- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధారని అపార్థం చేసుకుంటున్న రిషి.. విషయం తెలుసుకొని కంగారు పడుతున్న జగతి దంపతులు!
Guppedantha Manasu: వసుధారని అపార్థం చేసుకుంటున్న రిషి.. విషయం తెలుసుకొని కంగారు పడుతున్న జగతి దంపతులు!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. విషయం తెలుసుకోకుండా తల్లిని ప్రేయసిని అపార్థం చేసుకుంటున్న ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి మీద అటాక్ చేసే టైం లో సడన్ గా వసుధార వచ్చి రిషి ని సేవ్ చేస్తుంది. అనుకొని ఆ పరిణామానికి షాక్ అవుతాడు రిషి. ఆ రౌడీని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ కిల్లర్ తప్పించుకొని పారిపోతాడు. వాచ్మెన్ కూడా కిల్లర్ ని వెతికి..రిషి దగ్గరికి వచ్చి అతను తప్పించుకున్నాడు సార్.
ఇంతకీ అతను ఎవరు అని అడుగుతాడు. అతను ఎవరో నాకు కూడా తెలియదు కానీ ఈ సంగతి విశ్వనాథం గారికి చెప్పొద్దు చెప్తే కంగారు పడతారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు రిషి. అతని వెనకే వసుధార కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మహేంద్ర కి ఫోన్ చేసి మీరు ఇక్కడికి వచ్చినట్లు ఎవరికైనా తెలుసా అని అడుగుతుంది. తెలియదు ఏం జరిగింది అని అడుగుతాడు మహేంద్ర.
మళ్లీ రిషి సార్ మీద ఎటాక్ జరిగింది అంటుంది వసుధార. ఒక్కసారిగా షాక్ అవుతాడు మహేంద్ర రిషి బాగానే ఉన్నాడు కదా అని కంగారుగా అడుగుతాడు. కంగారు ఏమీ లేదు బాగానే ఉన్నారు కానీ మీరు మాత్రం జాగ్రత్త మేము ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పకండి అలాగే మిషన్ ఎడ్యుకేషన్ టేకప్ చేస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ విష్ కాలేజీకి అప్పగిస్తున్నట్లుగా మినిస్టర్ గారికి చెప్పండి అంటుంది వసుధార.
రిషి ఒప్పుకున్నాడా అని అడుగుతాడు మహేంద్ర. లేదు సార్ కానీ కచ్చితంగా ఒప్పుకుంటారు ఎందుకంటే మా మీద కోపాన్ని పిల్లల భవిష్యత్తు మీద చూపించరు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి మహేంద్ర కి జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వసుధార. ఎవరితో మాట్లాడుతున్నావు అని సడన్ గా రిషి అడిగేసరికి షాకై అటువైపు చూస్తుంది. ఎదురుగా రిషి ఉంటాడు ఎవరితో మాట్లాడుతున్నావు మీ మేడం తోనేనా.
ఇక్కడ జరిగిందంతా చెప్పి మళ్ళీ ఇక్కడికి రప్పించాలని చూస్తున్నావా? ఇప్పటికీ మీరు చేసిన మోసం చాలదా మళ్లీ ఏంటి ఇదంతా అని కోపంగా అడుగుతాడు రిషి. మోసం అనే పదేపదే అనకండి సార్ ఎందుకంటే అది ఎందుకు చేసాము మాకు తెలుసు మీకు చెప్పినా మీరు నమ్మరు కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అయినా ఒక తల్లి కొడుకుని మోసం చేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు.
మీ మీద ఎటాక్ జరిగిన ప్రతిసారీ జగతి మేడం ఎంత ఏడ్చారో మీకు మాత్రం తెలియదా అంటుంది వసుధార. మీ మాటలతో నన్ను ప్రభావం చేసి నాకు ఇష్టం లేని పనిలో నన్ను ఇన్వాల్వ్ చేయాలని చూడకండి మిషన్ ఎడ్యుకేషన్ టేకప్ చేసేదే లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు దేవయాని శైలేంద్ర కి ఫోన్ చేసి ఏం జరిగింది అని అడుగుతుంది. రిషి తప్పించుకున్నాడని తెలుసుకొని అప్సెట్ అవుతుంది. శైలేంద్రని కోప్పడుతుంది.
రిషి ని ఫినిష్ చేశాకే ఇంటికి వస్తాను అని చెప్తాడు శైలేంద్ర. రిషి లేకపోతేనే నీకు ఎండి పదవి దక్కుతుంది అది గుర్తుపెట్టుకో అని కొడుకుని హెచ్చరిస్తుంది దేవయాని. సడన్గా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగటంతో అంతా వినేసారేమో అనుకొని కంగారు పడిపోతుంది. కానీ భర్త ఏమి వినలేదని తెలుసుకొని రిలాక్స్ అవుతుంది. శైలేంద్ర ఫోన్ చేశాడు రేపు కూడా రావడం అవ్వదట ధరణికి చెప్పమన్నాడు అని చెప్తుంది.
అదేదో వాడే చెప్పొచ్చు కదా నీకు చెప్పమని చెప్పటం ఎందుకు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వాళ్ల మధ్యలో దూరాలని ప్రయత్నించకు అని భార్యని చివాట్లు పెట్టి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. మరోవైపు జగతికి జరిగిందంతా చెప్తాడు మహేంద్ర. కంగారు పడిపోతుంది జగతి.
ఇప్పుడు రిషి బాగానే ఉన్నాడు కదా అని అడుగుతుంది. బానే ఉన్నాడు కంగారు పడవలసిన పనిలేదు అంటాడు మహేంద్ర. ఈ పని ఎవరు చేయించి ఉంటారు అంటుంది జగతి. శైలేంద్రకి రిషి వాళ్ళు అక్కడ ఉన్నట్లు తెలిసిపోయిందా అతని చేయించి ఉంటాడంటావా అంటాడు మహేంద్ర. సడన్ గా శైలేంద్ర అక్కడికి వచ్చి బాబాయ్ అని పిలుస్తాడు. షాక్ అవుతారు జగతి దంపతులు.