యూట్యూబ్‌లో వీడియో మొత్తం చూశానంటూ `జబర్దస్త్` సత్యని భాస్కర్ బ్లాక్ మెయిల్.. స్టేజ్‌పైనే పరువు తీశాడుగా!
`జబర్దస్త్` సత్యని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్. యూట్యూబ్‌లో వీడియో మొత్తం చూశానని స్టేజ్‌పైనే అందరి ముందు పరువు తీశాడు. ప్రస్తుతం అది చర్చనీయాంశం అవుతుంది.

extra jabardasth promo
`జబర్దస్త్` కామెడీ షోతో పాపులర్ అయ్యింది సత్య. ఈ షోనే తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఆమె ఓ వైపు జబర్దస్త్ షోతోపాటు అడపాదడపా సినిమాలు కూడా చేస్తుంది. కామెడీ రోల్స్, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇతర పాత్రలు చేస్తుంది. ఇటీవల ఆమె నితిన్ నటించిన `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్` అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ఇందులో సత్య పోలీస్ కానిస్టేబుల్‌గా నటించింది. పోలీస్ స్టేషన్‌లో విలన్‌ని ఆటకట్టిస్తూ ఓ బోల్డ్ సాంగ్‌కి స్టెప్పులేసింది. ఒకప్పుడు రికార్డింగ్ డాన్సుల్లో ఊపేసిన `నీ పెళ్లే తాళం` అనే పాటని ఈ మూవీలో పెట్టారు. పోలీస్ స్టేషన్‌లో సత్యతోపాటు హైపర్ ఆది, అలాగే హీరో నితిన్ కూడా డాన్సులు వేశారు. కామెడీ కోసం ఈ పాటని పెట్టారు. కానీ చివరికి పెద్ద బూతులా, చాలా చిరాకుగా, చాలా దారుణంగా మారింది. ఆ పాట బెడిసి కొట్టింది.
అయితే ఇందులో సత్య మీదనే ప్రధానంగా ఈ పాట వస్తుంది. ఇలాంటి పాటలో ఎలా చేసిందనే విమర్శలు, కామెంట్స్ వచ్చాయి. పెద్ద ట్రోలింగ్ చేశారు. దీంతో ఎంతో అవమానంగా ఫీలయ్యింది సత్య. అంతేకాదు తనకు ఇష్టం లేదని, తాను చేయననే చెప్పిందట. అయినా కామెడీగా ఉంటుందని, హీరో పక్కన సీన్ కావడంతో బాగా హైలైట్ అవుతుందని నమ్మించారట. తనకు మరో ఆప్షన్ లేక చేసినట్టు సత్య తెలిపింది. ఈ సినిమా విడుదలయ్యాక పలు మార్లు దీనికి సంబంధించిన రచ్చ నడిచింది. సత్య ఎంతో షేమ్ ఫీలింగ్‌ని ఫేస్ చేసింది.
extra jabardasth promo
అయితే ఇప్పుడు దాన్ని పట్టుకుని బెదిరింపులకు దిగాడు బుల్లెట్ భాస్కర్. యూట్యూబ్‌లో ఆమె వీడియో మొత్తం చూసినట్టు తెలిపారు. అంతేకాదు కావాలనే ఆ పని చేసినట్టు చెప్పారు. ఇదిప్పుడు మరింత రచ్చ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. `ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఇందులో మొదట నరేష్.. సత్యని పట్టుకుని ఎంత వరకు చదివాం అని అడగ్గా `లా` అని చెబుతుంది. ఇంత పెద్దగా అయ్యావు, ఆ ఒక్క అక్షరమే చదివావా అని ఎద్దేవా చేస్తాడు.
extra jabardasth promo
ఆ తర్వాత సత్య `నువ్వొస్తానంటే` పాటకు ఆడుతూ ఆనందంలో తేలియాడుతుంది. అంతలోనే అట్నుంచి వచ్చాడు బుల్లెట్ భాస్కర్. చూడ్డానికి పెద్ద రౌడీ షీటర్‌లాగా ఉన్నారు. వెనకాల ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు. తనని గుద్దేయడంతో చూసుకోవద్దా అంటూ ప్రశ్నించింది సత్య. దీనికి చూసే గుద్దా అని రాష్‌గా సమాధానం ఇచ్చాడు భాస్కర్.
extra jabardasth promo
దీనికి `నేను అంటోంది సరిగా చూడలేదా అని` అని సత్య అడగ్గా, రాత్రి మొత్తం యూట్యూబ్‌లో చూశా అని భాస్కర్ చెప్పగా, ఏం చూశారని అమాయకంగా అడిగింది సత్య. దీనికి `ట్యా ట్యా.. `అంటూ సౌండ్ చేస్తూ ఆ పాటని పాడారు భాస్కర్. దీంతో సత్య మొహం వాడిపోయింది. అంతటితో వదల్లేదు.. ఇదిగో అమ్మాయి మన దగ్గర చానా తాళాలు ఉన్నాయని అందరి ముందే భాస్కర్ కామెంట్ చేయడం పెద్ద రచ్చైపోయింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది.