Samantha : గోవాలో రచ్చరచ్చ చేస్తున్న సమంత.. బికినీ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గోవాలో రచ్చ రచ్చ చేస్తుంది. క్రిస్ మస్,న్యూ ఇయర్ అకేషన్స్ ను సెలబ్రేట్ చేసుకోవడం కోసం గోవా వెళ్లిన సమంత.. బికినీ లుక్ తో సెగలు పుట్టిస్తోంది.
ప్రస్తుతం సమంత(Samantha) గోవాలో ఉంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది. క్రిస్ మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లింది సమంత. అందరూ సెలబ్రేటీలు.. ప్రస్థుతం మాల్దీవుల వెంట పడుతుంటే.. సమంత మాత్రం తనకు నచ్చిన గోవాలో ఎంజాయ్ చేస్తోంది. బికినీ లుక్ తో సెగలు పుట్టిస్తోంది. సమంత బికినీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సొషల్ మీడియాలో సమంత(Samantha) సందడి పెరిగిపోయింది. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా.. మరో వైపు వెకేషన్ టూర్లు... ఇలా అస్సలు ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్స్ వేసుకుంటుంది. మధ్యలో రిలీఫ్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి.. నచ్చిన ప్లస్ ను చుట్టి వస్తుంది సమంత(Samantha). తనకు నచ్చిన లైఫ్ ను.. తనకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటుంది సమంత.
అటు సినిమల షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కూడా .. పర్ఫెక్ట్ ప్లానిగ్ తో వెళ్తుంది సమంత. రీసెంట్ గా యశోద మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కోసం ఇంకా టైమ్ ఉండటంతో ఎంజాయ్ చేయడం కోసం గోవా చేరింది. తనతో పాటు ఎప్పుడు తనతో ట్రావెల్ చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్ ను వెంటబెట్టకుని వెళ్లింది. అక్కడి నేచర్ ను ఎంజాయ్ చేస్తుంది. వాటర్ ఫాల్స్ లో పిల్లల మాదిరి ఆడుకుంటుంది.
samantha
నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా డిస్ట్రబ్ అయ్యింది సమంత. ఆ బాధనుంచి కోలుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్నో ఫిలాసఫీ పోస్ట్ లు పెడుతూ..సోషల్ మీడియాలో తన బాధను తెలిపింది. ఫ్రెండ్స్ తో కలిసి దేవాలయాల యాత్రలు చేసింది. ఎంతోమంది గురువులను కలిసింది. ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్ కు వస్తున్న సామ్.. ఫుల్ గా ఎంజాయ్ మూడ్ లోకి వచ్చేసింది.
ప్రస్తుతం గోవాలో ఉన్న సమంత(Samantha) క్రిస్ మస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అంతే కాదు న్యూ ఇయర్ వరకూ తన ప్రెండ్స్ తో కలిసి.. గోవాలోనే సమంత ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడే కొత్త సంవత్సరం వేడుకలను గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. న్యూ ఇయర్ వేడుకల తరువాత సామ్ తన రెగ్యూలర్ షూటింగ్ షెడ్యూల్స్ లో జాయిన్ అవుతుందట.
సమంత విమెన్ సెంట్రిక్ సినిమాలతో సత్తా చాటుకుంటుంది. ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ లో ఉంది. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసింది సమంత. మరికొన్న సినిమాలు ట్రాక్ ఎక్కించబోతుంది. ముఖ్యంగా పుష్ప మూవీలో సమంత చేసిన “ఉ అంటావా మామా ఊఊ అంటావా సాంగ్”.. యూత్ లో యమా క్రేజ్ సాధించింది. సమంత చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ కావడం.. ఆమె పర్ఫామెన్స్ పీక్స్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ కు ఉర్రూతలూగారు.