- Home
- Entertainment
- సుధీర్, గెటప్ శ్రీను బండారం బయటపెడతా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.. ఆర్పీతో పాటు వాళ్ళను ఏకిపారేసిన ఏడుకొండలు!
సుధీర్, గెటప్ శ్రీను బండారం బయటపెడతా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.. ఆర్పీతో పాటు వాళ్ళను ఏకిపారేసిన ఏడుకొండలు!
జబర్దస్త్ లో రగడ మొదలైంది. ఇటీవల వరుసగా స్టార్స్ ఆ షో నుండి బయటకు వెళ్లిపోయారు. అలాగే జబర్దస్త్ మాజీ టీం లీడర్ కిరాక్ ఆర్పీ దారుణమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.జబర్దస్త్ మేకర్స్ మంచి ఫుడ్ పెట్టరని, డబ్బులు తక్కువ ఇస్తారని, ఆర్టిస్ట్స్ శ్రమను దోచుకుంటూ కోట్లు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Sudigali Sudheer
మల్లెమాల సంస్థపై కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలను హైపర్ ఆది, షేకింగ్ శేషు, ఆటో రాంప్రసాద్ ఖండించారు. తాజాగా జబర్దస్త్ షో ప్రారంభం నుండి మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కిరాక్ ఆర్పీ ఆరోపణలు నేపథ్యంలో స్వచ్చంధంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీతో పాటు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుపై విరుచుకుపడ్డారు.
Kirak RP
స్వశక్తితో ఎదిగిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై కిరాక్ ఆర్పీ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తండ్రి ఎంఎస్ రెడ్డి సప్పోర్ట్ లేకుండానే స్నేహితుల సహకారంతో నిర్మాతగా మారి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గొప్ప చిత్రాలు నిర్మించారని, అన్నారు. ఒక నిర్మాత కష్టం ఏమి తెలుసని ఆర్పీ మాట్లాడుతున్నాడు. కిరాక్ ఆర్పీ జబర్దస్త్ ని వదిలి 4ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని ఏడుకొండలు నిలదీశాడు.
<p>Kirak Rp</p>
డైరెక్టర్ గా మారి ఆర్పీ నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్లు వెల్లడించారు. ఆర్పీ తన సినిమాకు మేనేజర్ గా చేయమంటే రూ. 50 వేల జీతానికి ఒప్పుకున్నాను. అయితే వీడిపై నాకు నమ్మకం లేదు. అడ్వాన్స్ గా ఇచ్చిన యాభైవేలు ఇంట్లోనే ఉంచాను. ఇక టెక్నీషియన్స్, నటులను ఎప్పటికప్పుడు మారుస్తూ గందరగోళం చేశాడు. చివరికి కొంత డబ్బులు ఖర్చు చేసి ఆ సినిమా చేయనని నిర్మాతలకు హ్యాండిచ్చాడు అంటూ కిరాక్ ఆర్పీ బండారం బయటపెట్టారు.
అలాగే సుధీర్, గెటప్ శ్రీనులను ఉద్దేశిస్తూ ఏడుకొండలు కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. గెటప్ శ్రీను జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడన్న ఏడుకొండలు.. అతడు వేరే షో చేసే ఛాన్స్ లేదన్నాడు. ఏదైనా మాట్లాడితే ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. తన వద్ద వాళ్లకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని ఏడుకొండలు అన్నారు.
ఇక ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి లైఫ్ ఇస్తే సుధీర్ కనీసం తన ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం పది సార్లు కాల్ చేస్తే ఒకసారి ఎత్తాడు. నేను విషయం చెప్పగానే నా మేనేజర్ తో మాట్లాడు అన్నాడు. నేను ఏ ఆర్టిస్ట్ మేనేజర్ తో మాట్లాడను. రోజా, నాగబాబులతోనే నేరుగా మాట్లాడేవాడిని, అన్నారు.
లైవ్ లో యాంకర్ సుడిగాలి సుధీర్ కి ఫోన్ చేయమని అడుగగా... ఏడుకొండలు చేశారు. సుడిగాలి సుధీర్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నలుగురు ఫ్యాన్స్, డబ్బులు రాగానే గతం మర్చిపోయారని ఏడుకొండలు ఎద్దేవా చేశాడు. నేను సినిమాల్లో బిజీ అంటాడు, సుధీర్ చేసిన ఏ సినిమా ఆడిందో చెప్పమనండి, నేను లైఫ్ ఇస్తే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేశారు.
జబర్దస్త్ కి పోటీగా మొదలైన కామెడీ స్టార్స్ కి కనీసం 5 టీఆర్పీ రావడం లేదు. ఆ మాత్రం టీఆర్పీ కూడా రాకపోతే వీళ్లకు ఇచ్చే పేమెంట్స్ దండగ అన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ టీఆర్పీ తగ్గినప్పటికీ కామెడీ స్టార్స్ కంటే మెరుగైన టీఆర్పీ రాబడుతున్నట్లు ఏడుకొండలు తెలిపారు. ఏడేళ్ల క్రితం మల్లెమాల సంస్థను వదిలేసిన ఏడుకొండలు మరలా తిరిగి వెళ్లే అవకాశం కలదన్నారు.