Guppedantha Manasu: ఏంజెల్‌లో బయటపడ్డ రాక్షసత్వం.. రిషీని బ్రతిమాలుకుంటున్న జగతి, మహేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. స్నేహితుడి జీవితం బాగోవాలని తపన పడుతున్న ఒక స్నేహితురాలి కదా ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 14 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవో చెప్పి తీరాలి అంటుంది ఏంజెల్. అయినా మౌనంగా ఉంటాడు రిషి. ఏంజెల్ అడుగుతుంది కదా నిజం చెప్పు అంటాడు విశ్వనాథం. ఎందుకు చెప్పాలి సార్ అని కోపంగా అడుగుతాడు రిషి. చెప్పి తీరాలి రిషి నీకు వేరే ఆప్షన్ లేదు, లేదంటే నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటుంది ఏంజెల్. నాకు పెళ్లి అయిపోయింది అని చెప్పి షాకిస్తాడు రిషి.
నీకు పెళ్లి అయితే నీ భార్య ఎక్కడ ఉంది అంటూ మళ్ళీ నిలదీస్తుంది ఏంజెల్. నా పర్సనల్స్ గురించి నిన్ను అడగద్దని చెప్పాను కదా అయినా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను అంటాడు రిషి. అదంతా కుదరదు నేను నీ ఫ్రెండ్ గా నీ పర్సనల్స్ గురించి మాట్లాడటం లేదు, నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా అడుగుతున్నాను తను ఎక్కడ ఉంది అని గట్టిగా నిలదీస్తుంది ఏంజెల్.
చెప్పటమే కాదు చూపిస్తాను కూడా కానీ నాకు కొంచెం టైం కావాలి అంటాడు రిషి. నీ భార్య గురించి చెప్పడానికి మూడు సంవత్సరాలు పట్టింది. చూపించడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం తీసుకుంటావు? అయినా నీకు 15 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోపు నీ భార్యని చూపిస్తే సరే లేదంటే నన్ను పెళ్లి చేసుకొని తీరాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంజెల్. అదే సమయంలో ఫణీంద్ర జగతికి ఫోన్ చేసి కాలేజీ చెయ్యి దాటిపోయేలా ఉంది నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేయ్ అంటాడు.
సరే మేము వస్తాము అని చెప్పి బయటకి వెళ్ళిపోతుంది జగతి. మనం ఈ విషయం గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాకు అర్జెంటు పని ఉంది అని చెప్పి మహేంద్ర కూడా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత విశ్వనాథం ఏంజెల్ దగ్గరికి వచ్చి ఇలా జరిగిందేంటమ్మా రిషికి పెళ్లయిందని తెలిసే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటాడు.
నువ్వేమీ బాధపడకు విశ్వం. నాకు ఏమీ బాధ లేదు అయినా నేను రిషి ని ప్రేమించలేదు కేవలం పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతే. రిషి ఇక్కడికి వచ్చిన దగ్గరనుంచి మూడీగా ఉండేవాడు. కారణం అడిగితే చెప్పేవాడు కాదు అతనికి మనసులో ఏదో బాధ ఉంది, ఆ బాధని బయటపెట్టడం కోసమే ఇదంతా చేశాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఎలా అయినా రిషి భార్యని అతనితో నేనే కలుపుతాను.
అప్పుడు నువ్వు ఎవరితో నాకు పెళ్లి చేసినా ఆనందంగా పెళ్లి చేసుకుంటాను అంటుంది ఏంజెల్. ఏంజెల్ లో ఎప్పుడు అంత మెచ్యూరిటీ చూడని విశ్వనాథం ఆశ్చర్యపోతాడు. ఆమెని,ఆమె మంచితనాన్ని మెచ్చుకుంటాడు. మరోవైపు జగతి బయటికి వచ్చిన తర్వాత ఫణీంద్ర తో మాట్లాడుతూ ఎమ్మెస్సార్ కి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడుతాను అంటుంది. ఫణీంద్ర ఫోన్ ఎమ్మెస్సార్ కి ఇస్తాడు.
ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఆ అగ్రిమెంటు చెల్లదు మీ ఆటలు సాగవు అంటుంది జగతి. అనుకున్నది ఏం దక్కించుకునే వరకు నేను కూడా ఊరుకోను. మీరు త్వరగా బయలుదేరి రండి నాకు పెద్దగా వెయిట్ చేసే టైం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఎమ్మెస్సార్. అదే సమయంలో రిషి ఏం జరిగింది అని తండ్రిని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు మహేంద్ర.
అన్నయ్య చాలా మంచివాడు డాడీ. అతను మనుషుల్ని అంచనా వేయలేడు అందర్నీ నమ్మేస్తాడు అని శైలేంద్ర మీద సింపతి చూపిస్తాడు రిషి. ఈ లోపు జగతి వచ్చే ఎమ్మెస్సార్ మాట్లాడిందంతా మహేంద్ర వాళ్ళకి చెప్తుంది. పరిస్థితి చేయి దాటేలాగా ఉంది మేం బయలుదేరుతున్నాం, నువ్వు కూడా రా రిషి అని అడుగుతాడు మహేంద్ర. నేను రాలేను డాడ్ మీరు వెళ్ళండి అంటాడు రిషి. జగతి కూడా రిషి ని రమ్మని, ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని ఎంతో రిక్వెస్ట్ చేస్తుంది. అయినా ఒప్పుకోడు రిషి.
అప్పుడు వసుధార రిషిని మందలిస్తుంది. మీ కోపం మా మీద అయితే డిబిఎస్టి కాలేజీ ఏం చేసింది. కాలేజీ మీద కాలేజీ స్టూడెంట్స్ మీద ఎందుకు మీకు అంత కోపం, మీ కోపాన్ని మామీద చూపించండి అంతేగాని కాలేజీ మీద కాదు. కాలేజీ చెజారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా అని గట్టిగా మందలిస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం