MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ పై మనీలాండరింగ్ కేసు,లవర్ తో 175 కోట్ల బంగ్లాలో కాపురం,!

హీరోయిన్ పై మనీలాండరింగ్ కేసు,లవర్ తో 175 కోట్ల బంగ్లాలో కాపురం,!

బాలీవుడ్‌ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌రేట్‌ విచారించింది. మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.  

3 Min read
Author : Surya Prakash | Asianet News
Published : Aug 31 2021, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

బాలీవుడ్‌ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌రేట్‌ విచారించింది. మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. దాదాపు 5గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ క్రమంలో ఈ కేసు విషయమై మీడియా మరింత ముందుకు వెళ్లి కేసు వెనుక ఉన్న విషయాలు తవ్వే ప్రయత్నాలు చేస్తోంది. అందులో కొన్ని చూస్తే చాలా షాకింగ్ గా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
జాక్వెలిన్‌ సెక్సీ ఫోటోలు.

జాక్వెలిన్‌ సెక్సీ ఫోటోలు.


ఓ ఆంగ్ల దిన పత్రిక ఇటీవల కథనం ప్రకారం... జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్తతో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ కలిసి ఉండేందుకు ముంబైలో రూ.175 కోట్ల వ్యయంతో ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. ముంబైలో జుహులోని ఖరీదైన ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న ఓ బంగ్లాను సొంతం చేసుకొన్నారు. ఇది ఓ హవాలా క్రిమినల్ కు లింక్ అయ్యి ఉంది.

311
జాక్వెలిన్‌ సెక్సీ ఫోటోలు.

జాక్వెలిన్‌ సెక్సీ ఫోటోలు.


 మనీ లాండరింగ్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ... సుకేష్ చంద్రశేఖర్ అనే హవాలా దందాను నిర్వహించే వ్యక్తి అనుమానాస్పద వ్యవహారాలపై దృష్టిపెట్టారు. ఇటీవల సుకేశ్ ఇంటిపై మెరుపు దాడులు నిర్వహించడంతో అనేక విషయాలు ఈడీ అధికారుల దృష్టికి వచ్చాయి. అందులో ఇదొకటి.
 

411


ఆ హవాలా కేసుకు జాక్వలైన్ ఫెర్నాండేజ్ వ్యవహారం కూడా ముడిపడి ఉండటంతో ఆమెను విచారించినట్టు తెలుస్తున్నది. అయితే ఆమెను ఈ కేసులో నిందితురాలిగా విచారించలేదనే విషయాన్ని అధికారులు చెప్తున్నారు.

511


రీసెంట్ గా  చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి 200 కోట్ల మేర హవాలా కార్యక్రమాలు నిర్వహించారనే ఆరోపణలు సుకేశ్ చంద్రశేఖర్‌పై వచ్చాయి.   దాంతో చెన్నైలో సముద్ర తీరంలో ఉన్న సుకేశ్ చంద్రశేఖరన్‌ ఇంటిపై దాడులు నిర్వహించారు.

611


సుకేశ్ గతంలో జైలు నుంచే హవాలా రాకెట్ నిర్వహించారు. ఆయనపై ఇలాంటి వ్యవహరాలపై 20 కేసులు నమోదయ్యాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే జాక్వలైన్ సహజీవనం చేస్తున్న బిజినెస్‌మెన్‌ను కూడా బెదిరించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దాంతో అతనికి ..వీళ్లకు మధ్య లింకేమిటి అనే యాంగిల్ లో పోలీస్ లు పావులు కదుపుతున్నారు.

711


 ఇంటర్‌ చదువును మధ్యలోనే ఆపేసి, 17 సంవత్సరాల వయసులోనే వైట్‌ కాలర్‌ నేరాలకు తెర తీసి, గడచిన దశాబ్ద కాలంలో పలుమార్లు జైలుకు చుట్టంచూపుగా అలా వెళ్లి, ఇలా వచ్చేసేవాడు సుకాష్‌ చంద్రశేఖరన్‌. పలు వార్తా సంస్థలు సుకాష్‌, జీవిత చరిత్రను తవ్వి తీసి ప్రచురించగా, అవన్నీ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

811


2011లో సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, లీనా పాల్‌ ను మోసం చేసిన కేసులో, ఆమె ఫిర్యాదు మేరకు సుకాష్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఆపై బెయిలు మీద బయటకు వచ్చి, ఆమెనే తన దానిని చేసుకుని తన మోసాల్లో భాగస్వామిని చేశాడు. 

911


తమిళ చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించిన లీనా మారీ పాల్‌ ను వివాహం చేసుకుని ఆమెతో కలిసి మోసాలకు పాల్పడ్డాడని తెలిపారు. రెండేళ్ల క్రితం ఆమెతో కలిసి ఇన్వె స్టర్లను మోసం చేసి డబ్బు నొక్కేసిన కేసులో అరెస్టయ్యాడని, ఆపై వారిద్దరూ కొంతకాలం జైల్లో ఉండి, బెయిల్‌ పై బయటకు వచ్చారని తెలిపారు. సుకాష్‌ అత్యంత సునాయాసంగా స్పెయిన్‌, గుజరాతీ సహా ఎనిమిది భాషలు మాట్లాడగలడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

1011
జాక్వెలిన్‌ సెక్సీ ఫోటోలు.

జాక్వెలిన్‌ సెక్సీ ఫోటోలు.


 2013లో ఢిల్లీ కేంద్రంగా ఓ కంపెనీని పెట్టి రూ. 3 వేల కోట్ల విలువైన నకిలీ బీమా పాలసీలను విక్రయించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడని, ఆ డబ్బుతో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాను ఎంపీనన్న తప్పుడు ఐడీ కార్డులు సౄఎష్టించి వాటి సాయంతో తిరిగాడని, అతని వద్ద ఆస్టన్‌ మార్టిన్‌, రోల్స్‌ రాయిస్‌, లాండ్‌ క్రూయిజర్‌, హమ్మర్‌, బీఎండబ్ల్యూ, మెర్సిడిస్‌ బెంజ్‌, ఆడి కార్లు ఉన్నాయని, ఆ కార్లకు ఎంపీ అన్న నేమ్‌ ప్లేట్లు పెట్టుకున్నాడని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. 

1111


ఈ స్దాయి క్రిమినల్ సుకేశ్ చంద్రశేఖర్‌తో లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తూ పలు కోణాల్లో కేసును విచారించడానికి జాక్వలైన్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ విచారణ సోమవారం రాత్రి 7.30 గంటల వరకు కొనసాగినట్టు తెలిసింది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: పాట కొత్తదే.. కానీ లుక్ పాతది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ సాంగ్!
Recommended image2
Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?
Recommended image3
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved