యాంకర్ అనసూయ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు.. నిండైన చీరకట్టులో కనువిందు..
`జబర్దస్త్` యాంకర్ అనసూయపై ఎప్పుడూ సోషల్‌పై నెగటివ్ కామెంట్లు, ట్రోల్స్ జరుగుతుంటాయి. ఆమె ధరించే డ్రెస్ హాట్ టాపిక్ అవుతుంది. ఆమె గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

అనసూయ నిత్యం నెటిజన్లతో ఫైట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా జరిగింది. అనసూయ తనలోని మరో యాంగిల్‌ని చూపించింది.
తాజాగా హాట్ యాంకర్ అనసూయ సామాజిక బాధ్యతని చాటుకుంది. హ్యాండ్లూమ్‌ని ఎంకరేజ్ చేసింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు పూనుకుంది.
హ్యాండూమ్‌ని ప్రోత్సహించడంలో భాగంగా, దానికి పబ్లిసిటీ కల్పించడంలో భాగంగా అనసూయ చేనేత చీరకట్టులు హోయలు పోయింది. ఈ సందర్భంగా నిండైన చీరకట్టులో మురిసిపోయింది.
ఇందులో అనసూయ పేర్కొంటూ,`మీకు తెలుసు. నేను చేనేత, నేతతో కూడిన వస్త్రాల ధరించే విషయంలో విధేయతతో ఉంటానని తెలిపింది.
తాజాగా పంచుకున్న ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనసూయ చేసిన పనికి అభినందిస్తున్నారు.
అనసూయ యాంకర్స్ లో టాప్‌లో ఉన్నారు. సుమ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ అనసూయ సొంతం. అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్‌గానూ నిలిచింది.
`జబర్దస్త్` షోకి మాత్రమే యాంకరింగ్ చేస్తున్న అనసూయ సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుసగా అరడజన్‌కిపైగా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. రానురాను సినిమాల్లోనూ తన హవా కొనసాగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.