనేసారు అంటుంది వసు. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏమనుకున్నావు అంటాడు రిషి. మీరు ఒక్కసారైనా నవ్వితే చూడాలనుకున్నాను అంటుంది వసు. చూసావా మరి అని అడుగుతాడు రిషి. అదంతా వదిలేయండి, నా గురించి ఏమనుకున్నారో చెప్పండి అంటుంది వసు.
పొగరు అనుకున్నాను అంటాడు రిషి. ఆ మాట అనటం ఆపరా అని నవ్వుతుంది వసు. అప్పటికి, ఇప్పటికీ ఆ పొగరు మీ పక్కనే ఉంది అంటుంది. ఎప్పటికీ ఉంటావు అంటాడు రిషి. కానీ మనిద్దరం ఇలా ఉండటానికి కారణమైన మనిషి మాత్రం తన వినాల్సిన పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉంది. తన నిరీక్షణ ఫలిస్తుందంటారా అంటుంది వసు. ఇంతలోనే జగతి వచ్చి ఇద్దరినీ భోజనానికి రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది.
నువ్వు ఎప్పుడు అడిగినా నా సమాధానం ఒక్కటే అంటాడు రిషి. మరోవైపు భోజనం సిద్ధం అయిందా అంటూ వంట గదిలోకి వస్తారు వసు, జగతి. ముభావంగా ఉన్న ధరణిని చూసి పొద్దున్న ఎందుకలా ఉన్నావు నిజం చెప్పు అంటూ నిలదీస్తుంది జగతి. నేను బాగానే ఉన్నాను అంటుంది ధరణి. నేను గమనించాను అక్కయ్య ఏమైనా అన్నదా అని అడుగుతుంది జగతి.
అంతలోనే దేవయాని వచ్చి భోజనాలు వడ్డించమంటుంది. శైలేంద్రని భోజనానికి రమ్మని పిలువు అని ధరణికి చెప్తుంది జగతి. ఎవరు ఏం పని చేయాలో చెప్పడానికి నేనున్నాను అంటుంది దేవయాని. భర్తని పిలవడానికి వెళుతుంది ధరణి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.