చచ్చి బ్రతికాను.. జబర్థస్త్ కమెడియన్ రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్..
తన జీవితంలో జరిగిన విషాదాలను ఆడియన్స్ తో పంచకున్నారు జబర్ధస్త్ కమెడియన్ రాజమౌళి. పది మందిని నవ్వించే ఆయన జీవితంలో ఎన్ని విషాదాలు ఉన్నాయ వివరించారు. ఇంతకీ రాజమౌళి ఏమంటున్నాడంటే..?
జబర్థస్త్ ఖత్తర్నాక్ కామెడీ షో... ఎక్కడో మారుమూలు ఉన్న టాలెంట్ ను వెండితెరకు పరిచయం చేసిన షో. సామాన్యులను సెలబ్రిటీలను చేసి.. పేదరికంలో మగ్గుతున్న టాలెంట్ ను.. కార్లలో తిరిగేలా చేసింది జబర్థస్త్. మన ఇళ్ల మధ్య చమత్కారాలు.. సరదా సంభాషణలు చేయగలిగిన వారిని కూడా స్టేట్ లెవల్ లో కామెడియన్స్ గా మార్చేసింది జబర్థస్త్.
ఈకార్యక్రమం ఎంతో మంది కమెడియన్స్ కు జీవితాన్ని ఇచ్చింది. అందులో చాలా మంది కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చి.. ఇక్కడ ఊరట పొందిన వారే. అందులో తాగుబోతు పాత్రకు పెట్టింది పేరైన రాజమౌళి కూడా ఉన్నారు. ఆయన తన జీవితం గురించి కరోనా వల్ల తనకు కలిగిన నష్టం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జబర్దస్త్ ను అప్పుడప్పుడు ఫాలో అయిన వారికి కూడా తెలిసిన పేరు కమెడియన్ రాజమౌళి. ఇక రెగ్యూలర్ గా ఈ షో ఫాలో అయ్యేవారికి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కామెడీ స్కిట్స్ లో తను తాగుబోతుగా ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు. అలాగే అమాయకమైన పాత్రలలోను తను జీవిస్తాడు. ఇక ఆయనలో ఉన్న మరో ప్రత్యేకత పాటలు బాగా పాడటం.
మరీ ముఖ్యంగా సిచ్యూవేషన్ కు తగ్గట్టు పాటలు రాసుకుని.. పేరడీ సాంగ్స్ పాడటంతో రాజమౌళిక ిమంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఇక తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చి నఇంటర్వూలో మాట్లాడుతూ.. మాది చాలా మారుమూల పల్లెటూరు .. అందువలన చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూశాను. ఆ సమయంలో వాళ్లు ఎలా మాట్లాడతారు .. ఎలా ప్రవర్తిస్తారు అనేది నాకు బాగా తెలుసు. అందుకే ఈ పాత్రలు పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నా అన్నారు.
ఇక నటన అనేది మా ఇంట్లోనే ఉంది.. అప్పట్లో మా నాన్న డ్రామాలు ఎక్కువగా వేసేవారు. ఆ డ్రామాలను చూస్తూ ఉండటం వలన నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. కాలేజ్ రోజులకి వచ్చేసరికి నటిస్తూ.. మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాను అన్నాడు. అయితే నటుడిగా నా కెరియర్ మొదలుపెట్టిన తరువాత నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు అన్నారు రాజమౌళి.
కానీ కరోనా సమయంలో అనారోగ్యంతో బాగా ఇబ్బందులు ఫేస్ చేశాను అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నాకు కరోనా వచ్చింది .. అది కూడా చాలా సీరియస్ అయింది. ఆ సమయంలో హాస్పిటల్లో చేర్చడం వలన చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. నేను చనిపోతాననే అంతా అనుకున్నారు. అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాను.. ఇది నాకు పునర్జన్మ అన్నారాయన. ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.