MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చేపల పులుసు వ్యాపారం వాళ్ళ భిక్షే... కిరాక్ ఆర్పీకి రాకింగ్ రాకేష్ జబర్దస్త్ పంచ్ లు

చేపల పులుసు వ్యాపారం వాళ్ళ భిక్షే... కిరాక్ ఆర్పీకి రాకింగ్ రాకేష్ జబర్దస్త్ పంచ్ లు

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం వాళ్ళ బిక్షే అంటూ కిరాక్ ఆర్పీకి చురకలు అంటించారు రాకింగ్ రాకేష్. యాంకర్ ప్రశ్నలకు సమాధానంగా ఆర్పీపై జబర్దస్త్ పంచ్లు వేశాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 08 2023, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Kiraak RP Rocking Rakesh

Kiraak RP-Rocking Rakesh

సీనియర్ జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు . ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం చర్చకు వచ్చింది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సక్సెస్ జబర్దస్త్ వలనే అంటారా? అని అడగడం జరిగింది. యాంకర్ ప్రశ్నకు సమాధానంగా... ఎవరు ఏం చేసినా అది జబర్దస్త్ బిక్షే. అది మల్లెమాల భిక్షే , అని రాకింగ్ రాకేష్ అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Kiraak RP-Rocking Rakesh

Kiraak RP-Rocking Rakesh


మరో ప్రశ్నగా... కిరాక్ ఆర్పీని మీరు ఎప్పుడైనా కలిశారా? అని అడగడం జరిగింది. కలవలేదు. మాకు అంత అదృష్టం లేదు. వాళ్ళు పెద్దోళ్ళు. మేమేదో చిన్న ఆర్టిస్టులం, అని రాకింగ్ రాకేష్ అన్నారు. ఈ మాట కిరాక్ ఆర్పీపై వేసిన వ్యంగ్యాస్త్రం అని క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే కిరాక్ ఆర్పీ మల్లెమాలను ఉద్దేశిస్తూ గతంలో అనేక ఆరోపణలు చేశారు. దీనిపై మీ కామెంట్? ఏమిటని యాంకర్ అడిగారు. 
 

37
Kiraak RP-Rocking Rakesh

Kiraak RP-Rocking Rakesh

నిజం ఏమిటనేది జనాలకు తెలుసు. దీనికి గురించి మాట్లాడటం అనవసరం. టైం వేస్ట్ టాపిక్ అని కొట్టిపారేశారు. ఆర్పీని ఉద్దేశించి రాకింగ్ రాకేష్ చేసిన మూడు కామెంట్స్ సెటైరికల్ గానే ఉన్నాయి. పరోక్షంగా కిరాక్ ఆర్పీ ఎంత  సక్సెస్ అయినా అది జబర్దస్త్ పుణ్యమే. ఆ షో వలన వచ్చిన గుర్తింపుతో సమకూరిందే అని రాకింగ్ రాకేష్ చెప్పకనే చెప్పాడు.

47
Kiraak RP-Rocking Rakesh

Kiraak RP-Rocking Rakesh

గతంలో కిరాక్ ఆర్పీ-రాకింగ్ రాకేష్ కలిసి అనేక స్కిట్స్ చేశారు. వీరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. 2019లో కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కి దూరమయ్యాడు. అందుకు ప్రధాన కారణం నాగబాబు అని చెప్పొచ్చు. ఆ ఏడాది నాగబాబు మల్లెమాల సంస్థ మీద తీవ్ర విమర్శలు గుప్పించి షో నుండి బయటకు వెళ్ళిపోయాడు. పోతూ పోతూ జబర్దస్త్ డైరెక్టర్స్ తో పాటు కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్రను, కొందరు కమెడియన్స్ ని తీసుకుపోయాడు. 
 

57
Kiraak RP

Kiraak RP

మరి కిరాక్ ఆర్పీతో రాకింగ్ రాకేష్ కి లొల్లేమిటో తెలియదు కానీ అతడిపై అసహనం ప్రదర్శించాడు. అన్నం పెట్టిన మల్లెమాల మీద విమర్శలు చేశాడనే కోపం కూడా కావచ్చని కొందరి అంచనా. రాకింగ్ రాకేష్ సెటైర్స్ పై కిరాక్ ఆర్పీ స్పందిస్తాడో లేదో చూడాలి. 
 

67
Kiraak RP

Kiraak RP

ఇటీవల కిరాక్ ఆర్పీ కొన్ని ఆసక్తికర ఆరోపణలు చేశారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని విమర్శలు గుప్పించాడు.  నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ పై కొందరు కక్ష కట్టారని.  తన సక్సెస్ చూసి ఓర్వలేని ఓ బ్యాచ్ వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని, కిరాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేశారు. నా షాప్ లో చేపల పులుసు రుచిగా లేదంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పెయిడ్ బ్యాచ్ పని. 
 

77
Kiraak RP

Kiraak RP

నేను అనేక రకాల చేపల పులుసులు అందుబాటులోకి తెచ్చాను. ఒకసారి తిన్న వాళ్ళు బాగుందని పది మందికి చెబుతున్నారు. నా కిచెన్ ఎలా ఉంటుందో, అక్కడ చేపల పులుసు ఎంత శుభ్రంగా, క్వాలిటీగా తయారు చేస్తారో నేను చూపించాను. చేపల పులుసు రుచిగా లేకపోతే ఎవరూ కొనరు. నెగిటివ్ ప్రచారం చేసి నా వ్యాపారం కూలదోయాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు.వారు ఎంతగా తప్పుడు ప్రచారం చేస్తే నాకు అంత మంచింది. ఆ విధంగా నా వ్యాపారానికి ఎక్కువ పబ్లిసిటీ దక్కుతుందని, కిరాక్ ఆర్పీ వెల్లడించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved