- Home
- Entertainment
- కుటుంబానికి దూరం ఉండటానికి అసలు కారణం చెబుతూ కన్నీరు మున్నీరైన జబర్దస్త్ రీతూ.. శ్రీముఖి సర్‌ప్రైజ్‌తో...
కుటుంబానికి దూరం ఉండటానికి అసలు కారణం చెబుతూ కన్నీరు మున్నీరైన జబర్దస్త్ రీతూ.. శ్రీముఖి సర్‌ప్రైజ్‌తో...
`జబర్దస్త్` షోతో పాపులర్ అయ్యింది రీతూ చౌదరి. తాజాగా రాఖీ స్పెషల్ సందర్భంగా ఆమె తన తెరవెనుక లైఫ్‌ని తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది. తాను సినిమాల్లోకి రావడం ఇంట్లో ఇష్టం లేదని చెప్పి షాకిచ్చింది.

రీతూ చౌదరి ఇటీవల తరచూ హాట్ టాపిక్ అవుతుంది. ఆమె హాట్ హాట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌లో మంటలు పుటిస్తుంది. మరోవైపు ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసి షాకిచ్చింది. ఆమె ఓ పొలిటికల్ లీడర్‌ని పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె పంచుకున్న ఫోటో సైతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
`జబర్దస్త్`లో తనదైన పంచ్‌లతో అదరగొడుతుంది రీతూ చౌదరి. ఆ మధ్య సింగర్ యశస్వి కొండెపుడిని షోలోనే అందరి ముందు హగ్ చేసుకుని షాకిచ్చింది రీతూ చౌదరి. ఆ సంఘటనతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. అంతకు ముందు యూట్యూబ్ వీడియోలు,షార్ట్ ఫిల్స్మ్, సీరియల్స్ చేస్తూ రాణించింది రీతూ చౌదరి. ఈ సంఘటన తర్వాత ఆమెకి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.
అందులో భాగంగా `జబర్దస్త్` షోలోనూ మెరుస్తుంది. అందానికి తోడు ఇలాంటి కొంటెపనులతో పాపులర్ అవుతుంది. అమాయకత్వంలో ఆమెకి మరింత ప్రత్యేకంగా నిలిచింది. డైలాగ్ డెలివరీ సైతం నవ్వులు పూయించేలా ఉండటంతో జబర్దస్త్ కి బాగా సెట్ అయ్యింది. అయితే తాజాగా ఆమె `రాఖీ` పండుగ సందర్భంగా ఈటీవీ ప్లాన్ చేసిన స్పెషల్ ప్రోగ్రామ్ `హలో బ్రదర్`లో పాల్గొంది. ఇందులో `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఆర్టిస్టులు, కొందరు టీవీ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు.
అన్న చెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించేలా ఈ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశారు. అయితే ఇందులో మేల్, ఫీమేల్‌ఆర్టిస్టులు తమ సొంత అన్న, చెళ్లెళ్లని షోకి తీసుకొచ్చి రాఖీ కట్టించారు. లేని వారికి షోలోని వారితోనే రాఖీ కట్టించి అన్నా చెళ్లెలు అనుబంధాన్ని చాటి చెప్పారు. ఈసందర్భంగా డాన్సులు, ప్రత్యేక స్కిట్లు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఎమోషన్స్ ని పండించాయి. అన్నా చెళ్లెల మధ్య అనుబంధంలోని ప్రేమని చాటి చెప్పింది.
అందులో భాగంగా రీతూ చౌదరి వంతు వచ్చినప్పుడు తన గతాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టించింది రీతూ వర్మ. యాంకర్ శ్రీముఖి.. మీ బ్రదర్ ఎక్కడ అని ప్రశ్నించగా, రీతూ చౌదరి స్పందిస్తూ, వీళ్ల లాగా రాఖీ కట్టించుకోవడం మా అన్నయ్యకి ఇష్టం లేదు. ఎందుకంటే బేసిక్‌గా నేను ఇక్కడ ఉండటం ఆయనకు ఇష్టం లేదు అని చెప్పింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. రీతూ సైతంఎమోషనల్ అయ్యింది.
ఇంతలో శ్రీముఖి నీకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని తెలిపింది. అమ్ములూ అంటూ వాళ్లన్న గొంతువినిపించింది. అంతేకాదు ఆయన స్టేజ్‌పైకి వచ్చి రీతూని హగ్ చేసుకున్నారు. అన్నయ్యని ఇలా చూసిన రీతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యింది. ఈ సన్నివేశాలు మిగిలిన ఆర్టిస్టులను సైతం గుండె బరువెక్కేలా చేశాయి. ఇది షోకే హైలైట్ గా నిలిచింది.
మరోవైపు రాంప్రసాద్, హిమజ కలిసి చేసిన అన్నా చెల్లి స్కిట్ ఆద్యంతం ఆకట్టుకుంది. చెల్లికోసం చివర్లో చనిపోయిన తండ్రి విగ్రహాన్ని చూపించడం మరింతగా ఆకట్టుకుంది. `హల్ బ్రదర్` షో ఆదివారం సాయంత్రం ఏడుగుంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.