- Home
- Entertainment
- నీలిరంగు గౌనులో ఆడ నెమలిలా కనువిందు చేస్తున్న జబర్ధస్త్ వర్ష... లేత అందాలతో కుర్ర హృదయాలకు గాయం
నీలిరంగు గౌనులో ఆడ నెమలిలా కనువిందు చేస్తున్న జబర్ధస్త్ వర్ష... లేత అందాలతో కుర్ర హృదయాలకు గాయం
జబర్దస్త్ తో పాటు పలు టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష (Varsha)ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈవెంట్స్ లో ఆమె ప్రజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.సీరియల్ నటిగా ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా వర్షకు సరైన గుర్తింపు రాలేదు. దీనితో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు.
వర్ష, ఇమ్మానియేల్ కెమిస్ట్రీ స్కిట్స్ లో ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది. మరోవైపు ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష, అలాగే ఇమ్మానియేల్ కూడా వర్ష అంటే పడి చస్తారు.
వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు.
కొన్నాళ్ళు జబర్ధస్త్ (Jabardasth) వేదికపై వర్ష కనిపించలేదు. ఇమ్మానియేల్ తో ఆమె చేస్తున్న స్కిట్స్ కి యూట్యూబ్ లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారట. ఏమిటి అక్కా.. ఇది అంటూ వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. ఈ విషయం జబర్దస్త్ వేదికపై చెప్పిన వర్ష... జబర్దస్త్ మానేస్తున్నాను అన్నారు. నిజంగానే కొన్నాళ్ళు ఆమె జబర్దస్త్ కి దూరమయ్యారు.
అయితే ఈ మధ్య మరలా ఎంట్రీ ఇచ్చారు. ఆమె జబర్దస్త్ స్కిట్స్ లో సందడి చేస్తున్నారు. వర్ష కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా వర్ష-ఇమ్మానియేల్ బయట కూడా మంచి బాండింగ్ కెమిస్ట్రీ కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల ఇద్దరూ కారులో షికారు కొడుతుండగా ఎవరో ఫోటో తీశారు. సదరు ఫోటో రోజా (Roja sevalmani)వరకు రావడంతో స్టేజ్ పైనే ఫోటో చూపిస్తూ వివరణ అడిగారు.
షూటింగ్ సెట్స్ లో వర్ష స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో ఇమ్మానియేల్ ఆమెకు కాల్ చేయగా... విషయం చెప్పారట. షూటింగ్ స్పాట్ కి వెళ్లి ఆమెను పిక్ అప్ చేసుకున్నాడట ఇమ్మానియేల్. నాకు ఏమైనా జరిగితే ఇమ్మానియేల్ కి ఇట్టే తెలిసిపోతుందని వర్ష చెప్పడం గమనార్హం.
వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్ కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది.
సోషల్ మీడియా ద్వారా మరింత ఫాలోయింగ్ రాబడుతుంది. వర్ష ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండీ వేర్ లో అమ్మడు సోకులు చూపిస్తూ చేసే ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా నీలి రంగు గౌనులో మెరిసిపోయింది వర్ష. సదరు డ్రెస్ లో వర్ష ఆడనెమలి వలె అందంగా కనిపించింది. వర్ష లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.
Also read Samantha : గోవాలో రచ్చరచ్చ చేస్తున్న సమంత.. బికినీ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.