- Home
- Entertainment
- సుధీర్, గెటప్ శ్రీను లేక ఒంటరైన రామ్ ప్రసాద్... వాళ్లిద్దరూ ఉంటే అంటూ జబర్దస్త్ వేదికపై ఎమోషనల్
సుధీర్, గెటప్ శ్రీను లేక ఒంటరైన రామ్ ప్రసాద్... వాళ్లిద్దరూ ఉంటే అంటూ జబర్దస్త్ వేదికపై ఎమోషనల్
జబర్దస్త్ కామెడీ షో బుల్లితెరపై ఒక అధ్యాయం కాగా సుడిగాలి సుధీర్ టీమ్ ది ఒక చరిత్ర. ముగ్గురు టాలెంటెడ్ మిత్రులతో కూడిన ఈ టీమ్ ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే కొన్నాళ్లుగా ఈ టీమ్ పూర్తి స్థాయిలో కనిపించడం లేదు.

Jabardasth
జబర్దస్త్ (Jabardasth)షోలో నాన్ స్టాప్ గా నవ్వించే టీం గా సుడిగాలి సుధీర్ టీం పేరు తెచ్చుకుంది. మంచి కోఆర్డినేషన్ కలిగిన గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లతో కూడిన ఈ టీమ్ ప్రేక్షకుల మోస్ట్ ఫేవరేట్. రామ్ ప్రసాద్ తనతో పాటు మూడు పాత్రలు ప్రధానంగా స్కిట్ రాస్తారు. ముగ్గురు మిత్రులు అలవోకగా స్కిట్ లో ఒదిగిపోయి కామెడీ పంచుతారు.
Jabardasth
ఈ షోతో ముగ్గురూ మంచి ఫేమ్ రాబట్టారు. గెటప్ శ్రీను (Getup Sreenu) కమెడియన్ గా సినిమాల్లో బిజీ అయ్యాడు. సుడిగాలి సుధీర్ బుల్లితెర షోలు చేస్తూనే హీరోగా సినిమాలు చేస్తున్నారు. అలాగే రామ్ ప్రసాద్ రైటర్ గా, యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. చాలా కాలం నుండే వీరికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ జబర్దస్త్ షో వీడలేదు.
Jabardasth
ఈ మధ్య కాలంలో వస్తున్న స్కిట్స్ లో ఒకరుంటే మరొకరు ఉండడం లేదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)తో పాటు, గెటప్ శ్రీను ఇద్దరూ మిస్ అయ్యారు. ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే పాత కొత్త కమెడియన్స్ తో స్కిట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా... తన మిత్రులు లేకుండా స్కిట్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పుకొని రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.
Jabardasth
లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ గెస్ట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు. ఆయన మాటల్లో మాటగా సుధీర్, శ్రీను లేకుండా స్కిట్ చేయడం ఎలా ఉందని? అడిగాడు. వారిద్దరూ ఉంటే నాకు చాలా ఈజీ.. బావా ఇది నీ డైలాగ్, ఇది నా డైలాగ్ అంటూ స్కిట్ జాలీగా లాగించేస్తాం. కానీ ఎప్పుడు స్కిట్ నేను రాయడంతో పాటు అందరినీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, అంటూ రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.
Jabardasth
కారణం ఏదైనా మెల్లగా సుధీర్, శ్రీను జబర్దస్త్ కి దూరమవుతున్న భావన కలుగుతుంది. ఈటీవీలో సుధీర్ షోలు తగ్గిపోయాయి. ఆయన మెల్లగా స్టార్ మా కి షిఫ్ట్ అవుతున్నాడు. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న శ్రీను, రామ్ ప్రసాద్ జబర్దస్త్ నుండి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.