తన ప్రియుడు స్వయంగా తీసిన ఫోటోలు.. సిరి హనుమంత్ లేటెస్ట్ పిక్స్ వైరల్
యూట్యూబర్ గా, బిగ్ బాస్ షోతో గుర్తింపు పొందిన యాంకర్ సిరి హనుమంత్. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ప్రధాన కంటెస్టెంట్ గా ఆకర్షించింది.

యూట్యూబర్ గా, బిగ్ బాస్ షోతో గుర్తింపు పొందిన యాంకర్ సిరి హనుమంత్. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ప్రధాన కంటెస్టెంట్ గా ఆకర్షించింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
బిగ్ బాస్ 5తో సిరికి మరింత పాపులారిటీ దక్కింది. ముక్కుసూటిగా మాట్లాడుతూ తన ధైర్యాన్ని సిరి చాటుకుంది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు.
అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే సిరి ప్రస్తుతం యాంకర్ గా, నటిగా అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం సిరి హనుమంత్ జబర్దస్త్ షోకి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం సిరికి దక్కింది. సినిమాల్లో బిజీ కావడం, మరికొన్ని కారణాలతో అనసూయ జబర్దస్త్ కి దూరమైంది. సిరి ప్రస్తుతం జబర్దస్త్ లో అనసూయ లేని లోటు తీరుస్తోంది.
జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వచ్చినా కామెడియన్స్ తో కలసి పోయి కామెడీ పండించాలి. చిన్నపాటి రొమాన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. గతంలో సుధీర్, రష్మీ బుల్లితెరపై ఎలా అలరించారో తెలిసిందే.
ప్రస్తుతం సిరి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. జబర్దస్త్ కమెడియన్లు సిరి పై సరాదాగా పంచ్ లు వేస్తున్నారు. అప్పుడప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఆమెపై పడుతున్నాయి.
తాజాగా సిరి హనుమంత్ స్వయంగా తన ప్రియుడు శ్రీహన్ క్లిక్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్ డ్రెస్ లో సిరి ఎంతో అందంగా ఉంది. ఈ ఫోటోలకు సిరి పింక్ పర్ఫెక్ట్ అని కామెంట్ పెట్టింది.