MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ.. గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్..

పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ.. గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్..

‘జబర్దస్’ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ  (Kirrak RP) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాజాగా బంధువులు, సన్నిహితుల మధ్య ఆర్పీ నిశ్చితార్థం  ఘనంగా జరిగింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 25 2022, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెరపై నవ్వులు పూయించిన ‘జబర్దస్త్’ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత కొద్ది నెలలుగా ఎలాంటి షోలో కనిపించని ఈయన ప్రస్తుతం ఓ ఇంటివాడయ్యేందుకు సిద్ధమయ్యాడు. 
 

26

‘జబర్దస్త్’ కామెడీషోలో వందల స్కిట్స్ చేశాడు ఆర్పీ. ఇతర టీం లీడర్లకు భిన్నంగా స్కిట్స్ రాస్తూ తన మార్క్ చూపించాడు. అయితే కొద్ది కాలంగా ఎవరికంట పడని ఆర్పీ తాజాగా పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. తాజాగా ఆయన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  
 

36

బుల్లితెరపై చాలా జంటలు కలిసి వర్క్ చేసి ఒక్కటవుతున్న తరుణంలో కిర్రాక్ ఆర్పీ కూడా పెళ్లి కొడుకుగా మారాడు. కొన్నేండ్లుగా  లక్ష్మీ అనే అమ్మాయితో ప్రేమలో మునిగితేలుతున్న ఆర్పీ తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం అందరికీ సర్ ప్రైజింగ్ ఉంది. 

46

 తాజాగా బంధువులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నాడు ఆర్సీ. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్లు, సినీ పరిశ్రమలో ఆయనకు సన్నిహితంగా ఉన్న మరి కొందరు హాజరైనట్టు తెలుస్తోంది. జబర్దస్త్ కెమెడియన్ ధన్ రాజ్ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. 

56

త్వరలోనే ఈ జంట మంచి ముహూర్తపు రోజున పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోంది. గతంలోనూ ఈ జంట చెట్టపట్టాలేసుకొని తిరిగారు. లక్ష్మీ నెల్లూరులో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఆర్పీ ‘జబర్దస్త్’ నుంచి నాగబాబు వెళ్లిపోయాక ఆయనతోనే పాటే వెళ్లిపోయాడు. మళ్లీ ‘అదిరింది’ షోలో కొద్ది రోజులు నవ్వులు పూయించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కనిపించాడు. 

66

ఆ మధ్యలో దర్శకుడిగానే తన కేరీర్ కొనసాగించాలని అనుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు. అన్నట్టుగానే నటుడు, నిర్మాత నాగబాబు, జేడీ చక్రవర్తి, రావు రమేష్ చేతుల మీదుగా తన  సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాడు. ఆయన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తుండగా.. సినిమాకు కొవ్వూరు అరుణాచలం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ అర్జుణ్ సంగీతం అందిస్తున్నారు.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన టాప్ 10 ఫొటోలు.. ఏ పోస్టుకు ఎన్ని లక్షల లైక్స్?
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?
Recommended image3
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved