స్కూల్ టీచర్ అవతారం ఎత్తిన జబర్దస్త్ వర్ష... అది మాత్రం చండాలం అంటూ ఏకిపారేస్తున్న నెటిజెన్స్!
బుల్లితెర సెలెబ్రెటీలకు సోషల్ మీడియా ప్రధాన ఆదాయ మార్గాల్లో ఒకటిగా మారింది. యూట్యూబ్ తర్వాత ఇంస్టాగ్రామ్ కాసులు కురిపిస్తుంది. అందుకే ఫోటో షూట్స్, రీల్స్ తో రెచ్చిపోతున్నారు.
Jabardasth Varsha
జబర్దస్త్ వర్ష ఒక ఇంస్టాగ్రామ్ రీల్ చేశారు. సదరు వీడియోలో ఆమె కెమిస్ట్రీ టీచర్ అవతారం ఎత్తారు. ప్రేమలో పడి మురిసిపోతున్న యంగ్ టీచర్ గా మెస్మరైజ్ చేశారు. వర్ష వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.
Jabardasth Varsha
ఈ వీడియోపై నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. 'బ్యూటీ ఆన్ డ్యూటీ' అని ఒకరు కామెంట్ చేశారు. చాలా మంది నెటిజెన్స్ ఆ వీడియో మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో వర్ష బ్యాక్ లెస్ జాకెట్ ధరించారు. టీచర్స్ ఎక్కడైనా అలాంటి బ్లౌస్ వేసుకుంటారా? చండాలంగా ఉంది, అని విమర్శలు చేస్తున్నారు.
Jabardasth Varsha
టీచర్ ప్రొఫెషన్ కి సెట్ అయ్యేలా బట్టలు వేసుకోవాలి. ఆ బ్లౌజ్ దారుణంగా ఉందని ఏకిపారేస్తున్నారు. ఇక ఆ వీడియోలో వర్ష ప్రేమించిన అబ్బాయి నెటిజెన్స్ కి నచ్చలేదు. నువ్వు ప్రేమించిన టీచర్ ఏం బాగోలేదని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారైనా వర్ష కొన్ని జాగ్రత్తలు తీసుకొని వీడియోలు చేస్తే బెటర్.
Jabardasth Varsha
ఇటీవల నాకు సడన్ ఎంగేజ్మెంట్ అంటూ షాక్ ఇచ్చింది. థంబ్ నైల్ పెట్టి యూట్యూబ్ వీడియో షేర్ చేసింది. చివర్లో ట్విస్ట్ ఇస్తూ ఎంగేజ్మెంట్ రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతలకు, నాకు కాదని బాంబు పేల్చింది. వర్ష ప్రాంక్ వీడియో మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వ్యూస్ కోసం ఈ ఫ్రాంక్స్ అవసరమా అంటూ అసహనం ప్రదర్శించారు.
Jabardasth Varsha
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ తన ఎంగేజ్మెంట్ గురించి వర్షకు సడన్ గా చెప్పాడట. రేపు ఎంగేజ్మెంట్ అనగా రాత్రిపూట ఫోన్ చేసి చెప్పాడట. అప్పటికప్పుడు చెబితే నేను ఫంక్షన్ కి ఎలా సిద్ధం... అంటూ రాకింగ్ రాకేష్ పై అసహనం వ్యక్తం చేసింది.
Jabardasth Varsha
మరో వైపు ఇమ్మానియేల్-వర్ష బుల్లితెర లవర్స్ గా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది.
Jabardasth Varsha
ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూసి ఫీల్ అయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో షో మానేస్తున్నట్లు వర్ష చెప్పి ఎమోషనల్ అయ్యారు. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చిన వర్ష దూసుకుపోతున్నారు.
Jabardasth Varsha
ప్రసుత్తం వర్ష జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లలో సందడి చేస్తున్నారు. అలాగే పలు స్పెషల్ ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. ఒకప్పటి ఈ సీరియల్ నటి జబర్దస్త్ కి వచ్చాక దశ తిరిగింది. బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా వెలిగిపోతుంది. ఆమె కంటూ గుర్తింపు, పాపులారిటీ సొంతం చేసుకుంది.