త్వరలో రాజకీయాల్లోకి `జబర్దస్త్` యాంకర్‌ అనసూయ.. పదవి ఇప్పించేందుకు రోజా ప్లాన్‌?

First Published Feb 12, 2021, 10:59 AM IST

బుల్లితెర యాంకర్‌ అనసూయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఆమెకి పలు స్థానిక, జాతీయ పార్టీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయా? రోజా సహకారంతో పొలిటికల్‌ ఎంట్రీకి ప్లాన్‌ జరుగుతుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయని రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఆమె క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని కొన్ని పార్టీలు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.