జబర్దస్త్ డైరెక్టర్ నాతో అలా అన్నాడు... ఎట్టకేలకు అసలు మేటర్ బయటపెట్టిన యాంకర్ సౌమ్యరావు
జబర్దస్త్ షోకి ఉన్న క్రేజ్ వేరు. అనసూయ మానేయడంతో ఆమె స్థానంలోకి సౌమ్యరావును తెచ్చారు. సౌమ్యరావు సైతం జబర్దస్త్ నుండి తప్పుకుంది. అందుకు కారణాలు ఏమిటో సౌమ్యరావు బయటపెట్టింది.
జబర్దస్త్ షో లెజెండరీ కామెడీ షో అనడంలో సందేహం లేదు. ఈ షో వేదికగా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు. ముఖ్యంగా అనసూయ, రష్మీ గౌతమ్ ల ఫేట్ మార్చేసిన షో ఇది. ఏళ్ల తరబడి వీరిద్దరూ జబర్దస్త్ షోలో తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు. కాగా 2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది.
అనసూయ మానేయడంతో కొన్నాళ్ళు రష్మీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యరావును తెచ్చారు. ఏడాదికి పైగా సౌమ్యరావు జబర్దస్త్ షో చేసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఇటీవల సౌమ్యరావు తప్పుకుంది. ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ వచ్చింది. అయితే జబర్దస్త్ మానేయడం వెనుక కారణాలు సౌమ్యరావు వెల్లడించింది. కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు. నాకు తెలుగురాదు. తెలుగులో అందమైన అమ్మాయిలు ఉండగా ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు.
Sowmya Rao
నాకు యాంకర్ గా పెద్దగా అనుభవం లేదు. స్కిట్స్ లో జోక్స్ కూడా అర్థం అయ్యేవి కాదు. నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు. అలాగే నాకు డాన్స్ రాదు. అందుకు డాన్స్ క్లాసులకు కూడా వెళ్ళాను. నేను సన్నగా ఉంటాను. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను.
Sowmya Rao
అందుకే జబర్దస్త్ డైరెక్టర్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయకండి. ఇంకా సన్నగా అయితే బాగుండరు. కొంచెం తిని వళ్ళు చేయండి. డాన్స్ ఏదోలా మేనేజ్ చేయండి. దాని కోసం కష్టపడద్దు అన్నారు. నేను పాత యాంకర్స్ మాదిరి ఎంటర్టైన్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను... అని సౌమ్యరావు చెప్పుకొచ్చారు.
Sowmya Rao
పరోక్షంగా తనలోని కొన్ని లోపాల కారణంగా జబర్దస్త్ వీడాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పింది. సౌమ్యరావుకు తెలుగు రాకపోవడం, డాన్స్ రాకపోవడం కూడా మైనస్ అయ్యాయని సౌమ్యరావు మాటలను బట్టి చూస్తే అర్థం అవుతుంది. కాగా జబర్దస్త్ కి ఒకప్పటి క్రేజ్ లేదు. స్టార్స్ అందరూ వెళ్లిపోవడంతో గతంలో మాదిరి జనాలు చూడటం లేదు.
Sowmya Rao
నాగబాబు, రోజా, అనసూయ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి స్టార్స్ ఇప్పుడు జబర్దస్త్ లో లేరు. వీరు వివిధ కారణాలతో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు జబర్దస్త్ లో దాదాపు కొత్త సరుకే. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ పడటం లేదు.