- Home
- Entertainment
- సోషల్ మీడియా కామెంట్లకి ఇంట్లో ముఖం చూపించుకోలేకపోయిన `జబర్దస్త్`వర్ష.. షోలో కన్నీరు.. యాంకర్ రష్మీ ఓదార్పు
సోషల్ మీడియా కామెంట్లకి ఇంట్లో ముఖం చూపించుకోలేకపోయిన `జబర్దస్త్`వర్ష.. షోలో కన్నీరు.. యాంకర్ రష్మీ ఓదార్పు
సినిమా తారలు, సెలబ్రిటీలపై ట్రోల్స్, కామెంట్లు సర్వసాధారణమే. అయితే అవి చాలా సార్లు వారి ఫ్యామిలీలో ఇబ్బంది పెడుతుంటాయి. `జబర్దస్త్` వర్షపై ఇటీవల దారుణంగా ట్రోల్స్, కామెంట్లు రావడంతో ఇంట్లో ముఖం చూపించుకోలేకపోయిందట. షోలో ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరైంది వర్ష.

`జబర్దస్త్` వర్ష కమెడీయన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `జబర్దస్త్`లో ఇమ్మాన్యుయెల్‌తో జోడీగా మంచి గుర్తింపు వచ్చింది. క్రేజీ జోడీగా నిలిచింది.కానీ ఇటీవల వీరిద్దరు కలిసి చేయడం లేదు. ఇతర స్కిట్లలో కేవలం పాత్రలుగానే మారిపోయారు.
ఇతర జబర్దస్త్ మేల్ కమెడీయన్లతో మెరుస్తుంది వర్ష. అందులో భాగంగా భాస్కర్ తో ఇప్పుడు సందడి చేస్తుంది. గత వారం ఎపిసోడ్‌లో భాస్కర్ స్కిట్‌లో కామెడీని పంచింది. వీరు వెరైటీగా ఊర్లోకి వెళ్లి తమ స్కిట్ చేస్తామని, అక్కడ ఆడియెన్స్ నుంచి వచ్చిన స్పందనని షోలో టెలికాస్ట్ చేయాలంటూ ఊర్లోకి వెళ్లారు. అక్కడ స్థానిక సర్పంచ్, ఇతర వ్యక్తులు చేసిన రచ్చకి స్కిట్ చేయలేకపోయారు కదా, తిరిగి రాళ్ల వేయించారు. ఇదంతా స్కిట్‌లో వేసిన స్కిట్. ఆద్యంతం ఆకట్టుకుంది.
అయితే ఈ సందర్భంగా వర్షని ఉద్దేశించి జడ్జ్ రోజా `ఏంటి వర్ష ఈ మధ్య నీ మీద ట్రోల్స్, కామెంట్లు ఎక్కువయ్యాయట, బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది` అని ప్రశ్నించింది. దానికి వర్ష స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా వర్ష చెబుతూ, స్టేజ్‌పై, ఈ షోలో మనం వేరే అని, ఇంటికెళ్లాక మనం వేరని, ఇక్కడ మన నటనని అందరు అభినందిస్తుంటారు. రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి. అదంతా యాక్టింగ్‌లో భాగం.
సెట్‌కి వచ్చినప్పుడు మనకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం దారుణంగా ఉంటాయని తెలిపింది. `వర్ష నువ్వు ఎవరితోనైనా వెళ్లావా?`, `వర్షకి ఎవడైనా ఉన్నాడా?` అంటూ వల్గర్ కామెంట్లు పెడుతున్నారని తెలుపుతూ వాపోయింది.
తన తమ్ముడు ఈ కామెంట్లని చూసి ముఖంపై ఫోన్ పెట్టి ఏంటక్కా ఇది అని అడిగితే, దాన్ని ఫేస్ చేయలేకపోయానని స్టేజ్‌పైనే కన్నీరుమున్నీరయ్యింది. దీనికి రోజా స్పందిస్తూ 90శాతం మంది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఓ పది శాతం మిమ్మల్ని కామెంట్ చేస్తారు. అవన్నీ పట్టించుకోవద్దని తెలిపింది.
మరోవైపు యాంకర్ రష్మి స్పందించింది. ఈ సందర్భంగా తన ఎక్స్ పీరియెన్స్ ని చెబుతూ, సుధీర్‌తో చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేశారని, కానీ నేనే వేరే వ్యక్తులతో యాక్టింగ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదని, సుధీర్‌తోనే రష్మి చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారని చెప్పింది.
అబ్బాయిలు ఇతర అమ్మాయిలతో పులిహోర కలిపినా, వాళ్లతో యాక్ట్ చేసినా అంగీకరిస్తున్నారని, కానీ అమ్మాయిలు వర్క్ పరంగా ఇతర అబ్బాయిలతో కలిసి నటిస్తే ఒప్పుకోవడం లేదని, దారుణంగా కామెంట్లు చేస్తున్నారని వాపోయింది. ట్రోలర్స్ బతుకుతుందే దీని మీద. అవన్నీ మనం పట్టించుకోకూడదు. జస్ట్ దూలిపోసుకోవాలన్నట్టుగా సిగ్నల్ ఇచ్చింది రష్మి.
ఈ సందర్భంగా తనకు ధైర్యాన్నిచ్చిన రోజాకి, అలాగే సపోర్ట్ గా నిలిచిన రష్మికి ధన్యవాదాలు తెలిపింది వర్ష. `మీరిచ్చే ఈ సపోర్ట్ తో నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే పోరాడతాను` అని వర్ష చెప్పడం హైలైట్‌గా నిలిచింది.