- Home
- Entertainment
- కలర్ తక్కువ అంటూ ఎగతాళి.. ఏడిపించే `జబర్దస్త్` కమెడియన్ ఫైమా లవ్ స్టోరీ.. ప్రియుడికే అమ్మగా..
కలర్ తక్కువ అంటూ ఎగతాళి.. ఏడిపించే `జబర్దస్త్` కమెడియన్ ఫైమా లవ్ స్టోరీ.. ప్రియుడికే అమ్మగా..
`బజర్దస్త్` షోతో పాపులర్ అయ్యింది ఫైమా. అదిరిపోయే పంచ్‌లతో బుల్లెట్ భాస్కర్‌తో కలిసి రచ్చ రచ్చ చేసే ఫైమా `బిగ్ బాస్ 6`లోకి అడుగుపెట్టింది. తన లవ్ స్టోరీ చెప్పి కన్నీళ్లు పెట్టించింది.

`జబర్దస్త్`(Jabardasth) కమెడియన్ ఫైమా(Faima బుల్లితెరపై ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. తాజాగా ఆమె బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6(Bigg Boss Telugu 6)లో 16వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తెలంగాణలోని దోమకుంట అనే మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఫైమా తన కష్టాల కడలిని వెల్లడించింది. నలుగురు ఆడపిల్లలు, కూలీ చేసుకునే కుటుంబం నుంచి వచ్చినట్టు తెలిపింది. ఊర్లో కనీసం బాత్ రూమ్ లు కూడా లేవని, చెట్ల చాటుకి వెళ్లేవాళ్లమని ఫైమా తల్లి చెప్పడం విశేషం.
35ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నట్టు చెప్పింది. ఓ ఇళ్లు కట్టుకోవడానికి బిగ్ బాస్ హౌజ్‌కి వచ్చానని చెప్పింది ఫైమా. వాచ్ మెన్ కూతురు బిగ్ బాస్ కి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. మూడేళ్ల క్రితం ఫైమా కెరీర్ ప్రారంభమైందని, ఏడాది చాలా కష్టపడాల్సి వచ్చిందని, గత ఏడాదిన్నరగా సక్సెస్‌స్టార్ట్ అయ్యింది.ఆ సక్సెస్‌కిదే నిదర్శమని తెలిపింది. హౌజ్‌లోకి వెళ్లాక తగ్గేదెలే అని వందకి వెయ్యి శాతం వినోదాన్ని ఇస్తానని పేర్కొంది ఫైమా.
బిగ్ బాస్ చూస్తున్నప్పుడు తాను కూడా అలాంటి షోస్‌కి వెళ్తే బాగుంటుందని తన ఫ్రెండ్స్ తో అన్నప్పుడు నీకెవడు ఛాన్స్ ఇస్తాడే కలర్ లేవు, సన్నగా ఉన్నావ్ అంటూ హెగతాలి చేశారని, వాళ్ల అన్న మాటకోసమైనా హౌజ్‌లోకి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నానని ఇప్పుడు బిగ్ బాస్ వరకు వచ్చానని తెలిపింది ఫైమా. ఇందులో గెలిచి సొంతిళ్లు కట్టుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది.
ఈ సందర్భంగా తన కామెడీతో కూడిన కన్నీళ్లు పెట్టించే ప్రేమ కథని వెల్లడించింది ఫైమా. ప్రవీణ్ అనే కుర్రాడితో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. అతనికి అమ్మ లేదని, తన కేరింగ్ చూసి తననే అమ్మగా భావిస్తాడని, ఐదు రోజుల క్రితం తండ్రి కూడా చనిపోయాడని, ఈ బాధాకరమైన టైమ్లో అతని వెంటా ఉండాల్సింది, కానీ తాను బిగ్ బాస్ లోకి వెళ్తేనే ఎక్కువగా సంతోషిస్తాడని తెలిపింది ఫైమా. అందుకే అతని కోసం బిగ్ బాస్ 6లోకి వచ్చినట్టు తెలిపింది.
ఇందులో నాగార్జున.. ఫైమాకి ఓ లెటర్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. తన ప్రియుడు ప్రవీణ్ రాసిన లెటర్ అది. తన ప్రేమ లేఖగా చెప్పడం విశేషం. ఆమెపై ప్రేమ ఉందనుకునిఈ లెటర్ రాస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఆమెని ఆటపట్టిస్తూ ఆసాంతం కామెడీగా రాశాడు ప్రవీణ్. తాను హౌజ్‌లోకి వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంటానని, నిన్ను చూసే బాధ తప్పిందని చెప్పడం విశేషం. ఆసాంతం ఫన్నీగా సాగిన ఈ ప్రేమ లేఖలో చివరగా కన్నీళ్లు పెట్టించాడు.
అమ్మలేని తనకు అమ్మవైనావని, కన్నీళ్లతో ఆగిన తన జీవితానికి ధైర్యాన్నిచ్చావని, అమ్మ లేని నా జీవితానికి దొరికిన అమ్మవి నువ్వని చెప్పడం ఆద్యంతం భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇందులో ఫైమా సైతం ఎమోషనల్ అయ్యింది. ఆమె లవ్ స్టోరీ ఆద్యంతం భావోద్వేగానికి గురి చేస్తుండటం విశేషం.