MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna: ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా భయపడిన కృష్ణ..18 పేజీల క్లైమాక్స్ తో దద్దరిల్లిన థియేటర్స్

Krishna: ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా భయపడిన కృష్ణ..18 పేజీల క్లైమాక్స్ తో దద్దరిల్లిన థియేటర్స్

సూపర్ స్టార్ కృష్ణ తాను నటించిన సినిమాని రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారు. కానీ ఆ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. అసలు ఆ మూవీలో నటించాలనే ఉద్దేశమే కృష్ణ గారికి ముందు లేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 10 2026, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Super Star Krishna
Image Credit : Asianet News

Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ అంటే టాలీవుడ్ లో సాహసాలకు మారుపేరు. ఎలాంటి నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకుని సినిమాలు రూపొందించేవారు కృష్ణ. కృష్ణ నటించిన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు సంచలన విజయం సాధించింది. ఆ మూవీ సాధించిన విజయం, మేకింగ్ పరంగా టాలీవుడ్ కి బెంచ్ మార్క్ గా నిలిచింది. కృష్ణ కీర్తి కిరీటంలో అల్లూరి సీతారామరాజు కలికితురాయి అనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కృష్ణ 200వ సినిమా
Image Credit : Youtube/ETV

కృష్ణ 200వ సినిమా

తన 200వ సినిమా కూడా అదే స్థాయిలో ఘనవిజయం సాధించే సినిమా కావాలని కృష్ణ గారు భావించారు. 80వ దశకం ప్రారంభంలో పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి నటించిన బంగారు భూమి అనే సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. అందులో 'మనిషిని నమ్ముకుంటే నోట్లో మట్టి కొడతాడు.. అదే మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది' అనే డైలాగ్ పరుచూరి బ్రదర్స్ రాశారు.

35
విప్లవాత్మక సినిమా
Image Credit : Asianet News

విప్లవాత్మక సినిమా

డైలాగ్ చాలా బావుంది రైటర్స్ ఎవరు అని కృష్ణ అడిగారట. పరుచూరి బ్రదర్స్ అని చెప్పగానే వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళతారు అని కృష్ణ జోస్యం చెప్పారు. ఈ విషయాలని పరుచూరి గోపాల కృష్ణ తన యూట్యూబ్ ఛానల్ లో గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారు 200వ సినిమాకి సమయం రానే వచ్చింది. అప్పటికి ఇంకా కృష్ణ గారు కథా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. అదే సమయంలో కృష్ణ మలయాళంలో సూపర్ హిట్ అయినా ఈనాడు సినిమాని చూశారు.ఆది విప్లవాత్మక సినిమా.

45
మీరే ఈ సినిమాలో హీరో
Image Credit : Eenadu

మీరే ఈ సినిమాలో హీరో

తన నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని కృష్ణ అనుకున్నారు. హీరోగా వేరే ఎవరినైనా పెట్టాలి అనేది కృష్ణ ఆలోచన. ఆ సినిమాలో హీరోగా నటించే ఉద్దేశం కృష్ణకి లేదు. పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి సినిమా చూడమని అడిగారు. పరుచూరి బ్రదర్స్ మూవీ చూసి చాలా బావుందని చెప్పారు. పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. మూవీ చాలా బావుంది అని కృష్ణకి చెప్పాం. అవునా అయితే మనం చేసేద్దాం. స్క్రిప్ట్ రెడీ చేయండి. హీరోగా ఎవరిని పెడదాం అని అన్నారు. ఎవరో హీరో ఏంటి.. మీరే హీరో అని చెప్పాం.

55
రిలీజ్ చేయడానికి కూడా భయపడిన కృష్ణ
Image Credit : Youtube

రిలీజ్ చేయడానికి కూడా భయపడిన కృష్ణ

దానికి కృష్ణగారు ఒప్పుకోలేదు. నా 200వ సినిమా చాలా గ్రాండ్ గా ఉండాలి. దీంట్లో పాటలు ఉండవు, హీరోయిన్ ఉండదు, ఎలా వర్కౌట్ అవుతుంది అని అడిగారు. నేను ఏదో ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో వేరే హీరోతో నిర్మిద్దాం అని అనుకుంటున్నా అని కృష్ణ గారు అన్నారు. లేదు కృష్ణగారు మీరే ఈ సినిమాలో హీరోగా చేయాలి. మేము సీన్ బై సీన్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తాం. మీకు వినిపిస్తాం. నచ్చితే చేయండి అని చెప్పాం. ఒరిజినల్ లో హీరోకి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉండదు. దీంట్లో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ని జోడించాం. కృష్ణ గారు భలే ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఆయన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎలా రాశామో తెలియదు ఈ సినిమాకి మేము 18 పేజీల క్లైమాక్స్ రాశాము. రిలీజ్ టైం దగ్గర పడింది. ఈ మూవీలో హీరోయిన్ ఉండదు, పాటలు అంతగా ఉండవు. ఇతర హీరోల సినిమాలు మాత్రం అదే సమయంలో మంచి పాటలు డ్యాన్సులతో రిలీజ్ అవుతున్నాయి. ఆ పోటీలో తన 100వ సినిమా ఈనాడు వర్కౌట్ అవుతుందో కాదో అని కృష్ణ గారు టెన్షన్ పడ్డారు.మూవీని రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారు. రిలీజ్ రోజున కృష్ణ గారు, మేము స్వయంగా థియేటర్ కి వెళ్లి సినిమా చూశాం. క్లైమాక్స్ లో డైలాగులకు థియేటర్ హోరెత్తిపోయింది. వెంటనే మీ జడ్జిమెంట్ కరెక్ట్ అని కృష్ణ గారు తమని అభినందించినట్లు పరుచూరి బ్రదర్స్ గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved