- Home
- Entertainment
- ఇమ్మాన్యుయెల్ అంటే జబర్దస్త్ వర్షకి అంత ప్రేమా.. తాగుబోతు రమేష్‌ని పట్టుకుని అతన్నే గుర్తు చేసుకుని షాక్
ఇమ్మాన్యుయెల్ అంటే జబర్దస్త్ వర్షకి అంత ప్రేమా.. తాగుబోతు రమేష్‌ని పట్టుకుని అతన్నే గుర్తు చేసుకుని షాక్
జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్ కలిసి చాలా రోజులు స్కిట్లు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఒకానొక దశలో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తన మనసులో మాట బయటపెట్టింది వర్ష.

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్ జబర్దస్త్ లో పాపులర్ జంటగా రాణిస్తున్నారు. రష్మి, సుధీర్‌ల తర్వాత ఈ జోడీ బాగా ఫేమస్ అయ్యింది. నిజంగానే ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా రావడం విశేషం. అభిమానులు కూడా ఈ ఇద్దరిని కలిసే చూస్తున్నారు. కలిసి ఉండాలనే డిమాండ్ కూడా వచ్చింది.

కానీ ఈ ఇద్దరి జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు కలిసి చేసిన స్కిట్లు మంచి ఆదరణ పొందాయి. జబర్దస్త్ షోకి రేటింగ్ తీసుకొచ్చాయి. డ్యూయెట్లు, లవ్ ప్రపోజల్స్, ఎంగేజ్‌మెంట్లు వరకు స్కిట్లని ప్రదర్శించి మెప్పించారు. నిజంగానే పెళ్లి చేసుకుంటారా అనేంతగా రక్తి కట్టించారు. అయితే అది షో కోసం చేసినా అభిమానులు మాత్రం నిజంగానే వీరు లవర్స్ గా ఫిక్స్ అయ్యారు.
తమపై ట్రోల్స్, కామెంట్లు ఎక్కువ కావడంతో కొన్నాళ్లు వర్ష షో మానేసింది. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజులు ఇమ్మాన్యుయెల్‌తోనే కలిసి స్కిట్లు చేసింది. తమ పాత రిలేషన్‌ని కొనసాగించింది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా దూరమవుతూ వచ్చింది. కామెంట్లకి చెక్ పెట్టేందుకు ఈ ప్రయత్నం చేసిందని అంతా అనుకుంటున్నారు. బహుశా వాళ్ల ఉద్దేశ్యం కూడా అదే.
అయితే జబర్దస్త్ వర్షలో మాత్రం ఇమ్మాన్యుయెల్‌పై మనసులో ప్రేమ ఉంది. అదిప్పుడు తెలియకుండానే బయటకు వచ్చింది. సుమ షోలో ఇమ్మూపై తన మనసులో ఉన్న ప్రేమని వెల్లడించింది. అయితే ఆమె ప్రేమని వ్యక్తం చేయలేదు, కానీ ఆయన్ని తలచుకుంది. ఇదే ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది.
జబర్దస్త్ టీమ్.. ఇమ్మాన్యుయెల్, వర్ష, భాస్కర్, నరేష్, రోహిణి కలిసి, తాగుబోతు రమేష్ కలిసి సుమ యాంకర్‌గా చేస్తున్న `సుమ అడ్డా`కి వెళ్లారు. అక్కడ తమదైన స్టయిల్‌లో కామెడీని పండించారు.పంచ్‌లతో రెచ్చిపోయారు. భాస్కర్, రోహిణి, నరేష్ కలిసి తమ స్కిట్లతో నవ్వులు పూయించారు.
మరోవైపు తాగుబోతు రమేష్‌ని పట్టుకుని ఇద్దరు తమ ప్రేమని వ్యక్తం చేసే స్కిట్లని ప్రదర్శించారు. వీరిని ఇమ్మాన్యుయెల్ డిస్టర్బ్ చేస్తుంటాడు. అయితే తాగుబోతు రమేష్‌ని పట్టుకుని అన్ కాన్షియస్‌గా ఇమ్మూ అనేసింది. దీంతో రమేష్‌కి మైండ్ బ్లాక్ అయ్యింది. మరోవైపు ఇమ్మాన్యుయెల్ నోరెళ్లబెట్టాడు. ఠక్కున మాట జారింది నోరు కర్చుకుంది వర్ష.
అంతకు ముందు నరేష్‌ని భాస్కర్ దొంగనా కొడుకు అని తిట్టగా, ఇక్కడ అసలు దొంగని మర్చిపోయారని వర్షని చూపించాడు ఇమ్మూ. దీంతో సుమ స్పందిస్తూ నీ మనసు దోచుకుందనేగా అని సెటైర్లు పేల్చింది. దీంతో అమ్మ బాబోయ్ అంటూ తలపట్టుకున్నారు ఇమ్మూ ఇది నవ్వులు పూయించింది. మొత్తంగా సుమ అడ్డాలో ఈ రెండు టీమ్ లు ఆద్యంతం నవ్వులు విరిసేలా చేసి ఎంటర్‌టైన్ చేశారు.